»   » ‘ఐటెం’ అని అనొద్దు.. పవన్ కల్యాణ్ ఇచ్చినా అలాంటి పాత్ర చేయను.. అనసూయ

‘ఐటెం’ అని అనొద్దు.. పవన్ కల్యాణ్ ఇచ్చినా అలాంటి పాత్ర చేయను.. అనసూయ

Posted By:
Subscribe to Filmibeat Telugu

విన్నర్ చిత్రం కోసం సూయ.. సూయ అంటూ స్టేప్పెసిన యాంకర్ అనసూయ ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్. ఆమె నర్తించిన స్పెషల్ సాంగ్ ప్రస్తుతం వైరల్‌గా మారింది. ఈ పాటతో విన్నర్‌పై మరింత అంచనా పెరిగింది. ఈ నేపథ్యంలో ఆమె ఇటీవల మీడియాతో మాట్లాడుతూ తన కెరీర్‌కు సంబంధించిన పలు విషయాలను పంచుకొన్నారు.

ప్రత్యేక పాటలో డ్యాన్స్ చేస్తానని..

ప్రత్యేక పాటలో డ్యాన్స్ చేస్తానని..

ఓ ప్రత్యేక పాటలో నర్తిస్తానని తాను ఎప్పుడూ అనుకోలేదని అనసూయ అన్నారు. ‘విన్నర్ కోసం స్పెషల్ సాంగ్ చేయడం చాలా సంతోషంగా ఉంది. పాటలో తన బుగ్గల గురించి ప్రస్తావించడం మరింత ఆనందంగా ఉంది. ఇలాంటి పాటను వదులుకుంటే నా అంత ఫూల్ మరొకరు ఉండేవారు కాదు' అని ఆమె అన్నారు.

అందుకే ఆచీతూచీ వ్యవహరిస్తున్నా..

అందుకే ఆచీతూచీ వ్యవహరిస్తున్నా..

ప్రస్తుతం తాను వెండితెర మీద బుజ్జి అడుగులు వేస్తున్నానని, అందుకే ఆచీతూచీ వ్యవహరిస్తున్నానని అనసూయ పేర్కొన్నారు. క్షణం చిత్రంలో విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకొన్నానని, అందుకే ఐటెం నంబర్లంటే భయమేస్తున్నదని చెప్పారు. ఐటెం పాటలు చేస్తే ఒక రకమైన ముద్ర పడుతుందని ఆమె అన్నారు.

సాయి ధరమ్‌తో డాన్స్ చేయడం..

సాయి ధరమ్‌తో డాన్స్ చేయడం..

తమన్ బీట్‌కు సాయి ధరమ్ తేజ్ లాంటి హీరో పక్కన స్టెప్పులు వేయడమంటే సామాన్యమైన విషయం కాదని అనసూయ అన్నారు. ఆ పాటలో నటించడం ఓ సవాల్ అని అన్నారు. ట్యూన్‌కు న్యాయం చేయడానికి చాలా కష్టపడి డ్యాన్స్ చేశానని ఆమె తెలిపారు.

ఐటెంసాంగ్ అనొద్దు.. స్పెషల్..

ఐటెంసాంగ్ అనొద్దు.. స్పెషల్..

సూయ.. సూయ లాంటి పాటలను ఐటెం సాంగ్ అని పిలువ వద్దని అనసూయ అన్నారు. అలాంటి పాటలు స్పెషల్ సాంగ్స్ అని పేర్కొన్నారు. ఐటెం అనే పదం శారీరక సంపదను సూచిస్తుందని, చాలా అసౌకర్యంగా ఉంటుందని ఆమె తెలిపారు. మగవాళ్ల కంటే ఆడవాళ్లు ఏమాత్రం తీసిపోరని, ఏదైనా తేడా ఉందంటే శారీరకమైన మార్పులేనని అన్నారు.

షారుక్, సల్మాన్ ఖాన్‌ను అలా పిలువరే..

షారుక్, సల్మాన్ ఖాన్‌ను అలా పిలువరే..

బాలీవుడ్‌లో షారుక్, సల్మాన్ ఖాన్ లాంటి ఇలాంటి పాటలు చేస్తారని, ఆ సమయంలో ఐటెం సాంగ్ అని ఎందుకు అనరు. సినీ పరిశ్రమలో పురుషాధిక్యత ఉంటుందని, అందుకే అలాంటి పదాలు హీరోలకు వాడరని ఆమె అన్నారు. ఇలాంటి మాటలు మాట్లాడితే తనను ఫెమినిస్ట్ అని భావించవద్దని ఆమె అన్నారు.

అలాంటి పాత్ర ఇస్తే చేయను..

అలాంటి పాత్ర ఇస్తే చేయను..

క్షణం చిత్రంలోని లాంటి పాత్రను పవన్ కల్యాణ్ ఆఫర్ చేస్తారా అనే పాత్రపై అనసూయ స్పందించారు. అలాంటి పాత్రను ఇచ్చినా చేయనని, అంతకు భిన్నమైన పాత్రలను ఎంపిక చేసుకొంటానని చెప్పారు. పాత్ర బాగుంటే తప్పకుండా చేస్తానన్నారు.

English summary
Anchor Anasuya's special song 'Suyaa Suyaa' from 'Winner' has been creating a lot of buzz. She revealed secret doing the special songs in the movies.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu