»   » బాలీవుడ్లో మేమంతా చెడిపోయాం: సుస్మితా సేన్

బాలీవుడ్లో మేమంతా చెడిపోయాం: సుస్మితా సేన్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: నటి సుస్మితా సేన్ బాలీవుడ్ చిత్ర పరిశ్రమపై సంచలన కామెంట్స్ చేసింది. బాలీవుడ్లో నటీనటులంతా చెడిపోయారంటూ వ్యాఖ్యానించింది. ఆమె తన తొలి బెంగాలీ చిత్రం ‘నిర్బాక్' చిత్రంలో నటిస్తున్న నేపథ్యంలో ఇక్కడ ప్రతిభావంతులైన నటీనటులు, సిబ్బందితో పని చేస్తున్నట్లు ఉప్పొంగిపోయిన ఆమె ఈ వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశం అయింది

‘బెంగాళీలోనే కాక భారత దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన బెస్ట్ యాక్టర్లతో కలిసి పని చేయడం గౌరవంగా భావిస్తున్నాను. వివిధ వయసుల వారితో కలిసి చేసారు.....కానీ నేను ఒక్కటి చెప్పదలుచుకున్నాను. బాలీవుడ్లో మేమంతా చెడిపోయాం' అంటూ సుస్మితా సేన్ చెప్పింది. అమ్మడు బాలీవుడ్ మీద ఏ ఉద్దేశ్యంతో ఈ వ్యాఖ్యలు చేసిందో అర్థం కావడం లేదు.

We are spoilt in Bollywood: Sushmita

‘మేము చూడటానికి బాగా కనిపిస్తాం....మా పని మేము పూర్తి చేసాం. ఇక్కడ ఎంతో మంది నటులు వారి పాత్రల్లో జీవిస్తారు. వందల సినిమాల్లో నటించిన వారు బంక మట్టిలా వారి వారి పాత్రల్లో ఒదిగి పోతారు' అని సుస్మితా సేన్ వ్యాఖ్యానించింది.

జాతీయ అవార్డు విన్నర్ శ్రీజిత్ ముఖర్జీ సారథ్యంలో తెరకెక్కుతున్న ‘నిర్బాక్'(మాటల్లో చెప్పలేనిది అని అర్థం) చిత్రంలో జిష్ణు సేన్ గుప్తా, నటుడు-దర్శకుడు అంజన్ దత్, రిత్విక్ చక్రబర్తి నటిస్తున్నారు. 22 రోజుల్లో సినిమాను పూర్తి చేసారు. మే 1న ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ మంచి రెస్పాన్స్ సొంతం చేసుకుంది.

నేను మాతృ బాష బెంగాళీలో సినిమా చేయాలనేది నా త్రండ్రి కోరిక. ఇన్నాళ్లకు కుదిరింది. బెంగాళీ ఉచ్ఛారణ విషయంలో జాగ్రత్తగా ఉంటున్నాను. ఎందుకంటే బెంగాళీ విషయంలో నా ఉచ్చారణ సరిగా ఉండదు. శ్రీజిత్ చాలా హెల్ప్ చేస్తున్నాడు అని సుస్మితా సేన్ చెప్పుకొచ్చింది.

English summary
Elated at having worked with a talented cast and crew in her first Bengali film "Nirbaak", former Miss Universe and Bollywood actress Sushmita Sen said actors in the Hindi film industry are "spoilt".
Please Wait while comments are loading...