'రోబో' రిలీజ్ కోసం రామ్ చరణ్ సినిమాని...అల్లు శిరీష్
రామ్ చరణ్, రాజమౌళి కాంబినేషన్ లో వచ్చిన మగధీర తమిళంలోకి మన్నాది మన్నాన్ డబ్బింగ్ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా రిలీజ్ కొంత టైమ్ కావాలంటున్నాడు అల్లు శిరీష్. ఆయన ట్విట్టర్ లో ఈ విషయం ప్రస్దావిస్తూ...మన్నాది మన్నన్(మగధీర తమిళ్) రెడీ. కానీ మేం రోబో రిలీజ్ కోసం వెయిట్ చేస్తున్నాం. ఆ తర్వాత మేం తమిళనాడులో ఎటాక్ చేస్తాం. అలాగే నేను తమిళంలో ఓ చిత్రం నిర్మిస్తాను. అయితే వెంటనే కాదు. భవిష్యత్ లో అల్లు అర్జున్ తో ప్లాన్ చేస్తున్నాను. కొంత టైమ్ పడుతుంది అని వ్యాఖ్యానించారు.
ఇక తన చిత్రాలకు మాత్రమే మాటలు రాసుకునే నటుడు, రచయిత, దర్శకుడు కె. భాగ్యరాజా తొలిసారి 'మన్నాది మన్నన్" కు మాటలు రాస్తున్నారు. అలాగే సీనియర్ గేయ రచయిత వాలి పాటలు రాస్తున్నారు. ఈ చిత్ర తమిళ హక్కులను కలైపులి యస్. ధాను సొంతం చేసుకున్నారు. సునీల్ కామెడీ ట్రాక్ ను వడివేలుతో రీషూట్ చేసారు..60వ దశకంలో యం.జి.ఆర్ నటించిన 'మన్నాది మన్నన్" టైటిల్ తో తెలుగు మగధీర తమిళంలోకి జూన్ లో అడుగుపెడుతున్నాడు. రామ్ చరణ్ తమిళంలో తన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పడం విశేషం.


Click it and Unblock the Notifications











