twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    దొరకడు....అలాంటిదేమీ లేదంటున్న పవన్ నిర్మాత!

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో ‘అత్తారింటికి దారేది' చిత్రాన్ని నిర్మించిన ప్రముఖ నిర్మాత బివిఎస్ఎన్ ప్రసాద్ త్వరలో నాగ చైతన్య, క్రితి సానన్ జంటగా ఓ సినిమా రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి సుధీర్ వర్మ దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈచిత్రానికి ‘దొరకడు' అనే టైటిల్ పరిశీలిస్తున్నట్లు వార్తలు వెలువడ్డాయి. అయితే నిర్మాత అలాంటి దేమీ లేదని, ఈ చిత్రానికి ఇంకా ఏ టైటిల్ ఖరారు చేయలేదని స్పష్టం చేసారు.

    ఈ సినిమా గురించి నిర్మాత బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ మాట్లాడుతూ 'అత్తారింటికి దారేది' తర్వాత మా బేనర్లో చేస్తున్న ఈ సినిమా మరో డిఫరెంట్ మూవీ అవుతుంది. సుధీర్ వర్మ సబ్జెక్టు చాలా డిఫరెంటుగా ఉంది. నాగ చైతన్యకు హండ్రెడ్ పర్సెంట్ సూట్ అయ్య కథ ఇది. నాగ చైతన్య కూడా కథ విని చాలా ఎక్సైట్ అయ్యారు. ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా చాలా లావిష్‌గా ఈ చిత్రాన్ని ప్లాన్ చేస్తున్నాం' అన్నారు.

    We are yet to finalise the title : BVSN Prasad

    దర్శకుడు సుధీర్ వర్మ మాట్లాడుతూ 'అత్తారింటికి దారేది వంటి ఇండస్ట్రీ హిట్ నిర్మించిన ప్రసాద్ గారి బేనర్లో సినిమా చేయడం నా అదృష్టంగా భావిస్తున్నాను. స్వామి రారా తర్వాత నేను చేస్తున్న ఈ సినిమా నాగ చైతన్యకు పూర్తి యాప్ట్ అవుతుంది. అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే అంశాలు ఈ చిత్రంలో చాలా ఉన్నాయి. ఈ సినిమా నా కెరీర్‌కి మంచి టర్నింగ్ పాయింట్ అవుతుంది' అన్నారు.

    ఈ చిత్రంలో బ్రహ్మానందం, పోసాని కృష్ణ మురళి, రవిబాబు, రావు రమేష్, ప్రవీణ్, పూజ, సత్య తదితరులు ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. సంగీతం: సన్నీ ఎం.ఆర, సినిమాటోగ్రఫీ: రిచర్డ్ ప్రసాద్, ఎడిటర్: కార్తీక శ్రీనివాస్, ఆర్ట్: నారాయణరెడ్డి, పాటలు: శ్రీమణి, కృష్ణ చైతన్య, కో డైరెక్టర్: విజయ్ సిహెచ్, స్టిల్స్: శ్రీను, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: సుధీర్ ఈదర, సమర్పణ: బాపినీడు, నిర్మాత: బి.వి.ఎస్.ఎన్ ప్రసాద్, కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం: సుధీర్ వర్మ.

    English summary
    BVSN Prasad condemned rumours about his next film Naga Chaitanya and said, “We are yet to finalise the title and we will announce it very soon. I’m happy with Sudheer Varma’s script and our team is very confident on this film”.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X