రాణి పద్మావతి బాటలో ఆత్మాహుతి చేసుకుంటాం: ‘పద్మావత్’ మూవీకి వ్యతిరేకంగా రోడ్డెక్కిన మహిళలు!

By Bojja Kumar

Recommended Video

రాణి పద్మావతి బాటలో ఆత్మాహుతి.. రోడ్డెక్కిన మహిళలు !

సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో దీపిక పదుకోన్, రణవీర్ సింగ్, షాహిద్ కపూర్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన 'పద్మావత్' సినిమా విడుదల నిలిపి వేసే వరకు రాజ్ పుత్ గ్రూఫులు విశ్రమించేట్లు కనిపించడం లేదు. తాజాగా రాజ్ పుత్ ఉమెన్ గ్రూఫు ఈ చిత్రానికి వ్యతిరేకంగా రోడ్డెక్కారు.

జౌహర్ స్మృతి సంస్థాన్

జౌహర్ స్మృతి సంస్థాన్

‘పద్మావత్' చిత్రం విడుదలపై నిషేదం విధించాలని డిమాండ్ చేస్తూ రాజస్థాన్‌కు చెందిన ‘జౌహరి స్మృతి సంస్థాన్' అనే మహిళా గ్రూపు ఆందోళనకు దిగింది. దాదాపు 200 మంది మహిళలు ఈ సినిమాకు వ్యతిరేకంగా రోడ్డుమీదకు వచ్చి ర్యాలీ నిర్వహించారు.

రాణి పద్మావతి దారిలోనే ఆత్మాహుతి చేసుకుంటాం

రాణి పద్మావతి దారిలోనే ఆత్మాహుతి చేసుకుంటాం

‘పద్మావత్' సినిమాపై నిషేదం విధించని పక్షంలో తామంతా ఆత్మహత్య చేసుకుంటామని హెచ్చరించారు. 1303 సంవత్సరంలో రాణి పద్మావతి 16000 మంది రాజ్ పుత్ మహిళలతో కలిసి ‘స్వాభిమాన్' ఆత్మాహుతి చేసుకున్న విధంగా తామంతా ఆత్మాహుతి చేసుకుంటామని హెచ్చరించారు.

రాష్ట్రపతి, ప్రధాని, గర్నవర్నర్, ముఖ్యమంత్రికి మెమొరండం

రాష్ట్రపతి, ప్రధాని, గర్నవర్నర్, ముఖ్యమంత్రికి మెమొరండం

ఈ మేరకు జౌహర్ స్మృతి సంస్థాన్ నుండి రాష్ట్రపతి, ప్రధాన మంత్రి, రాజస్థాన్ గవర్నర్, ముఖ్యమంత్రి కార్యాలయాలకు మెమోరండం పంపారు. రాజ్ పుత్ వంశీయుల, మహిళల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఉన్న ‘పద్మావత్' సినిమాను ప్రదర్శించడానికి వీల్లేదని డిమాండ్ చేశారు.

కోర్టు నుండి గ్రీన్ సిగ్నల్, అయినా ఆగని ఆందోళనలు

కోర్టు నుండి గ్రీన్ సిగ్నల్, అయినా ఆగని ఆందోళనలు

సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో తెరకెక్కిన 'పద్మావతి' చిత్రంపై కొన్ని రోజులుగా వివాదం నెలకొన్న సంగతి తెలిసిందే. ఆ వివాదాలన్నీ దాటుకుని, సెన్సార్ అడ్డంకులు తొలగించుకుని.... 'పద్మావత్' గా పేరు మార్చుకుని జనవరి 25న విడుదలవుతున్న ఈ చిత్రాన్ని..... రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌, గుజరాత్‌, హరియాణా, హిమాచల్‌ ప్రదేశ్‌ రాష్ట్రాలు శాంతిభద్రతల పరిరక్షణ పేరుతో అడ్డుకోవడాన్ని సుప్రీం కోర్టు తప్పుబట్టింది. శాంతి భ‌ద్ర‌త‌ల‌ను కాపాడాల్సిన బాధ్య‌త రాష్ట్రాల‌దేన‌ని, ఆ కార‌ణంతో ‘పద్మావత్' సినిమా విడుద‌లను అడ్డుకోవ‌డం తగదని సుప్రీం కోర్టు తేల్చిచెప్పింది.

‘పద్మావత్‌’ విడుదలపై మరోసారి ఆలోచించండి అంటున్న రాజస్థాన్, మధ్యప్రదేశ్ ప్రభుత్వాలు

‘పద్మావత్‌’ విడుదలపై మరోసారి ఆలోచించండి అంటున్న రాజస్థాన్, మధ్యప్రదేశ్ ప్రభుత్వాలు

ఈ చిత్రం విడుదల గురించి మరోసారి ఆలోచించాలని కోరుతూ రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌ ప్రభుత్వాలు సుప్రీం కోర్టులో పిటిషన్‌ వేశాయి. శాంతి భద్రతల సమస్య దృష్ట్యా తమ రాష్ట్రాల్లో సినిమా విడుదలను ఆపాలని పిటిషన్‌లో కోరారు. ఈ పిటిషన్‌ను న్యాయస్థానం మంగళవారం పరిశీలించనుంది.

మొదటి నుండి అడ్డంకులే

మొదటి నుండి అడ్డంకులే

సంజ‌య్ లీలా భ‌న్సాలీ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రానికి మొద‌ట్నుంచి ఆటంకాలే ఎదుర‌వుతున్నాయి. రాజ్‌పుత్ రాణుల ఆత్మ‌గౌర‌వానికి భంగం క‌లిగించేలా సినిమా ఉండ‌బోతోంద‌ని క‌ర్నిసేన, కొన్ని హిందూ సంఘాలు ఈ చిత్రంపై ఆందోళన చేయడంతో సెన్సార్ బోర్డు చరిత్ర కారుల సమక్షంలో ఈ చిత్రాన్ని సెన్సార్ చేసి సర్టిఫికెట్ జారీ చేసింది.

నిర్మాతలకు నష్టాలు

నిర్మాతలకు నష్టాలు

దాదాపు రూ.200 కోట్ల బడ్జెట్‌తో ‘పద్మావత్' చిత్రాన్ని నిర్మించారు. దీపిక పదుకోన్ ఈ సినిమాలో రాణి పద్మావతి పాత్రలో నటించారు. పద్మావతి భర్త మహారావల్‌ రతన్‌ సింగ్‌ పాత్రలో షాహిద్‌ కపూర్‌, అల్లావుద్దీ‌న్‌ ఖిల్జీ పాత్రలో రణ్‌వీర్‌ సింగ్‌ నటించారు. ఈ చిత్రం విడుదల ఆగిపోతే నిర్మాతలకు భారీ నష్టం తప్పదు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X