For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  మా కుటుంబంలోనూ కొన్ని సమస్యలు ఉన్నా... : కళ్యాణ్ రామ్

  By Srikanya
  |

  హైదరాబాద్ : మేమంతా ఒకే కుటుంబం కదండీ! గతాన్ని తవ్వుకోదలుచుకోలేదు. మునుపటితప్పులు మళ్ళీ జరగకూడదని జాగ్రత్త పడుతుంటా. 1983 వరకు మా తాత గారి దగ్గర ఉమ్మడి కుటుంబంలో పెరిగినవాణ్ణి. కుటుంబ బంధాలు, విలువలు తెలుసు. ఎప్పుడూ వాటికి విలువనిస్తా అన్నారు కళ్యాణ్ రామ్. అనిల్‌ రావిపూడిని దర్శకుడిగా పరిచయం చేస్తూ నందమూరి కల్యాణ్‌రామ్‌ నటించి, నిర్మించిన ‘పటాస్‌' సినిమా ఇటీవల విడుదలై విజయవంతంగా ప్రదర్శించబడుతోంది. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇలా స్పందించారు.

  మేం కలిసే ఉంటాం. ప్రతి ఫ్యామిలీలోనూ కొన్ని సమస్యలు ఉంటాయి. కానీ మనం సర్దుకుపోవాలి. తాతగారు నమ్మే మాట ఇది. ఆయన కుటుంబానికి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చేవారు. నాకు నాలుగేళ్ల వయసు వరకూ ఉమ్మడి కుటుంబంలోనే ఉండే వాళ్లం. కుటుంబం ఇచ్చే బలం లోకంలో మరెవ్వరూ ఇవ్వలేరు. నా ఆస్తి, నా బలం అంతా నా కుటుంబమే అంటూ చెప్పుకొచ్చారు కళ్యాణ్ రామ్.

  ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

  We're United - Kalyan Ram Says

  నా కుటుంబమే నాకు బలం. మా గురించి ఎంతమంది ఎన్ని అనుకున్నా మేం ఏమిటో మాకు తెలుసు. ప్రస్తుతం ‘కిక్‌-2' షూటింగ్‌ జరుగుతోంది. ‘షేర్‌' సినిమా కొంత టాకీ, 5 పాటలు చిత్రీకరించాల్సి ఉంది. బాబాయ్‌, తమ్ముడు ఎన్టీఆర్‌, నేను కలిసి ఓ సినిమా చేస్తాం. దానికి సంబంధించిన గ్రౌండ్‌ వర్క్‌ జరుగుతోంది. ఆ పనులు పూర్తయ్యాక వివరాలు వెల్లడిస్తా అన్నారు. బాలకృష్ణ బాబాయ్ కూడా సినిమా చూసి, సంతోషించారు. తమ్ముడు తారక్ (చిన్న ఎన్టీయార్) 'అన్నా! నీ కెరీర్‌లో అత్యుత్తమ అభినయం!' అంటూ మెచ్చుకున్నాడు.

  అన్ని కుటుంబాలలో లాగానే మాకూ చిన్న చిన్న అలకలు, కోపతాపాలు ఉంటాయి. అయితే, అవేవీ శాశ్వతం కాదు. అన్నీ వచ్చిపోతుంటాయి. మేమంతా ఎప్పుడూ ఒక్కటే! ఎప్పటికైనా 'మనం' లాగా మా కుటుంబంలో మా నాన్న, బాబాయ్, నేను, తమ్ముడు తారక్ - ఇలా మూడు తరాల వాళ్ళం కలసి సినిమా చేయాలని నా కోరిక. అలాంటి అవకాశం, అదృష్టం మన తెలుగు పరిశ్రమకే ఉండడం విశేషం.

  అలాగే... కలసి ఉంటే కలదు సుఖం.. అనే మాట నమ్ముతా. అందరూ కలసి ఓ కుటుంబంగా ఉండడంలో ఆ బలమే వేరు. అన్నయ్య జానకీరామ్‌ లేకపోవడంతో మా కుటుంబం పెద్ద అండ కోల్పోయింది. మేం చాలా అన్యోన్యంగా ఉండేవాళ్లం. నాన్న తరవాత నాన్న అన్నంత ప్రేమ నాకు. ఎందుకంటే నాన్న సినిమాలతో బిజీగా ఉన్నప్పుడు నా వ్యవహారాలన్నీ అన్నయ్యే చూసుకొనేవారు.

  We're United - Kalyan Ram Says

  ప్రతి విషయాన్నీ అన్నయ్యతో కలసి పంచుకొనేవాణ్ని. అన్నయ్యకు పటాస్‌ హిట్టవుతుందని బలమైన నమ్మకం ఉండేది. ఫస్ట్‌లుక్‌ బయటకు వచ్చిన రోజు 'నాన్నా! ఈ సినిమా బాగుంటుంది. 'పటాస్‌' తరవాత నీకంతా మంచే జరుగుతుంది' అన్నారు. అన్నయ్య లేకపోవడం పెద్ద లోటు. ఈ సమయంలో బాబాయ్‌, తమ్ముడు అందించిన సహకారం, ఇచ్చిన స్త్థెర్యం మర్చిపోలేను అని చెప్పుకొచ్చారు.

  ఇక కష్టాల్లో ఉన్నప్పుడు నా కుటుంబం, స్నేహితులే నాకు దైర్యానిచ్చారు. ఎంత కష్టమొచ్చినా ఇండస్ట్రీ వదిలి వెళ్ళాలనుకోలేదు. తాతగారు మాకు చూపించిన దారి ఇది. ఈ వృత్తితోనే మేం నాలుగు మెతుకులు తినగలుగుతున్నాం. దీనిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. నేను సినిమాల్లో యాక్ట్‌ చేస్తూనే నా ప్రొడక్షన్‌ హౌస్‌ను కూడా అభివృద్ధి చేస్తున్నాను.

  'పటాస్‌' విషయానికి వస్తే...

  We're United - Kalyan Ram Says

  కళ్యాణ్ రామ్ హీరోగా రూపొందిన 'పటాస్‌' చిత్రం 10 రోజుల క్రితం విడుదలై విజయవంతంగా నడుస్తున్న సంగతి తెలిసిందే . రచయితగా పలు చిత్రాలకి పనిచేసిన అనీల్ రావిపూడి ఈ చిత్రం ద్వారా దర్శకుడుగా పరిచయమయ్యారు. ఈ చిత్రం మార్నింగ్ షో కే హిట్ టాక్ తెచ్చుకుంది. ఈ నేపధ్యంలో చిత్రం శాటిలైట్ రైట్స్ ని పోటీపడి జీ తెలుగు ఛానెల్ సొంతం చేసుకున్నట్లు సమాచారం. 4.30 కోట్లకు ఈ రైట్స్ అమ్ముడు పోయినట్లు టీవీ వర్గాల్లో వినపడుతోంది. కళ్యాణ్ రామ్ సినిమాను టీవి కు కొందమా వద్దా అనే స్ధాయి నుంచి ఈ చిత్రం ఒక్కసారిగా...పోటీ పడి భారీ రేటుకు అమ్ముడయ్యే స్దితికి తెచ్చింది.

  కలెక్షన్స్ పరిశీలిస్తే. ప్రపంచ వ్యాప్తంగా పది రోజులకు 12 కోట్లు రాబట్టిందని ట్రేడ్ వర్గాల సమాచారం. ఈ చిత్రం థియోటర్ రైట్స్ మొత్తం 9 కోట్లు కు అమ్ముడు పోవటంతో ఆల్రెడీ మూడు కోట్లు లాభంలో ఉన్నట్లు. ఈ రేంజిలో కలెక్షన్స్ రావటం కళ్యాణ్ రామ్ కెరిర్ లో రికార్డే. ఈ 10 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా ఫస్ట్ వీకెండ్ (షేర్) : రూ 11.73 crore (కర్ణాటక& దేశంలో మిగిలిన ప్రాంతాలు కలిపి: Rs 70 లక్షలు; ఓవర్ సీస్: Rs 60 లక్షలు) సాధించింది.

  English summary
  Kalyan Ram has confirmed that Nandamuri family will be united even if there are small fights among the family members.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X