Related Articles
నీది నాదీ ఒకే కథ రీమేక్‌పై రూమర్లు.. క్లారిటీ ఇచ్చిన కార్తీ!
పందెం కోడి సంచలన నిర్ణయం.. తగ్గే ప్రసక్తే లేదు!
అభిమాని మరణం తట్టుకోలేక ఏడ్చేసిన హీరో కార్తి (ఫోటోస్)
''ఖాకి కలెక్షన్స్ సూపర్''
మంచి కలెక్షన్స్ వస్తున్నాయి...!
అలాంటి మంచి వాళ్ళ కోసమే ఈ సినిమా..
సీటు చివరన కూర్చున్నా: ఖాకీపై దర్శకుడు శంకర్ ట్వీట్
నా సినిమా పైరసీలో చూడు, కానీ ఒక పని చెయ్యి..: హ్యాట్సాఫ్ ఆర్.ఎస్. ప్రభు
జీవితం నాశనం అవుతున్నది.. అలాంటి వారి చేతులు నరకాలి.. రకుల్ ప్రీత్ సింగ్
ఖాకీ మూవీ రివ్యూ: పోలీస్ పవర్ చూపించిన కార్తీ
ఆ విషయం పవన్ కళ్యాణ్‌ని అడగండి నన్ను కాదు: రకుల్‌ప్రీత్ సింగ్
''ఇలాంటి కారెక్టర్ చెయ్యలేదు....!''
నాగార్జున చేసాడు... ఇప్పుడు మహేష్ కూడా, తమిళ మార్కెట్ కోసమేనా ఇదంతా..!?
యుగానికి ఒక్కడు, నాపేరు శివ, ఊపిరి వంటి సినిమాలతో ఆకట్టుకున్న కార్తీ, ప్రస్తుతం 'కాష్మోరా' అనే సినిమా చేస్తున్నాడు. ఇటీవలే ఈ చిత్ర ఫస్ట్ లుక్ రిలీజ్ అయి నెట్ లో హల్చల్ చేస్తోంది. డార్క్ ఫాంటసీ మూవీగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో కార్తీ మూడు పాత్రలు పోషిస్తున్నాడట. రాజ్య సైనిధికారీ రాజ్ నాయక్, నేటితరం యువకుడు, రహస్యాన్ని చేధించే పాత్ర ఇలా మూడు విభిన్న పాత్రలలో కనిపించనున్నాడు కార్థి.
అయుఇతే ఈ సినిమా కోసం పడ్డకష్టం తన తొలి సినిమా "యుగానికొక్కడు" ని గుర్తుకు తెచ్చిందట. ఇటీవల విడుదల చేసిన ఫస్ట్‌లుక్‌కు మంచి స్పందన వస్తోంది. గుండు, గడ్డంతో కార్తి కొత్తగా కనిపిస్తున్నారు. హారర్, థ్రిల్లర్ నేపథ్యంలో సాగే చిత్రమిది.
నయనతార, శ్రీ దివ్య హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ చిత్రంలో రత్న మహారాణిగా నయన్ కనిపించనుందట. ఆ రాజ్యానికి సైనికాధికారే రాజ్ నాయక్ పాత్ర అని అంటున్నారు. దేవి అనే మోడ్రన్ అమ్మాయిగా శ్రీదివ్య కనిపించనున్నదట. ఇంకో విషయం ఏమిటంటే చేతబడుల నేఫథ్యంగా హారర్ థ్రిల్లర్ గా ఈ సినిమా ఉంటుందని టాక్.
గోకుల్ డైరెక్షన్ లో పివిపి బ్యానర్ పై దాదాపు 60 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మితమవుతున్న ఈ చిత్రానికి 'బాహుబలి' సినిమాకు గ్రాఫిక్స్ సమకూర్చిన మకుట సంస్థ గ్రాఫిక్స్ అందిస్తుండగా, కబాలి సినిమాకు సంగీతం అందించిన సంతోష్ నారాయణ్ సంగీతం అందిస్తున్నాడు. దీపావళి కానుకగా ఈ సినిమాను ఎట్టి పరిస్థితుల్లో తెలుగు, తమిళ భాషల్లో రిలీజ్ చేయడానికి దర్శక నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.ఈ సినిమా విషేషాలు కొన్ని....
అసలు అది కార్తినేనా?
ఇటీవల విడుదలైన ఈ సినిమా ఫొటోలు చూస్తే అందరికీ ఆశ్చర్యం కలుగుతోంది. అసలు అది కార్తినేనా?.. అని అందరూ సందేహం వ్యక్తం చేస్తున్నారు. ఎంతో భిన్నంగా కనిపిస్తుండటంతో ఈ చిత్రంపై ఆసక్తి పెరిగింది.
మూడు భిన్నమైన గెటప్‌లలో
ఇందులో కార్తి మూడు భిన్నమైన గెటప్‌లలో కనిపించనున్నట్లు సమాచారం. మూడు కాలాలో జరిగే కథతో ఈ సినిమా రాబోతోంది.
ఒకటీ రెండూ కాదు
నిజానికి ఇందులో భిన్నమైన గెటప్‌ల కోసం ముందుగా 47 గెటప్‌లను తీర్చిదిద్దారట దర్శకులు. దీనికోసం ఏకంగా ఏడు నెలల శ్రమించి ఆ 47 గెటప్‌లు రూపొందించారు.
రెండు దర్బార్ సెట్‌లు
ఇదిలా ఉండగా ఇందులో పీరియడ్ సన్నివేశాల కోసం చెన్నై ఔట్ స్కర్ట్స్ లో రెండు దర్బార్ సెట్‌లను వేశారు. చూస్తూనే ఖర్చు భారీగానే అయ్యిందని తెలిసిపోతోంది.
కార్తీ మూడు పాత్రలు పోషిస్తున్నాడు
డార్క్ ఫాంటసీ మూవీగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో కార్తీ మూడు పాత్రలు పోషిస్తున్నాడట. రాజ్య సైనిధికారుడు రాజ్ నాయక్, నేటితరం యువకుడు, రహస్యాన్ని చేధించే పాత్ర ఇలా మూడు విభిన్న పాత్రలలో కనిపించనున్నాడు కార్థి.
మహారాణిగా నయన్
నయనతార, శ్రీ దివ్య హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ చిత్రంలో రత్న మహారాణిగా నయన్ కనిపించనుందట. ఆ రాజ్యానికి సైనికాధికారే రాజ్ నాయక్ పాత్ర అని అంటున్నారు.
చేతబడుల కథ
దేవి అనే మోడ్రన్ అమ్మాయిగా శ్రీదివ్య కనిపించనున్నదట. ఇంకో విషయం ఏమిటంటే చేతబడుల నేఫథ్యంగా హారర్ థ్రిల్లర్ గా ఈ సినిమా ఉంటుందని టాక్.
హర్రర్, యాక్షన్
అసలు ఆ సెట్‌ను చూస్తేనే.. హర్రర్, యాక్షన్ అంశాలు ఉట్టిపడేలా రూపుదిద్దినట్లు సంబంధిత వర్గాలు చెబుతున్నాయి.
దీపావళి కానుకగా
మొత్తానికి ప్రస్తుతం నిర్మాణాంతర పనుల్లో బిజీ బిజీగా ఉన్న ఈ సినిమా దీపావళి సందర్భంగా తెరపైకి రావడానికి సంసిద్ధమవుతోంది. దీపావళి కానుకగా భిన్నమైన వినోదాన్ని పంచనుంది.
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి | Subscribe to Telugu Filmibeat.