twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    'పద్మశ్రీ' వివాదంపై మంచు విష్ణు స్పందన

    By Srikanya
    |

    Manchu Vishnu
    హైదరాబాద్ : గత కొంత కాలంతా తన తండ్రి మోహన్‌బాబు పద్మశ్రీ వివాదంపై ఆయన కుమారుడు మంచు విష్ణు స్పందించారు. గురువారం ఆయన హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ ఈ విషయమై స్పష్టత వచ్చిందని అన్నారు. ఈ విషయంలో ఎందుకు వివాదం జరుగుతోందో అర్దం కావటం లేదంటూ వాపోయారు. రాష్ట్రంలో చాలా సమస్యలున్నాయి...అవన్నీ వదిలేసి మా నాన్నగారి విషయంలో పద్మశ్రీ గురించే అందరూ ఎందుకు దృష్టి సారిస్తున్నారో అర్థం కావడం లేదు అని అన్నారు.

    మంచు విష్ణు మాటల్లో... ''పద్మశ్రీ విషయంలో ఎందుకు వివాదం రేగుతోందో అర్థం కావడం లేదు. ఇప్పటికే ఈ పురస్కారం అందుకున్న ఎంతో మంది సినిమా టైటిల్స్‌లో వాడుకున్నారు. మోహన్‌బాబుగారి విషయంలో దీన్నో పెద్ద విషయం చేస్తున్నారు. పద్మశ్రీ పురస్కారం విషయంలో ఉన్న నియమ నిబంధనల విషయంలో మాకో స్పష్టత వచ్చింది. పేరుకి ముందుగానీ, వెనుకగానీ పద్మశ్రీ అని రాసుకోకూడదు. పేరు తర్వాత 'రాష్ట్రపతి నుంచి పద్మశ్రీ పురస్కారం అందుకున్న వ్యక్తి' అనే అర్థం వచ్చేలా రాసుకోవచ్చు. దీన్ని మేము 'దూసుకెళ్తా' సినిమాలో ఆచరిచాం. ఇక్కడితో ఈ వివాదం సమసిపోతుందని అనుకుంటున్నాం'' అని తెలిపారు.

    ఇక అయినా పద్మశ్రీ వివాదం గురించి నను ఎక్కువగా చెప్పను. ఇప్పిటి వరకు పద్మశ్రీ పురస్కారాలు అందుకున్న చాలా మంది వాళ్ళ పేర్ల ముందు పద్మశ్రీ అని పెట్టుకున్నారు. కోర్టు తీర్పు తరువాత మాకు కొన్ని విషయాలపై స్పష్టత వచ్చింది. అవార్డు పొందిన వారు వారి పేరు ముందు గానీ, వెనక గానీ పద్మశ్రీ అని వాడుకోకూడదు. పేరు తర్వాత రాష్ట్రపతి నుంచి పద్మశ్రీ పురస్కారం పొందిన అని రాసుకోవచ్చు. ఇకపై మా నాన్న విషయంలో ఇలాగే చేస్తాం. నాన్న పేరుకి గానీ ఎవరి పేరుకి గానీ పద్మశ్రీ ముందు పెట్టుకుంటే నాలుగు టిక్కెట్లు ఎక్కువ తెగవు.. అలాగే రికార్డులు సొంతమైపోవు. దీన్నిఇక్కడితో వదిలేద్దాం అన్నారు.

    మంచు ఫ్యామిలీ హీరోలంతా కలిసి చేస్తున్న ఫ్యామిలీ ఎంటర్టైనర్ 'పాండవులు పాండవులు తుమ్మెద'. జనవరి 31 అనగా ఈ రోజు భారీ ఎత్తున ప్రేక్షకుల ముందుకు రానుంది. మంచు విష్ణు మాట్లాడుతూ ' పాండవులు పాండవులు తుమ్మెద సినిమాలో నాన్నే అసలైన హీరో. మేమంతా ప్రత్యేక ఆకర్షణ మాత్రమే. సినిమా చూసి వచ్చే వారికి మనోజ్ లేడీ పాత్ర బాగా గుర్తుంటుంది. అంతలా ఆ పాత్ర డామినేట్ చేస్తుంది. అసలు ఆ పాత్రని నన్ను చేయమంటే నేను చేయలేను. అలాగే సినిమాకి పని చేసిన అందరూ అద్భుతమైన పనితీరును కనబరిచారని' అన్నాడు.

    English summary
    
 
 Vishnu Manchu declared that Mohan Babu will be using Padma Shri title as prescribed by the law. "We used the title following due procedure in Doosukeltha and we will use it in the forthcoming film — Pandavulu Pandavulu Thummeda (PPT) as well," he said.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X