»   » హాట్ న్యూస్: 29న పార్వతి మిల్టన్ వివాహం

హాట్ న్యూస్: 29న పార్వతి మిల్టన్ వివాహం

By Srikanya
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
  హైదరాబాద్: 'వెన్నెల', 'మధుమాసం', 'జల్సా' లాంటి చిత్రాల్లో నటించిన పార్వతి మిల్టన్ త్వరలో పెళ్లిపీటలు ఎక్కుతోంది. ఆమె కొన్నాళ్లుగా ముంబయిలోనే ఉంటోంది. ఆ నగరానికే చెందిన శంషు లలానీ అనే బిల్డర్‌తో ఉన్న పరిచయం ప్రేమగా మారింది. ఇప్పుడు వారిద్దరూ ఒకింటి వారు కాబోతున్నారు. ఈ నెల 29న పార్వతి, శంషుల వివాహం ముంబయిలో జరగబోతోంది. ఈ విషయాన్ని టాలీవుడ్‌లో తనకు సన్నిహితులైన దర్శకులకీ, నటులకు ఆమె తెలియజేసినట్లు సమాచారం.

  ప్రస్తుతం పార్వతి మిల్టన్ ..పూరీ జగన్నాధ్ తమ్ముడు సాయిరామ్ శంకర్ తాజా చిత్రం 'యమహో యమః' లో హీరోయిన్ గా చేస్తోంది. శ్రీహరి యముడుగా చేస్తున్న ఈ చిత్రం షూటింగ్ పూర్తై విడుదలకు రెడీ అయ్ియంది. ఈ చిత్రం కథ ప్రకారం...పాపుల చిట్టా చూడాల్సిన యమధర్మరాజు అమెరికా వీధుల్లో ప్రత్యక్షమవుతాడు. అక్కడి వరకూ బాగానే ఉంది... ఎవరితో మాట్లాడదామన్నా భాషాపరమైన సమస్య. యముడికి ఆంగ్లంతో వచ్చిన చిక్కులు ఎలాంటివి? విషయం తెలుసుకున్న ఆయన భక్తుడు ఎలా స్పందించాడనే పాయింట్ చుట్టూ తిరుగుతుంది. వరాలిచ్చే దేవుళ్లను అందరూ పూజిస్తారు. ఆయువు తీరగానే తీసుకెళ్లిపోయే యముడి పేరు చెబితేనే కంగారుపడతారు. కానీ ఓ యువకుడు మాత్రం యమ నామ జపం చేశాడు. ఎందుకు? ఏం సాధించాడు? అన్నది తెర మీదే చూడమంటున్నారు.

  యముణ్ని భక్తితో ఆరాధించే యువకుడిగా హీరో పాత్ర ఉంటుంది. ఆ చిత్రంలో సాయిరామ్ క్యారెక్టర్ గురించి దర్శకుడు జితేందర్‌.వై మాట్లాడుతూ... పొద్దున లేవగానే రామా.. కృష్ణా... అని తలచుకొనే భక్తుల్ని చూశాం. శివుడికీ, శ్రీ వెంకటేశ్వరస్వామికీ దండం పెట్టుకొనేవాళ్లనీ చూస్తుంటాం. కానీ ఓ యువకుడు మాత్రం నిత్యం యమనామ జపం చేస్తుంటాడు. యమధర్మరాజుకి అపరభక్తుడిగా మారిన ఆ యువకుడి కథేమిటో తెలియాలంటే మా చిత్రం చూడాల్సిందే అన్నారు. అలాగే... ఒక యమభక్తుడు సృష్టించే సందడితో ఆద్యంతం సరదాగా సాగే చిత్రమిది. యమధర్మరాజు అమెరికా వెళ్లాల్సిన అవసరం ఎందుకొచ్చిందనే విషయాన్ని తెరపైనే చూడాలి. వినోదం, భావోద్వేగాల మేళవింపుతో కథ సాగుతుంది. యమధర్మరాజుగా శ్రీహరి నటన ప్రేక్షకుల్ని మెప్పిస్తుంది అన్నారు.

  English summary
  Parvathi Melton who has acted in many Telugu films including Vennela and Pawan Kalyan's Jalsa is all set to marry her boyfriend Shamsu Lalani. Parvathi Melton has reportedly been dating this Mumbai based real estate business person, the reports suggest. Even the wedding date is fixed it seems. On December 29th, she will be getting married to him, sources told us.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more