For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  హీరో నితిన్ ఇంట పెళ్లి సందడి

  By Srikanya
  |

  హైదరాబాద్ : హీరో నితిన్ ఇంట్లో పెళ్లి సందడి మొదలైంది. ఆయన సోదరి (సుధాకరరెడ్డి కుమార్తె..నిర్మాత నిఖిత రెడ్డి) వివాహం త్వరలో జరగబోతోంది. నిఖిత..అఖిలేష్ రెడ్డిని వివాహం చేసుకుంటోందని సమాచారం. మార్చి 15న ఈ వివాహం హైదరాబాద్ లోని ఓ ప్రెవేట్ వెన్యూలో జరుగుతోంది. చాలా సంప్రదాయబద్దంగా ఈ వివాహం చేయనున్నారు. ఈ లోగా మార్చి 10న ఓ ఫార్మల్ ఎంగేజ్మెంట్ పంక్షన్ జరగనుంది. ఈ లోగా వీరిద్దరూ తమ సన్నిహితులకు పార్టీ ఇస్తున్నారు.

  ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

  నిఖిల్ ప్రస్తుతం నిర్మిస్తున్న చిత్రం విషయానికి వస్తే...

  అఖిల్‌ అక్కినేని హీరోగా శ్రేష్ఠ్‌ మూవీస్‌ పతాకంపై ఓ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. సాయేషా సైగల్‌ హీరోయిన్. వి.వి.వినాయక్‌ దర్శకత్వం వహిస్తున్నారు. సుధాకర్‌రెడ్డి, నితిన్‌ నిర్మాతలు. ఈ చిత్రం గురించి ఓ ఆసక్తికరమైన న్యూస్ బయిటకు వచ్చింది. ఈ చిత్రంలో విలన్ గా బాలీవుడ్ నటుడు, దర్శకుడు మహేష్ ముంజ్రేకర్ చేస్తున్నారు. గతంలో ఎన్టీఆర్, అఖిల్ ల కాంబినేషన్ లో రూపొందిన అదుర్స్ లో మహేష్ ముంజ్రేకర్ విలన్ గా చేసారు. ఆ అనుబంధంతో మహేష్ ముంజ్రేకర్ ని తీసుకువచ్చి నటింప చేస్తున్నట్లు తెలుస్తోంది.

  దర్శకుడు వినాయక్‌ ఎప్పట్లాగే చిత్రాన్ని శరవేగంగా చిత్రీకరిస్తున్నారని నిర్మాతల్లో ఒకరైన నితిన్‌ తెలిపారు. వెలిగొండ శ్రీనివాస్‌ కథతో రూపొందుతున్న ఈ చిత్రానికి తమన్‌, అనూప్‌రూబెన్స్‌ సంగీతం అందిస్తున్నారు. కోన వెంకట్ - గోపి మోహన్ రచనా సహకారంతో పాటు మాటలు రాస్తున్నారు.

  Wedding Bells Ringing at Nithin's House

  మనం సినిమాతో అఖిల్‌ను పరిచయం చేయాలనే ఆలోచన నాన్నగారిదే. తను ఎక్కువ రోజులు బతకననే నాన్న ఉద్ధేశ్యంతోనే అఖిల్ అరంగేట్రం ఆలోచన పుట్టింది.ఇలాంటి శుభతరుణంలో ఆయన మన మధ్య లేకపోవటం చాలా బాధాకరం అని అన్నారు నాగార్జున.

  వివి వినాయిక్ మాట్లాడుతూ...''నాగార్జునగారు నాపై పెట్టుకున్న నమ్మకమే ఈ సినిమా. 'మనం'లో అఖిల్‌ను చూడగానే అందరిలా నేనూ షాక్‌కు గురయ్యా. అంత బాగా నచ్చేశాడు. ఎంత నచ్చాడో ఈ చిత్రంలో చూపిస్తాను.వంద శాతం కష్టపడే సాంకేతిక బృందం కుదిరింది. ప్రతి ప్రేక్షకుడికీ నచ్చేలా అఖిల్‌ను తెరపై చూపిస్తానని మాటిస్తున్నాను''అన్నారు వి.వి.వినాయక్‌.

  వెంకటేష్‌ మాట్లాడుతూ... ''అఖిల్‌ రూపంలో ఒక కొత్త స్టార్‌ రాబోతున్నాడు. ఇక అక్కినేని అభిమానులకు పండగే. అఖిల్‌ ఏ పని చేసినా మనసు పెట్టి చేస్తాడు. వినాయక్‌ దర్శకత్వంలో తెరంగేట్రం అవ్వడం ఆనందంగా ఉంది''అన్నారు.

  కె.రాఘవేంద్రరావు మాట్లాడుతూ... ''విక్టరీ మధుసూదనరావుగారి చేతుల మీదుగా తెరకు పరిచయమయ్యారు నాగార్జున. ఒక 'వి' ఉన్న దర్శకుడి చేతులమీదుగా పరిచయమైన నాగార్జున మంచి పేరు తెచ్చుకొన్నాడు. మూడు 'వి'లు ఉన్న వినాయక్‌ చేతులమీదుగా పరిచయమవుతున్న అఖిల్‌ మరింత పేరు తెచ్చుకొంటాడు''అన్నారు.

  నాగచైతన్య మాట్లాడుతూ... ''ఈ రోజు కోసం ఎప్పట్నుంచో ఎదురు చూస్తున్నా. సినిమా అంటే అఖిల్‌కు ప్రాణం. తాను చేసే ప్రతి సినిమా ఒక ట్రెండ్‌ సెట్టర్‌ అవుతుందన్న నమ్మకముంది. దేశంలోని సినిమా అభిమానులందరినీ ఆకట్టుకొంటాడన్న నమ్మకముంది''అన్నారు.

  నితిన్‌ మాట్లాడుతూ... ''ప్రతిష్ఠాత్మకమైన ఈ సినిమాకు నేను నిర్మాత కావడం ఆనందంగా ఉంది. నాగార్జునగారు మాపై పెట్టుకొన్న నమ్మకాన్ని నెరవేర్చుతాం. ఆయన చేసిన ప్రేమకథా చిత్రాలు 'గీతాంజలి', 'నిన్నే పెళ్లాడతా'.. మాస్‌ సినిమాలు 'శివ', 'మాస్‌' కలిపితే ఎలా ఉంటుందో అఖిల్‌ చేసే ఈ సినిమా అలా ఉంటుంది''అన్నారు.

  నాగార్జున మాట్లాడుతూ...''అఖిల్‌ను 'మనం' రూపంలో నాన్న ఆశీర్వదించారు. అఖిల్‌కు సూపర్‌ హిట్‌ సినిమా ఇస్తామని వినాయక్‌, నితిన్‌ మాటిచ్చారు. ఈ కథ నేనూ విన్నాను. చాలామంది ఇదొక ప్రేమకథ అనుకొంటున్నారు. అది నిజం కాదు. సినిమా నిండా మాస్‌ అంశాలు ఉన్నాయి''అన్నారు నాగార్జున.

  అమల మాట్లాడుతూ....''అందరిలాగే అఖిల్‌ సినిమా గురించి నేనూ ఎదురు చూస్తున్నా. మా అబ్బాయిని అభిమానుల చేతుల్లో పెడుతున్నాను''అన్నారు.

  అఖిల్‌ మాట్లాడుతూ.... ''ఈ సమయంలో తాతగారు ఉంటే బాగుండు అనిపిస్తోంది. ఆయన అభిమానుల్లోనే దేవుడిని చూసుకొనేవారు. అభిమానులు ఎంతో ఇస్తారు. మేం తిరిగి వాళ్లకు హిట్‌ సినిమా తప్ప ఏం ఇవ్వగలం. ఎలాగైనా హిట్‌ సినిమాతోనే ప్రేక్షకుల ముందుకు రావాలనుకొన్నా. దాని గురించే ఆలోచిస్తూ నాన్నను అడిగేవాణ్ని. అప్పుడు చీకట్లో ఉన్న నాకు ఒక సెర్చ్‌లైట్‌లా కనిపించారు వి.వి.వినాయక్‌గారు. ఇలాంటి సినిమాకు వినాయక్‌గారే దర్శకత్వం వహించాలని నాకనిపించింది.

  అలాగే...కేవలం అభిమానుల కోసమే తొలి సినిమా చేయాలని నితిన్‌ చెబుతూ ఉండేవాడు. ఆయన నా సినిమాకు నిర్మాత కావడం ఆనందాన్నిచ్చింది. ఇందులో యాక్షన్‌, డ్యాన్స్‌ అన్నీ కొత్తగా ఉంటాయి. మూడు నాలుగేళ్లుగా డ్యాన్స్‌ నేర్చుకుంటున్నా. అందరికీ నచ్చేలా తెరపై కనిపిస్తా. ఈ సినిమాకు తమన్‌, అనూప్‌ రూబెన్స్‌ కలసి సంగీతం అందిస్తారు''అన్నారు.

  నేను ఈ స్థాయికి చేరుకోవటానికి అమ్మనాన్నలే ముఖ్య కారణం. అన్నయ్య నాగచైతన్య ఇంత ఎమోషనల్ మాట్లాడటం ఎప్పుడూ చూడలేదు. భవిష్యత్‌లో మేమిద్దరం కలిసి ఓ పెద్ద మల్టీస్టారర్ సినిమా చేస్తాం అన్నారు అఖిల్.

  English summary
  Nithin's sister, daughter of Sudhakar Reddy and lady producer of Tollywood Nikitha Reddy is getting married. Nikitha is going to marry Akhilesh Reddy. Both Nikitha and Akhilesh are going to tie the knot on March 15 in Hyderabad at a private venue.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X