»   »  పెళ్ళి పీటలు ఎక్కనున్న యువ హీరో

పెళ్ళి పీటలు ఎక్కనున్న యువ హీరో

Posted By:
Subscribe to Filmibeat Telugu
Shashank
'ఐతే' సినిమాతో పరిచయమైన యంగ్ తరంగం శశాంక్. ప్రతిభ గల నటుడు గా పేరు తెచ్చుకున్నా తర్వాత ఊహించిన విధంగా క్రేజి ఆఫర్లు రాలేదు. ఆ క్రమంలో 'పార్టీ' లాంటి పాచి సినిమాలు ఒకటి రెండు చేసినా వర్కవుట్ కాలేదు. యేలేటి దర్శకత్వంలో వచ్చిన 'అనుకోకుండా ఒక రోజు' మాత్రమే అతన్ని పరిశ్రమ మళ్ళీ గుర్తు చేసుకునేలా చేసింది. అయినా ఆఫర్లు రాలేదు. దాంతో అతను కెరీర్ మాట ఇప్పుడు కాకపోతే రేపన్నా సెటిల్ అవుతుంది...ముందు వయస్సు వెళ్ళి పోకుండా లైఫ్ లో సెటిల్ అయితే మేలు అని డిసైడ్ చేసుకున్నాడు. పరిశ్రమ వర్గాల కథనం ప్రకారం అతను త్వరలో పెళ్ళి చేసుకోబోతున్నాడు. వాసవి బ్యాంక్ ఎక్స్ చైర్మెన్ రోహిత్ కుమార్ కుమార్తె పెళ్ళి కూతురు. ప్రస్తుతం అతను అమ్మ రాజశేఖర్ 'బీబత్సం' సినిమాకు నటిస్తున్నాడు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X