»   » నాని 'సెగ'రిజల్ట్ ఏమిటి?

నాని 'సెగ'రిజల్ట్ ఏమిటి?

Posted By:
Subscribe to Filmibeat Telugu

నాని,నిత్యామీనన్ కాంబినేషన్ లో రూపొందిన సెగ చిత్రం ఈరోజు తమిళ,తెలుగు భాషల్లో విడుదలైంది. ఈ చిత్రం టెక్నికల్ గా మంచి మార్కులు వేయించుకున్నా భాక్సాఫీస్ వద్ద నిలబడటం కష్టమేనంటున్నారు.అలా మొదలైంది చిత్రానికి మొదలైనట్లు పాజిటివ్ టాక్ ఈ చిత్రానికి ఏ సెంటర్ నుంచి కూడా పెద్దగా రావటం లేదు.బాగోలేదని చెప్పటం లేదు కాని నచ్చినట్లుగా చెప్పటం లేదు.ముఖ్యంగా చిత్రంలో నేటివిటీ మిస్సైందని ఇనానమస్ గా చెప్తున్నారు.తమిళ వాసనలతో డబ్బింగ్ సినిమా చూసిన ఫీల్ వస్తోందని అంటున్నారు.అలా మొదలైందిలా రొమాంటిక్ కామిడీ ఆశించి వెళ్ళినవారికైతే పూర్తి నిరాస కలుగుతోంది.

అయితే సినిమాలో నాని మాత్రం చాలా బాగా ఫెరఫార్మెన్స్ చేసాడు.నిత్యామీనన్ ఎప్పటిలాగే చాలా సహజంగా నటించి పారేసింది.ఎక్కడా మెలోడ్రామాకు చోటివ్వకుండా ఎక్సప్రెషన్స్ ఇచ్చింది.అయితే స్క్రిప్టులోపమే సినిమాని ఇబ్బందికరంగా మార్చిందని సగటు ప్రేక్షకుడుకి అది ఇబ్బందిగా మారిందని చెప్తున్నారు.వెరైటీ స్క్రీన్ ప్లే అనుకున్నది చాలా ప్రెడిక్టబుల్ గా తయారై ఆసక్తి లేకుండా చేసింది.అందులోనూ ముఖ్యంగా తెలుగువారికి నచ్చి వెతుక్కునే కామిడీ,రొమాన్స్ మిస్సవటం కూడా దెబ్బే నంటున్నారు.అంతేగాక సినిమాకి అవసరమైన స్నేహం,ప్రేమ ఎమోషన్స్ ని మరింత బాగా పండిస్తే వాటి ఆధారిక సీన్స్ బాగా పండి ఎమోషనల్ బ్యాలెన్స్ అయ్యేదని చెప్తున్నారు.నెగిటివ్ టాక్ రాని ఈ చిత్రం ఈ వీకెండ్ ని బాగా క్యాష్ చేసుకునే అవకాశం ఉంది.

English summary
Sega movie coming with high expectations since Nani and Nitya Menon already delivered a hit in the form of 'Ala Modalaindi' directed by Nandini Reddy and both the versions of Sega (bilingual movie) has been shot simultaneously.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu