For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  'విశ్వరూపం' హిందీ విడుదల పరిస్ధితి ఏంటి?

  By Srikanya
  |

  హైదరాబాద్ :విశ్వరూపం చిత్రం హిందీలో విడుదలవుతుందా లేదా అన్నది ఇప్పుడు అందరిలో ప్రశ్నగా మారింది. ఈ శుక్రవారం దేశవ్యాప్తంగా హిందీలో ఇది విడుదల కావాల్సి ఉంది. కానీ ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో ఫిబ్రవరి ఆరో తేదీ వరకు ఇది విడుదలయ్యే అవకాశం కనిపించడంలేదు. కానీ ఈ చిత్రం హిందీ వెర్షన్ రైట్స్ సొంతం చేసుకున్న బాలాజీ మోషన్ పిక్చర్స్ వారు మాత్రం అనుకున్న షెడ్యూల్ ప్రకారం ఈ చిత్రం పిబ్రవరి 1 న విడుదల అవుతుందని చెప్తున్నారు.

  బాలాజీ మోషన్ పిక్చర్స్ హెడ్ గిరీష్ జోహార్ మీడియాతో మాట్లాడుతూ... "మొదట అనుకున్న షెడ్యూల్ ప్రకారం ఈ చిత్రం విడుదల అవుతుంది. మేము 800 స్క్రీన్స్ లో దేశం మొత్తం ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నాం. కాంట్రావర్సికి హిందీ వెర్షన్ కి సంభంధం లేదు. అయితే సెన్సార్ సర్టిఫికేట్ వచ్చిన తర్వాత ఓ చిత్రాన్ని ఆపాలని ప్రయత్నించటం మాత్రం చాలా విచారకరం... ," అన్నారు.

  ఇక అమెరికా, కెనడా దేశాల్లో ఇంగ్లిష్ సబ్‌టైటిల్స్‌తో ఈ చిత్రం ఈనెల 25న విడుదలైంది. మొదటి మూడు రోజుల్లో రూ.4కోట్లు వసూలుచేసింది. తెలుగులోనూ ఈ చిత్రం మంచి కలెక్షన్స్ వసూలు చేస్తోంది. తమిళనాడులో మాత్రం ఈ చిత్రం వివాదం రోజు రోజుకీ పెద్దదవుతోంది. కమల్ కి మద్దతు పలికే వారి సంఖ్య పెరుగతోంది. మంగళవారం అర్ధరాత్రి తీర్పుతో అంతా ముగిసిపోయిందనుకుంటే అంతలోనే కల్లోలం మొదలైంది. 'విశ్వరూపం' విడుదల కాబోతుందని అభిమానులు సంబరాలు జరుపుకునేందుకు సిద్ధమవుతుండగానే మరోసారి నిషేధం పిడుగు పడింది. ప్రభుత్వం దాఖలు చేసిన మరో పిటీషన్‌పై విచారణ జరిపిన హైకోర్టు ప్రథమ ధర్మాసనం ఫిబ్రవరి 4వ తేదీ వరకు చిత్ర విడుదలపై స్టే విధించింది. దీంతో రెండు షోలకే చిత్రాన్ని నిలిపివేశారు.

  చెన్నై, కోవై, తిరుచ్చి, నాగర్‌కోయిల్, రామనాథపురం తదితర ప్రాంతాల్లో చిత్ర ప్రదర్శనకు వ్యతిరేకంగా ముస్లిం సంస్థల ప్రతినిధులు థియేటర్లపై దాడులకు పాల్పడ్డారు. విచారణ జరుగుతున్న సమయంలోను చాలాచోట్ల చిత్రాన్ని నిలిపివేయడం, అభిమానులను బయటకి పంపించేయడం వంటి సంఘటనలు చోటుచేసుకోవడంతో అభిమానుల ఆందోళన తీవ్రతరమైంది. దానికితోడు కమల్ ఉద్వేగపూరిత మాటల ప్రభావం కూడా అభిమానుల ఆగ్రహాన్ని పెంచింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలకు దిగారు. తమ అభిమాన నటుడికి మద్ధతుగా నిరసన ప్రదర్శనలు జరిపారు. నిషేధం ప్రకటన తరువాత రాష్ట్రంలో పరిస్థితులు తారుమారయ్యాయి.

  English summary
  
 The only piece of good news for Tamil filmmaker Kamal Haasan on Wednesday was that the Hindi version of his beleagured production Viswaroopam will be released on schedule. The dubbed film, titled Vishwaroop, will be out on 1 February even as battles over the movie’s release in Haasan’s native state rage in and beyond the court. “The release of Vishwaroop is well on its way,” said Girish Johar, head of distribution and acquisitions, Balaji Motion Pictures. “We are targetting above 800 screens across the country. Everybody is on board. It will be the widest solo release in Hindi for Kamal Haasan.” Balaji Motion Pictures has the all-India rights for the Hindi version. “The controversy hasn’t affected the Hindi release, but it is very sad that you have a Censor certificate in hand and are still not being allowed to release the film,” Johar said.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X