twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రామ్ చరణ్ ని అత్తగారు అడుగుతున్నారట

    By Srikanya
    |

    హైదరాబాద్ : మీడియాకు దూరంగా మసిలే రామ్ చరణ్ ఈ మధ్య కాలంలో మీడియాకు ఇంటర్వూలు ఇస్తూ తన అభిమానులకు మరింత దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నారు. రామ్ చరణ్ మాట్లాడుతూ...'గోవిందుడు..'లో పోనీటైల్‌తో కనిపిస్తా. సినిమా అంతా ఈ గెటప్‌లోనే ఉంటా. తెరపై చూసుకొంటుంటే పిలక చాలా బాగుందనిపించింది. ఇంట్లోవాళ్లు మాత్రం... పిలకను చూసి కాస్త ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా మా అత్తమ్మ 'ఆ పిలక ఎప్పుడు తీసేస్తారు చరణ్‌' అని అడుగుతుంటారు అంటూ నవ్వుతూ చెప్పారు రామ్ చరణ్.'గోవిందుడు అందరివాడేలే సినిమా కోసం ముస్తాబవుతున్నాడు. కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రమిది. ప్రస్తుతం హైదరాబాద్‌లో చిత్రీకరణ జరుగుతోంది.

    తన తాజా చిత్రం గురించి చెప్తూ.... కృష్ణవంశీ సినిమా అంటే.. హంగామా ఏ రేంజులో ఉంటుందో తెలిసిందే. సెట్లో కనీసం 40మంది నటీనటులుంటారు. మాస్‌, యాక్షన్‌ సినిమాలు చేస్తూనే ఉన్నా. కుటుంబ బంధాలతో సాగే కథలో కనిపించాలని చాలా రోజుల నుంచి అనుకొంటున్నా. నటుడిగా నాకూ కొత్త పాత్ర దక్కినందుకు ఆనందంగా ఉంది. ఈ మధ్యే ఓ పాట తెరకెక్కించాం. అందులో నా గెటప్‌ కాస్త షాకింగ్‌గా ఉంటుంది. ఆ ఫొటోల్ని త్వరలో విడుదల చేస్తాం. మేమంతా ఇంతింత అందంగా కనిపించడానికి కెమెరామెన్‌ సమీర్‌రెడ్డినే కారణం. నిర్మాత బండ్ల గణేష్‌ కూడా బాగానే ఖర్చుపెడుతున్నారు లెండి అన్నారు.

    What did Mother-in-Law ask Ram Charan

    గత కొద్ది రోజులుగా రామ్ చరణ్ తాజా చిత్రం 'గోవిందుడు అందరివాడేలే' ఆగిపోయిందంటూ, కృష్ణ వంశీ ని తీసేస్తున్నారంటూ తెగ రూమర్స్ మీడియాలో వచ్చేసాయి. అయితే వాటిని గమనించినట్లున్నారు గోవిందుడు టీమ్. వెంటనే బండ్ల గణేష్ రంగంలోకి దిగి ఇండైరక్ట్ గా ఖండన లాంటి ప్రెస్ నోట్ ఇచ్చేసాడు. చిత్రంలో జయసుధ, ప్రకాష్ రాజ్ వచ్చారని చెప్పాడు. మలేషియా షెడ్యూల్ కాకుండా లండన్ లో సీన్స్ ఉంటాయని అన్నాడు. ఈ హడావిడి ప్రెస్ నోట్ చూసిన వాళ్లు మాత్రం ...సినిమా ఆగిపోలేదనేది నిజమే కానీ చిరంజీవి వచ్చి మార్పులు చేసాడనేది స్పష్టంగా తెలుస్తోంది అంటున్నారు. రామ్ చరణ్ కి ఒంట్లో బాగోలేదంటూ తీసుకున్న గ్యాప్ లో ఈ మార్పులు చేసేసారన్నమాట.

    ఇక ఈ చిత్రం కాన్సెప్టు ఏంటంటే... పల్లెటూరంటే... పచ్చదనం, తెలుగుదనం. మనవైన ఆప్యాయతలు, అనురాగాలూ అక్కడే కనిపిస్తాయ్‌. పిన్ని, పెద్దమ్మ.. బాబాయ్‌, నానమ్మ, తాతయ్య - ఎన్ని పిలుపులో. ఇంకెన్ని ఆప్యాయతలో. ఈ అరమరికలు లేని ఆనందాన్ని అనుభవించాలని విదేశాలనుంచి వచ్చాడో కుర్రాడు. కానీ... ఇక్కడి అనుబంధాలూ కలుషితమైపోయాయని అర్థమయ్యింది. మరి ఇలాంటి వాతావరణాన్ని ఎలా చక్కదిద్దాడో, తాను కలలుకన్న ఉమ్మడి కుటుంబాన్ని తానే ఎలా నిర్మించుకొన్నాడో తెలియాలంటే 'గోవిందుడు అందరివాడేలే' చిత్రం చూడాల్సిందే.

    శ్రీకాంత్, కమిలినీ ముఖర్జీ ముఖ్యమైన పాత్రల్లో నటిస్తున్నారు. ఇంకా ఈ చిత్రంలో తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖులు నటినటులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి కెమెరా: సమీర్‌రెడ్డి, నిర్మాత: బండ్ల గణేష్, సమర్పణ: శివబాబు గండ్ల, దర్శకత్వం: కృష్ణవంశీ.

    English summary
    Ram Charan claims he liked the new avatar but his family members weren't pleased with it. Even his Mother-In-Law asks him - 'When Will You Get Rid Of That Pony Tail Charan'.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X