»   »  సీరియల్ కిస్సర్ హష్మి అంతటితో ఆగడట

సీరియల్ కిస్సర్ హష్మి అంతటితో ఆగడట

Posted By:
Subscribe to Filmibeat Telugu

బాలీవుడ్ లో సీరియల్ కిస్సర్ గా, ముద్దుల వీరుడుగా పేరు తెచ్చుకున్నాడు ఇమ్రాన్ హష్మి. అతని సినిమా వచ్చిందంటే చాలు, అందులో ఒక్క కిస్ సీనైనా ఉంటుందనే ముద్ర పడిపోయింది. ఇమ్రాన్ కు తొమ్మిదేళ్ల క్రితం పర్వీన్ షహానీతో పెళ్లయ్యింది. వీరికి అయాన్ అనే కొడుకున్నాడు.

కొడుకు పుట్టాడన్న సంబరాలు ఇమ్రాన్ జంటకు ఎక్కువ కాలం నిలవలేదు. అయాన్ కు క్యాన్సర్ వచ్చిందన్న విషయం తెలిసి తల్లడిల్లిపోయాడు. అంతులేని మానసిక వ్యధతో కుంగి పోయాడు ఇమ్రాన్. అందుకు కారణం సినిమాలు లేకపోవడమో, ఆర్థిక సమస్యలో కాదు. తన ఒక్కగానొక్క కొడుకు అయాన్ కు క్యాన్సర్ క్యాన్సర్ మొదటిదశలో ఉంది. అప్పట్నించి చికిత్స తీసుకున్నాడు.

ఎలాగోలా తన బిడ్డను దాని బారి నుంచి కాపాడుకోగలిగాడు.జీవితం తనకిచ్చిన ముద్దుల తనయుడి గురించి, తాను ఎదుర్కొన్న కష్టనష్టాలు, బాధల గురించి వివరిస్తూ కిస్ ఆఫ్ లైఫ్ అంటూ పుస్తకాన్ని రాశాడు. క్యాన్సర్ ను జయించిన తన కొడుకు గురించి ముఖ్యంగా ప్రస్తావిస్తూ, " ద కిస్ ఆఫ్ లైఫ్, హౌ ఎ సూపర్ హీరో అండ్ మై సన్ డిఫీటెడ్ క్యాన్సర్ " అని పేరు పెట్టాడు. ఈ ఏడాది చివరికల్లా, మార్కెట్ లో అందుబాటులోకి రానుందీ పుస్తకం.

What Emraan Hashmi's book 'The Kiss Of Life'

ఇక కాస్త సంతోష సమయం కాబట్టి తాజాగా ముద్దులపై కూడా ఓ పుస్తకాన్ని రాస్తానంటున్నాడు. అందుకోసం.. ప్రత్యేకంగా రచనలో శిక్షణ కూడా తీసుకుంటున్నాడట.

"పుస్తకం రచించాలన్న ఆలోచన మాత్రమే ఉంది. ఇంకా మొదలుపెట్టలేదు. ప్రస్తుతం నేను ఒప్పుకున్న సినిమాలతో బిజీగా ఉన్నాను. నాకు తెలిసి మార్కెట్లో ఇలాంటి అంశంపై పుస్తకాలు ఏమీ లేవు. కాబట్టి కచ్చితంగా ఈ అంశాన్ని సీరియస్‌గా తీసుకొని పుస్తకం రాయలని భావిస్తున్నా" అంటున్నాడు ఇమ్రాన్. ప్రస్తుతం అజారుద్దీన్ జీవితకథతో తెరకెక్కుతున్న అజార్ సినిమాలో నటిస్తున్నాడు ఇమ్రాన్.

English summary
Emraan Hashmi Planing for his seconD book on cinima kisses ofter "The Kiss Of Life"
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu