»   »  సూపర్ స్టార్ కృష్ణ శ్రీశ్రీ ఏమైంది..?

సూపర్ స్టార్ కృష్ణ శ్రీశ్రీ ఏమైంది..?

Posted By:
Subscribe to Filmibeat Telugu

చాలా సంవత్సరాలు గా మేకప్ కి దూరంగా ఉన్న సూపర్ స్టార్ కృష్ణ నటించిన సినిమా ''శ్రీ శ్రీ '' . ముప్ప‌ల‌నేని శివ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ఈ సినిమాలో విజ‌య‌నిర్మ‌ల‌, న‌రేష్ ముఖ్య‌పాత్ర‌లు పోషించారు. చిత్ర నిర్మాణం తో పాటు అన్ని కార్యక్రమాలను పూర్తిచేసుకున్న ఆ చిత్రం ఆడియో వేడుకని ఈ ఫిబ్రవరి లోనే మహేష్ బాబు చీఫ్ గెస్ట్ గా భారీ ఎత్తున అభిమానుల సమక్షంలో జరిపారు . పైగా మహేష్ ఈ చిత్రానికి వాయిస్ ఓవర్ కూడా ఇస్తున్నాడు అంటూ ప్రేక్షకులని ఊరించారు కూడా.

Krishna Srisri

అయితే ఎపుడెపుడా అని ఎదురు చూసిన ఈ సినిమా రిలీజ్ ఎప్పుడన్న విషయం మాత్రం ఏ సమాచారమూ లేదు. నెలలు గడుస్తున్నా ఇంకా సినిమా మాత్రం రిలీజ్ కి నోచుకోలేదు .పోస్టర్లు తప్ప కనిసం ప్రోమో ల్లో కూడా సినిమా ఊసేలేదు. కారణం ఏంటంటే .......... ఇంకా బిజినెస్ జరుగకపోవడమే అంటున్నారు .ఒకప్పుడు కృష్ణ నటించిన సినిమాల కోసం క్యూ కట్టిన బయ్యర్లు ఇప్పుడు మాత్రం మొహం చాటేస్తున్నారు. అప్పటికీ ఇప్పటికీ సూపర్ స్టార్ కృష్ణ తన స్టార్ డమ్ లో ఎక్కడా తగ్గలేదు.అయితే ఇండస్ట్రీలో వచ్చినమార్పులకి ఆయన కూడా తలవంచక తప్పటం లేదు.

ఈ చిత్రాన్ని నిర్మించింది కొత్త నిర్మాతలు . బిజినెస్ అవుతుందన్న నమ్మకం తో కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారట కానీ ఈరోజుల్లో కేవలం పెద్ద సినిమాలకు మాత్రమే బిజినెస్ జరుగుతోంది చిన్న సినిమాలకు బిజినెస్ జరగడం లేదు దాంతో నిర్మాతలకు ఎదురు చూపులే మిగులుతున్నాయి..

English summary
There is no buyers for Superstar krishna's new movie Srisri
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu