For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  దర్శకుడు క్రిష్ నెక్ట్స్ చిత్రం టైటిల్ ఏమిటంటే...

  By Srikanya
  |

  హైదరాబాద్ : మొదటి నుంచీ విభిన్నమైన టైటిల్స్ తో, పాత్రలతో,కాన్సెప్టులతో సినిమాలు తీస్తున్న దర్శకుడు క్రిష్. ఆయన తన చిత్రానికి మరో విభిన్నమైన టైటిల్ ని ఎంపిక చేసారని సమాచారం. ఆ టైటిల్..'అ'. ఈ విషయాన్ని సీతారామ శాస్త్ర్రి తెలియచేసారు. 'అ' అంటే అర్దం అవతరణ అని ఆయన విశదీకరించారు. వేదం నిర్మించిన ఆర్కా మీడియా వారు ఈ సినిమాను నిర్మిస్తారని తెలుస్తోంది. అయితే ఈ చిత్రంలో హీరో ఎవరనేది మాత్రం తెలియరాలేదు. సూపర్ స్టార్ మహేష్ అని కొందరు అంటున్నారు. అవునా ..కాదా అన్నది తేలాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే.

  ప్రస్తుతం క్రిష్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'కృష్ణం వందే జగద్గురుమ్‌'. దగ్గుబాటి రానా,నయనతార కాంబినేషన్ లో రూపొందుతున్న ఈ చిత్రం ఆడియో రీసెంట్ గా రిలీజైంది. చిత్రం గురించి క్రిష్ మాట్లాడుతూ...''సమాజంలోంచి అల్లుకొన్న కథ ఇది. సమకాలీన అంశాలు తెరపైన కనిపిస్తాయి. వినోదం జోడించడం మర్చిపోలేదు. బీటెక్‌ బాబు, దేవిక పాత్రలు ప్రేక్షకులకు చేరువవుతాయి. '' అన్నారు. జాగర్లమూడి సాయిబాబు, వై.రాజీవ్‌రెడ్డి నిర్మాతలు. ప్రస్తుతం రాజధానిలో పాటల చిత్రీకరణ జరుగుతోంది.

  ఇక చిత్రం స్టోరీ గురించి చెపుతూ... రోమ్‌లో ఉన్నప్పుడు రోమన్‌లా బతకాల్సిందే అంటాడు బీటెక్‌ బాబు. పుస్తకాల కంటే లోకాన్నే అతను ఎక్కువగా చదివాడు. ఈ సంఘంలో బతకాలంటే 'చిన్ని నా బొజ్జకు శ్రీరామరక్ష' అనుకోవడంలో తప్పులేదని వాదిస్తాడు. అలా ఉండటాన్ని స్వార్థం అనడంలో అర్థం లేదన్నది అతని వాదన. అయితే బాబు ఆలోచనలు దేవికతో పరిచయం తరవాత మారాయి. అదెలాగో మా చిత్రంలో చూడాల్సిందే అన్నారు క్రిష్‌.అలాగే..ఈ చిత్రం లాండ్ మాపియా నేఫధ్యంలో వాస్తవ సంఘటనలు ఇన్ కార్పోరేట్ చేస్తూ జరుగుతుంది.తమిళ నాడు,కర్ణాటక బోర్డర్ లో కథ జరుగుతుంది.

  ఈ సినిమాతో నేను ఓ కొత్త జనర్ ని ట్రై చేస్తున్నాను. ఈ చిత్రం ట్రావిల్ ఎడ్వెంచర్ ఫిల్మ్. ఇందులో రానా ధియోటర్ ఆర్టిస్టుగా,స్వార్ద పరుడుగా కనపిస్తే...నయనతార డాక్యుమెంటరీ ఫిల్మ్ మేకర్ గా స్వార్దం లేని వ్యక్తిత్వంతో కనిపిస్తుంది అన్నారు. ఈ చిత్రంలో రానా క్యారెక్టర్ డిఫరెంట్ గా ఉంటుందంటున్నారు దర్సకుడు క్రిష్. ఆయన ఈ విషయమై మాట్లాడుతూ...''మనిషి డబ్బుతో పాటు నడుస్తున్నాడో, డబ్బే మనిషిని నడిపిస్తుందో అర్థంకాని పరిస్థితుల్లో ఉన్నాం. మా బీటెక్‌ బాబు ఎలా నడిచాడన్నది సస్పెన్స్‌. నొప్పింపక, తానొవ్వక నెగ్గుకొస్తుంటాడు. కథకీ, కృష్ణ తత్వానికీ ఉన్న సంబంధం ఆసక్తికరం'' అన్నారు.

  ఈ చిత్రంలో రానా పేరు బాబు. చదివింది బీటెక్‌. అందుకే అన్నీ హైటెక్‌ తెలివి తేటలు. పుస్తకాల్లో చదివిన జ్ఞానం కంటే... జీవితాల్లోంచి గ్రహించిందే ఎక్కువ. ఎప్పటికయ్యది ప్రస్తుతం అప్పటికామాటలాడి... తప్పించుకొన్న శ్రీకృష్ణతత్వం బాగా అలవాటు చేసుకొన్నాడు. అదే అనుసరించాడు. ఈ చిత్రంలో నయనతార హీరోయిన్ గా రానా సరసన చేస్తోంది. నయనతార పాత్ర పేరు దేవిక. ఆమె డాక్యుమెంటరీ ఫిల్మ్ మేకర్. ఈ పాత్ర చిత్రంలో కీలకమై నడుస్తుంది. ఛాయాగ్రహణం: జ్ఞానశేఖర్‌, సంగీతం: మణిశర్మ.

  English summary
  Reports are out that Krish is getting ready for his next movie titled 'AA'. Receiving critical acclaim for his first two movies, 'Gamyam' and 'Vedam', Krish is now the most sought after director. Sources say his next project, would be produced by 'Arka Media' who produced 'Vedam'.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X