twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ప్రముఖ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి పేరులో ‘ఎస్ ఎస్’ అంటే...?

    By Sindhu
    |

    హిట్ చిత్రాల దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి పేరులొ ఎస్ ఎస్ అంటే ఏమిటనేది ఎవరికీ తెలియని విషయం. విలక్షణ దర్శకుడు రాజమౌళి. ఎస్ ఎస్ రాజమౌళి అంటే సూపర్ సక్సెస్ రాజమౌళి అని మనవాళ్లు అంటుంటారు. అయితే ఎస్ ఎస్ అతని ఇంటి పేరు కాదు. ఈ పేరులోని రహస్యం సామాన్య ప్రజలకేకాదు ,సినీరంగానికి కూడా తెలియని రహస్యం. రాజమౌళి తండ్రి ని వి.విజయేంద్ర ప్రసాద్ అన్నప్పుడు. రాజమౌళిని కూడా వి రాజమౌళి అనాలికదా? ఎక్కడైనా తండ్రికి ఒక ఇంటిపేరు, కుమారుడికి మరో ఇంటిపేరూ వుంటుందా? కాదు కదా? వీరిద్దరి ఇంటి పేర్లలో ఈ తేడా ఏమిటి మరి ఎందుకు ఎస్ ఎస్ రాజమౌళి అంటున్నారు? అంటే అందుకు సమాదానం వుంది.

    ప్రతి ఏడాదీ రాజమౌళి తల్లిదండ్రులు ప్రతి శివరాత్రికీ ఏదోఒక జ్యోతిర్లింగాన్ని దర్శించుకొనే అలవాటు వుందట. అలా రాజమౌళి పుట్టకముందు శ్రీశైల పుణ్య క్షేత్రానికి వెళ్ళారట. అక్కడ రాజమౌళి తల్లికి ఆరాత్రి శ్వేత వస్త్రాలు ధరించిన ఒ స్వామీజీ కలలో కనిపించి పండంటి మగబిడ్డను ఆమె ఒడిలో వుంచారట. అలా శ్రీశైలం నుండి రాగానే రాజమౌళి తల్లికి గర్భం వచ్చిందట. అలా శ్రీశైల మల్లికార్జున స్వామి కృపతో జన్మించిన రాజమౌళి కి పేరు శ్రీశైల శ్రీ రాజమౌళి అని పెట్టారట. ఈ విధంగా రాజమౌళి పేరు ఎస్ ఎస్ రాజమౌళి అంటే శ్రీశైల శ్రీ రాజమౌళి అని అర్ధం. అంతేకానీ తండ్రి ఇంటిపేరూ,రాజమౌళి ఇంటిపేరూ వేరు వేరు అనికాదు.

    English summary
    What does modern Telugu cinema ace director SS Rajamouli mean? Not only the general public but also guys from Telugu movies have no clue about Rajamouli's surname. In fact many are curious to know about what does SS stand for in Rajamouli's initials.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X