twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    తెలంగాణ ఆవిర్భావం: సినీ పరిశ్రమలో సంతృప్తికి తెలుగు మహాసభలే సాక్షి!

    By Bojja Kumar
    |

    Recommended Video

    Telangana CM KCR Extraordinary Steps In Development

    ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలంగాణ ఉద్యమ జ్వాలలు ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నపుడు ఒకానొక సమయంలో తెలుగు సినిమా పరిశ్రమలో తీవ్ర ఆందోళనకర వాతావరణం నెలకొని ఉన్న సంగతి తెలిసిందే. పలువురు అగ్రహీరోల షూటింగులకు తెలంగాణ ఉద్యమకారులు అడ్డుకున్న సందర్భాల్లో ఇకపై తెలంగాణలో తెలుగు సినీ పరిశ్రమ ప్రశాంతంగా మనుగడ సాగించే పరిస్థితి ఉండదనే అనుమానాలు సైతం వ్యక్తం అయ్యాయి. పరిశ్రమలో మెజారిటీ వాటా ఆంధ్రా ప్రాంతం వారిది కావడం కూడా ఈ ఆందోళనకు ప్రధాన కారణం.

     తమ సొంత రాష్ట్రంగా భావించే స్థాయికి

    తమ సొంత రాష్ట్రంగా భావించే స్థాయికి

    ఇక కేంద్ర ప్రభుత్వం జూన్ 2, 2014న తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించిన తర్వాత పరిశ్రమ హైదరాబాద్ నుండి వైజాగ్, ఇతర ప్రాంతాలకు తరలిపోతుందనే ఊహాగానాలుకూడా ఎక్కువయ్యాయి. అయితే కొత్త రాష్ట్రం ఏర్పడి తెలంగాణ ఉద్యమ నేత కె. చంద్రశేఖర్ రావు (కేసీఆర్) ముఖ్యమంత్రి అయిన తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. అప్పటి వరకు ఆంధ్రా, రాయలసీమ వాసుల్లో ఉన్న అభద్రతా భావాన్ని పోగొట్టి తెలంగాణ రాష్ట్రంలో సెటిలైన వారంతా ఈ గడ్డను తమ సొంత రాష్ట్రంగా భావించే స్థాయికి పరిస్థితులును మలచడంలో కేసీఆర్ సఫలం అయ్యారని చెప్పక తప్పదు.

    అద్భుతంగా తెలుగు మహాసభలు

    అద్భుతంగా తెలుగు మహాసభలు

    కొత్త రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పూర్తిగా అదుపులోకి తేవడంతో పాటు ఎక్కడా కూడా ప్రాంతీయ విబేధాలు తలెత్తకుండా చేయడంలో, ముఖ్యంగా హైదరాబాద్ ప్రాంతంలో ఎప్పటి నుండో కలిసి జీవనం సాగిస్తున్న ఆంధ్ర-తెలంగాణ వాసుల మధ్య ప్రాంతీయ వివక్షను తగ్గించి అన్నదమ్ముల్లా మెలిగేలా చేయడంలో కేసీఆర్ ప్రభుత్వం సక్సెస్ అయింది. 2017లో ప్రపంచ తెలుగు మహాసభలను కేసీఆర్ ప్రభుత్వం అంగరంగ వైభవంగా నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ సభలను నిర్వహించిన తీరుపై ఆంధ్రప్రాంతానికి చెందిన తెలుగు భాషాభిమానులు సైతం ప్రశంసలు గుప్పించడం గమనార్హం.

    సినీ ప్రముఖులకు సన్మానం

    సినీ ప్రముఖులకు సన్మానం

    ఈ తెలుగు మహా సభల్లో తెలుగు సినిమా పరిశ్రమకు చెందిన ప్రముఖులను ప్రత్యేకంగా సత్కరించింది కేసీఆర్ ప్రభుత్వం. ఈ మహాసభలకు హాజరైన మెగాస్టార్ చిరంజీవి, బాలకృష్ణ, సూపర్ స్టార్ కృష్ణ, మోహన్ బాబు, ఆర్ నారాయణ మూర్తి లాంటి ఆంధ్రప్రాంతానికి చెందిన స్టార్ కొత్త తెలంగాణ ప్రభుత్వం మీద ప్రశంసల వర్షం కురిపించారు. తెలుగు భాషాభివృద్ధికి కేసీఆర్ చేస్తున్న కృషిని కొనియాడారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఇంత గొప్పగా ఎప్పుడూ తెలుగు మహాసభలు జరుగలేదని, తెలంగాణ ఏర్పాటు తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతో అద్భుతంగా తెలుగు మహాసభలు నిర్వహించారని భాషాభిమానులంతా పూర్తి సంతృప్తి వ్యక్తం చేశారు.

    చిరంజీవి ప్రశంసలు

    చిరంజీవి ప్రశంసలు

    సీఎం కేసీఆర్ ఈ రాష్ట్రంలో 1వ నుండి 12వ తరగతి వరకు తెలుగు భాష తప్పనిసరి చేస్తూ విప్లవాత్మక నిర్ణయం తీసుకోవడం అభినందనీయం అని తెలుగు మహా సభల సందర్భంగా చిరంజీవి ప్రశంసలు గుప్పించారు. ఈ సందర్భంగా కొత్త రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం చేసిన పలు చర్యలను చిరంజీవి మెచ్చుకున్నారు.

    తెలుగు వారిని ఒకచోట చేర్చిన సీఎం కేసీఆర్ అంటూ బాలయ్య

    తెలుగు వారిని ఒకచోట చేర్చిన సీఎం కేసీఆర్ అంటూ బాలయ్య

    మరో అగ్రహీరో బాలకృష్ణ మాట్లాడుతూ ‘తెలుగుభాష ఎంతో రమణీయమైంది. కమనీయమైంది. తెలుగు భాషలో గోదావరి ఒంపులు, కృష్ణవేణి సొంపులు, నెల్లూరి నెరజాణ తనం, రాయలసీమ రాజసం ఉన్నాయి. తెలంగాణ మాగాణం తెలుగు భాష.. కోనసీమ లేత కొబ్బరి నీరు తెలుగు భాష' అటువంటి భాషను మనం మాట్లాడుకుంటున్నందుకు మనం గర్వపడాలి, అటువంటి జాతిలో పుట్టినందుకు మనం ఆనందించాలి, మన జాతిని, మన భాషను మనం గౌరవించాలి' అని బాలకృష్ణ అన్నారు. తెలుగు వారిని ఒకచోట చేర్చిన సీఎం కేసీఆర్ సహృదయత, భాషాభిమానానికి యావత్తు ఆంధ్రా, తెలంగాణ ప్రజానీకం తరపున కృతజ్ఞతలు చెబుతున్నానని బాలయ్య అన్నారు.

    మోమన్ బాబు, ఆర్ నారాయణ మూర్తి సంతృప్తి

    మోమన్ బాబు, ఆర్ నారాయణ మూర్తి సంతృప్తి

    మోహన్ బాబు మాట్లాడుతూ, ‘దేశభాషలందు తెలుగు లెస్స' అని, ప్రతి ఒక్కరికీ దానిని జ్ఞాపకం చేయడం కోసం ఎంతో ఘనంగా ఈ సభలను నిర్వహిస్తున్న సీఎం కేసీఆర్ కు ధన్యవాదాలు చెబుతున్నానని అన్నారు. కళాకారులను సన్మానిస్తుండటం చాలా సంతోషంగా ఉందని అన్నారు. విప్లవ చిత్రాల దర్శకుడు ఆర్ నారాయణ మూర్తి సైతం కొత్త రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం చేస్తున్న అభివద్ధి పనులు, తెలుగు భాష కోసంచేస్తున్న కృషిని కొనియాడారు.

    English summary
    After Telangana Formation, What is the condition of Telugu film industry in new state?. Many film personalities have expressed satisfaction. Many actors appreciated the KCR government.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X