»   » ఐశ్వర్యారాయ్‌ నక్క లా ఉంటుందా? కత్రినా పై వెల్లువెత్తిన విమర్శలు

ఐశ్వర్యారాయ్‌ నక్క లా ఉంటుందా? కత్రినా పై వెల్లువెత్తిన విమర్శలు

Posted By:
Subscribe to Filmibeat Telugu

ప్రస్తుతం జగ్గా జాసూస్ సినిమా ప్రమోషన్స్ లో రణబీర్ కపూర్, కత్రినాకైఫ్ బిజీగా ఉన్నారు. ప్రచారంలో భాగంగా ఇద్దరూ కలసి ఫేస్ బుక్ ద్వారా ఆన్లైన్ చాట్ లోకి వచ్చారు. ఈ సందర్భంలో ఓ టిపికల్ క్వశ్చన్ అడిగాడు ఓ అభిమాని. ఓ సెలబ్రిటీని ఒక జంతువుతో పోల్చాల్సి ఉంటుందన్న మాట... అందులో భాగంగా నక్క అని రణబీర్ అనగానే...కత్రినా ఏమాత్రం తడుముకోకుండా ఐశ్వర్యారాయ్ బచ్చన్ అనేసింది.

 What Katrina Kaif Has To Say About Aishwarya Rai

ఐశ్వర్యారాయ్‌ గురించి చెడుగా కానీ, వ్యతిరేకంగాకానీ మాట్లాడడానికి పరిశ్రమలో ఎవరికీ మనసు రాదు. అమితాబ్‌ కోడలిగానే కాకుండా తన వ్యక్తిత్వం ద్వారా కూడా ఐష్‌ చాలామందికి సన్నిహితురాలు. అందుకే ఆమె గురించి ఎవరూ తప్పుగా మాట్లాడరు. కానీ కత్రినా మాత్రం ఐష్‌ను నక్కతో పోల్చేసింది. ఇదంతా సినిమా ప్రమోషన్లో భాగంగా జరిగినా, కత్రినా నోటి దురుసుతనాన్ని ఇప్పుడు బాలీవుడ్‌లో అందరూ తప్పు పడుతున్నారు.

ఏ దిల్ హై ముష్కిల్ సినిమాలో ఐష్ అండ్ రణబీర్ రోమాన్స్ మనకు తెలిసిందే. ఆ తర్వాత రణబీర్ అండ్ కత్రినా బ్రేకప్ కూడా అయ్యింది. ఇక జగ్గా జాసూస్ మూవీ చేయడంలో అత్యంత క్లిష్టమైన పార్ట్ ఏదంటే.. 'మూడేళ్లపాటు షూటింగ్ చేయడం.. రిలీజ్ కావడానికి నాలుగేళ్లు పట్టడం' అని రణబీర్ ఆన్సర్ ఇస్తే.. 'నీతో నటించడమే నాకు అత్యంత క్లిష్టమైన విషయంగా అనిపించింది' అంటూ మరో షాక్ ఇచ్చింది కత్రినా .

English summary
Recently, when Katrina Kaif did a live session on Facebook along with Ranbir Kapoor, to promote Jagga Jasoos, the actress gave a shocking statement about Aishwarya Rai Bachchan that left us shocked
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu