»   » రైతుకోసం కదిలిన మరో తమిళ హీరో: ప్రతీ కుటుంబాన్నీ ఆదుకుంటాం

రైతుకోసం కదిలిన మరో తమిళ హీరో: ప్రతీ కుటుంబాన్నీ ఆదుకుంటాం

Posted By:
Subscribe to Filmibeat Telugu

పొలం గట్టుమీద నాగలి భుజాన వేసుకొని నడుస్తూన్న రైతు ఒక్కసారిగా కుప్ప కూలుతున్నాడు. నేలని దున్నాల్సిన రైతు తన దేహాన్ని చీల్చేస్తున్న అప్పులతో కుంగిపోతున్నాడు. ఏ రైతును చూసినా కష్టమే! సాగు నష్టమే! ఎక్కడికక్కడ పచ్చగా కళకళ లాడాల్సిన వ్యవసాయ భూములు శవాలను మొలిపించి రైతు రక్తం తో ఎర్ర బారుతున్నాయి. ఇదే విషయం లో తమిల రైతుల ఆందోళనలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. అయినా ఢిల్లీ పీఠం కదలలేదు కానీ సినీ నటుడు విశాల్ తరహాలోనే మరో హీరో రైతుల కోసం మరో అడుగు ముందుకు వేసాడు.

మృతి చెందిన రైతుల కుటుంబాలకు

మృతి చెందిన రైతుల కుటుంబాలకు

తమిళ సినీ నటుడు ధనుష్‌ పంట నష్టాలవల్ల ఆత్మహత్యలు చేసుకున్న, గుండెపోటుతో మృతి చెందిన రైతుల కుటుంబాలకు ఆర్థిక సహాయం అందజేసి తన తల్లిగారి ఊరైన శంకరాపురం గ్రామస్థుల ప్రశంసలందుకున్నారు. తేని జిల్లా శంకరాపు రంలో ధనుష్‌ కులదైవమైన కరుప్పసామి ఆలయం ఉంది.


Dhanush and Kajol's VIP 2 Release Postponed Reasons
కుటుంబ సమేతంగా

కుటుంబ సమేతంగా

ప్రతియేటా ధనుష్‌ కుటుంబ సమేతంగా ఆ ఆలయాన్ని దర్శించటం ఆనవాయితీ. ఆ మేరకు బుధవారం ఉదయం ధనుష్‌, ఆయన సతీమణి ఐశ్వర్య, తల్లి దండ్రులు కస్తూరి రాజా, విజయలక్ష్మి తదితర కుటుంబీకులతో అక్కడికి వెళ్ళి కరుప్పసామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.


25 మంది రైతుల కుటుంబీకులకు

25 మంది రైతుల కుటుంబీకులకు

ఆ తర్వాత జరిగిన ఓ ప్రత్యేక కార్యక్రమంలో పంటనష్టాలతో ప్రాణాలు కోల్పోయిన 125 మంది రైతుల కుటుంబీకులకు తలా రూ.50 వేల చొప్పున రూ.63 లక్షల ఆర్థిక సహాయం అందజేశారు. ఈసందర్భంగా ధనుష్‌ మాట్లాడుతూ రాష్ట్రంలో తమిళ రైతులు ఆత్మహత్యలు చేసుకోవడం, గుండె ఆగి మృతి చెందటం వంటి సంఘటనలను చూసి తల్లడిల్లిపోయానని చెప్పారు.


250 కుటుంబీకులను ఎంపిక చేసి

250 కుటుంబీకులను ఎంపిక చేసి

ఆ రైతుల కుటుంబాలకు ఉడుతాభక్తిగా తన వంతు సాయం అందించాలని దర్శకుడు సుబ్రమణ్యశివ కెమెరామెన్‌ వేల్‌రాజ్‌ నాయకత్వంలో 11 మంది సభ్యులున్న కమిటీని ఏర్పాటు చేసి రైతన్నలను కోల్పోయిన 250 కుటుంబీకులను ఎంపిక చేశారని, తొలివిడతగా 125 మందికి యాభైవేల చొప్పున ఆర్థిక సహాయం అందించానని ఆయన తెలిపారు. మరో విడతగా 125 మంది రైతు కుటుంబాలను ఎంపిక చేసి వారికి కూడా తలా రూ. 50 వేలు అందిస్తానని ధనుష్ తెలిపారు.
English summary
Dhanush, along with his family, wife Aishwarya Dhanush, parents, Mr and Mrs Kasthuri Raja, has offered an amount of Rs. 50000 to 125 farming families.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu