»   » ఇంటి నుండి వెళ్లిపోయిన డైరెక్టర్ కూతురు, బాయ్ ఫ్రెండ్ కోసమా?

ఇంటి నుండి వెళ్లిపోయిన డైరెక్టర్ కూతురు, బాయ్ ఫ్రెండ్ కోసమా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: బాలీవుడ్లో ఈ మధ్య కాలంలో లవ్ ఎఫైర్లు, పెళ్లి కాకుండానే సహజీవనం చేయడాలు లాంటివి సర్వసాధారణం అయ్యాయి. గతేడాది బాలీవుడ్ లవర్ బాయ్ రణబీర్ కపూర్ ఇంట్లో నుండి బయటకు వచ్చి సపరేటుగా అపార్ట్‌మెంట్ తీసుకుని తన ప్రియురాలు కత్రినా కైఫ్ తో కలిసి సహజీవనం మొదలు పెట్టిన సంగతి తెలిసిందే. ఇపుడు అదే దారిలో వెలుతోంది బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ మహేష్ భట్ కూతరు అలియా భట్.

తల్లిదండ్రులతో కలిసి ఉంటూ వారి అదుపు ఆజ్ఞల్లో కాకుండా సొంతగా తనకు నచ్చినట్లు లైప్ స్టైల్ లీడ్ చేయాలని డిసైడ్ అయింది అలియా భట్. తాజాగా అందుతున్న వివరాల ప్రకారం తన తల్లిదండ్రులు ఉంటున్న ఇంటికి కూతవేటు దూరంలోనే మరో ఇంటిని వెతుక్కుంది. అలియా నివాసం ఉండే ఈ ఇంటికి తన తల్లి సోని రజ్వాన్, అర్కిటెక్ట్ అయిన అలియా తాత కలిసి ఇంటీరియర్ డిజైనింగ్ చేస్తున్నారట.

ఇటీవల అలియా భట్ ఈ విషయాన్ని వెల్లడిస్తూ....‘నాకు అంతా కొత్తగా అనిపిస్తోంది. నా జీవితం అంతా నా తల్లిదండ్రులతో గడిపాను. ఇపుడు నాకంటూ సెపరేట్ జీవితం కావాలనిపిస్తోంది. నా తల్లిదండ్రులు ఉంటున్న ఇంటికి దగ్గర్లోనే మరో ఇంటిని తీసుకోవాలనుకుంటున్నాను' అని చెప్పుకొచ్చింది.

What Made Alia Leave Her House?

అలియా భట్ ఈ ఇంట్లో ఎవరితో కలిసి ఉండబోతోందని భావిస్తున్నారు? అందరూ తన బాయ్ ఫ్రెండ్ సిద్ధార్థ్ మల్హోత్రాతో కలిసి ఈ ఇంట్లో సహజీవనం చేస్తుందని అనుకుంటారు. కానీ ఈ పని చేయాలంటే అలియాకు మరింత ధైర్యం, ఇంకా సమయం కావాలి. ప్రస్తుతానికైతే తన సిస్టర్ షాహీన్‌తో కలిసి ఈ ఇంట్లోకి వెలుతోంది.

కూతురును ప్రాణంగా చూసుకునే మహేష్ భత్ తొలుత ఆమె నిర్ణయానికి ఒప్పుకోలేదట. ఎలాగో అలా తండ్రిని కన్విన్స్ చేసింది అలియా. కూతురు కోరికను కాదనలేక...అయిష్టంగానే ఒప్పుకున్నాడట మహేష్ భట్.

English summary
Last year, Ranbir was in the gossip columns for leaving his parents' house and moving out with his girlfriend Katrina Kaif. Following the footsteps of Ranbir Kapoor, the "Highway" girl, Alia also has decided to move out from her protective fathers' home.
Please Wait while comments are loading...