»   » ఆ అనుభవం వల్లే బికినీ సీన్లు ఇరగదీసిందట

ఆ అనుభవం వల్లే బికినీ సీన్లు ఇరగదీసిందట

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ఫార్మర్ మిస్ ఇండియా జోయా అఫ్రోజ్ త్వరలో 'ది ఎక్స్‌పోజ్' అనే బాలీవుడ్ చిత్రం ద్వారా హీరోయిన్‌గా తెరంగ్రేటం చేయబోతోంది. ఈచిత్రంలో అమ్మడు బికినీ హాట్ సీన్లతో ప్రేక్షకులకు కనువిందు చేయబోతోంది. మిస్ ఇండియా పోటీల్లో బికినీ వేసిన అనుభవం ఉండటం వల్లనే తాను ఈ సినిమాలో బికినీ సీన్లు చాలా సులభంగా చేయగలిగానని అంటోంది ఈ భామ.

'మిస్ ఇండియా పోటీలు ఈ విషయంలో నాకు చాలా హెల్ప్ అయ్యాయి. పోటీల్లో భాగంగా మేము వందలాది మంది ఆడియన్స్ ముందు అనేక రౌడ్స్ బికినీల్లో ర్యాంప్ వాక్ చేసాము. ఆ సమయంలో మనం గెలుపు గురించి తప్ప మరే దాని గురించి ఆలోచించము. మనకు అందమైన శరీరం ఉంది. దాన్ని అందంగా ప్రదర్శించాలనే ఆలోచన మాత్రమే ఉంటుంది. ఆ అనుభవమే నాకు సినిమాల్లోనూ ఎలాంటి జంకు లేకుండా నటించేందుకు ఉపయోగ పడింది' అని జోయా తెలిపింది.

What Made Zoya Afroz Go Easy In Bikini For The Xpose?

ఈ మధ్య షూటింగ్ సమయంలో తన సహచర నటి సోనాలి రౌత్‌పై జోయా చేయి చేసుకున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తల్లో నిజం లేదని జోయా తేల్చి చెప్పింది. 'ఈ వార్తలు ఎలా వచ్చాయో అర్థం కావడం లేదు. నిజంగా సోనాలితో నాకు ఎలాంటి సమస్య లేదు. సినిమాలోని ఓ సీన్లో మా ఇద్దరి మధ్య తగవులాట ఉంటుంది. దాన్నే రియల్ సంఘటనగా ప్రచారం చేస్తున్నారని అనుకుంటున్నాను' అని తెలిపారు.

'ది ఎక్స్‌పోజ్' సినిమాలో జోయా అఫ్రోజ్, హిమేష్ రేషిమియా, ఇర్ఫాన్ ఖాన్, హనీ సింగ్, సోనాలీ రౌత్ తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రం మే 16వ తేదీన విడుదలకు సిద్ధమవుతోంది. ఈ చిత్రానికి అనంత్ మహదేవన్ దర్శకత్వం వహించారు. విపిన్ రేషిమియా నిర్మాత.

English summary
Former Miss India, Zoya Afroz who is all set to make her debut in Bollywood as a lead actress in the upcoming movie The Xpose says that she had no problem shooting in a bikini in the film. Thanks to the prior experience she gathered during her Miss Indian pageant.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu