»   » బచ్చన్ తో ‘ఏం మాయ చేసి’ బాలీవుడ్ ఆఫర్ కొట్టేసింది..!?

బచ్చన్ తో ‘ఏం మాయ చేసి’ బాలీవుడ్ ఆఫర్ కొట్టేసింది..!?

Posted By:
Subscribe to Filmibeat Telugu

అసిన్, త్రిషల బాటలో ఇటీవల కాజల్ కూడా బాలీవుడ్ కి వెళ్లి అక్కడ స్థానం కోసం ప్రయత్నిస్తోన్న విషయం మనకు తెలుసు. ఇప్పుడు వీరిని అనుసరించడానికి మరో సౌత్ హీరోయిన్ కూడా రెడీ అవుతోంది. తనే సమంతా! 'ఏ మాయ చేసావె', 'బృందావనం' చిత్రాల ద్వారా టాలీవుడ్ లో స్టార్ ఇమేజ్ తెచ్చుకున్న సమంతా తను కూడా బాలీవుడ్ మీద ఇప్పుడు వ్యామోహం పెంచుకుందని అంటున్నారు. అందుకే, ఇక్కడింకా ఏమీ సాధించకుండానే హిందీ సినిమాలలో కూడా నటించాలని కోరుకుంటోంది.

ఈ నేపథ్యంలో 'బోల్ బచ్చన్' అనే సినిమాలో అభిషేక్ బచ్చన్ సరసన ఆమె అవకాశం పొందనుందని తెలుస్తోంది. ఈ సినిమాలో హీరోయిన్ కోసం చిత్ర దర్శకుడు రోహిత్ శెట్టి ఒక సౌత్ అమ్మాయి కోసం ట్రై చేస్తున్నాడనీ, సమంతా నటించిన సినిమాలు చూసి ఆమెను తీసుకోవాలనుకుంటున్నాడనీ అంటున్నారు. ఈ విషయంపై సమంతాని రోహిత్ కాంటాక్ట్ చేశాడట. సమంతా ఎంపిక దాదాపు ఖరారైందని చెబుతున్నారు. అయితే అధికారికంగా వెలువడనుంది.

ఇక పోతే సమంతా ప్రస్తుతం మహేష్ బాబు సరసన 'దూకుడు"లో నటిస్తోందన్న విషయం తెలిసిందే..ఖలేజా సినిమా తర్వాత మహేష్ బాబు చేస్తున్న దూకుడు సినిమా షూటింగు మొదట్లో స్లోగా జరిగినా, ఇప్పుడు 'దూకుడు"గానే జరుగుతోంది. శ్రీను వైట్ల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా కోసం తాజాగా హైదరాబాదులోని చిరాన్ ఫోర్ట్ భవనంలో మహేష్ బాబు, సమంతా, ప్రకాష్ రాజ్ పాల్గొనే సీన్స్ ను షూట్ చేస్తున్నారు. ఈ సినిమా ఆడియోను ఆగష్టు 9న మహేష్ బాబు బర్త్ డే నాడు రిలీజ్ చేస్తారని సమాచారం. ఆ నెలాఖరుకి సినిమాని రిలీజ్ చేయనున్నారు. కాగా, ఈ సినిమా కోసం కొత్తగా ఓ ట్యాగ్ లైన్ ను పెడుతున్నారు. ఇందుకోసం 'డేరింగ్ అండ్ డేషింగ్" అనే క్యాప్షన్ ను పరిశీలిస్తున్నారు.

English summary
Actress Samantha Ruth Prabhu, who made it big in Telugu film industry with her debut film ‘Ye Maya Chesave’ (What magic have you done!) will soon be making her B-town debut if all goes well.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu