»   » బన్నీ డైరెక్షన్ లో వేలుపెట్టటం వల్లే డీజే ఇలా అయ్యాడా?

బన్నీ డైరెక్షన్ లో వేలుపెట్టటం వల్లే డీజే ఇలా అయ్యాడా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

డీజే మొదలైన కొత్తల్లో ఒక టాక్ వినిపించింది వాస్తవానికి ఈ కథను 'అదుర్స్' కి సీక్వెల్ గా ఎన్టీఆర్ తోనే చేయాలని హరీష్ శంకర్ ప్రయత్నించాడనీ. కానీ ఆ ప్రయత్నం కార్యరూపం దాల్చకపోవడంతో అల్లుఅర్జున్ తో తన స్టోరీని ఓకే చేయించుకున్నాడనీ. అల్లు అర్జున్ చెప్పిన మార్పులు చేర్పులతో హరీష్ ఈ ప్రాజెక్టును పట్టాలెక్కించేశాడని చెప్పుకున్నారు. అందులో ఎంత నిజముందో పక్కాగా చెప్పలేం గానీ కొంత మాత్రం నిజమే....

డైరెక్షన్ లో బన్నీ

డైరెక్షన్ లో బన్నీ

డైరెక్షన్ లో బన్నీ పాత్ర ఉందనే సంగతి చాలా సార్లు చెప్పకనే చెప్పాడు హరీష్ శంకర్. ఈ చిత్రానికి అల్లు అర్జున్‌ చాలా ఇన్‌పుట్స్‌ ఇచ్చాడని, అతని వల్లే సినిమాలో కొన్ని క్యారెక్టర్లు రూపుదిద్దుకున్నాయని, క్లయిమాక్స్‌లో ఫైట్‌ వద్దని చెప్పాడని, అంచేత కామెడీతో సినిమా ముగించామని ఇలా చాలా రకాలుగా బన్నీ గురించి చెప్పుకొచ్చాడు.హరీష్ శంకర్ బాధ

హరీష్ శంకర్ బాధ

అంతేకాదు ఈ సినిమా క్లైమాక్స్ ని కూడా కొన్ని మార్పులతో రీషూట్ చేసిన సంగతీ తెలిసిందే. అల్లు అర్జున్ విపరీతంగా కష్టపడుతూ ఒక దర్శకుడి నుంచి మాగ్జిమం పిండుకుంటాడంటూ అతన్ని మెచ్చుకున్నప్పుదు అర్థం కాలేదు గానీ సినిమా వచ్చాక హరీష్ శంకర్ బాధ అందరికీ అర్థమయ్యింది.అల్లు అర్జున్‌ ఇన్‌వాల్వ్‌మెంట్‌

అల్లు అర్జున్‌ ఇన్‌వాల్వ్‌మెంట్‌

ఇంత చప్పటి కమర్షియల్‌ మసాలా చూసినా, చూడకున్నా ఒకటేననే విమర్శలే ఎక్కువ వినిపిస్తున్నాయి.ఈ చిత్రం రోలింగ్‌ టైటిల్స్‌లోని మేకింగ్‌ వీడియోలు చూస్తే ఇందులో అల్లు అర్జున్‌ ఇన్‌వాల్వ్‌మెంట్‌ ఎంత అనేది స్పష్టంగా తెలుస్తుంది. కొన్ని సందర్భాల్లో అల్లు అర్జునే హరీష్‌ శంకర్‌ని డైరెక్ట్‌ చేస్తున్నట్టు కనిపించింది. మరీ అంతగా ఇన్వాల్వ్ అయితే ఏమౌతుందో పవర్ స్టార్ కి తగిలిన ఎదురు దెబ్బలే సాక్ష్యం.లొంగిపోయినట్టున్నాడు

లొంగిపోయినట్టున్నాడు

పాపం అసలే ఫ్లాపులతో ఉన్న హరీష్‌ తనకి అంతపెద్ద స్టార్‌ డేట్స్‌ దొరికేసరికి పూర్తిగా మొహమాటం తో లొంగిపోయినట్టున్నాడు. అంతే బన్నీ ఈ డైరెక్టర్ ని పూర్తిగా వాడేసుకున్నాడు. అల్లు అర్జున్‌ ఇన్‌పుట్స్‌ తీసుకోవడమే కాకుండా, అతను మేకింగ్‌లో ఎంత ఇన్‌వాల్వ్‌ లేదా ఇంటర్‌ఫియర్‌ అయ్యాడో తెలిసేట్టు రోలింగ్‌ టైటిల్స్‌లోనే కవర్‌ చేసాడని తెలిసిపోయింది.అల్లు అర్జున్ వల్లే

అల్లు అర్జున్ వల్లే

అసలు హరీష్ శంకర్ అల్లు అర్జున్ వల్లే.., అల్లు అర్జున్ వల్లే అంటూ ప్రతీ ప్రమోషన్ మీటింగ్ లోనూ చెప్తూ వచ్చింది కూడా సినిమా ఫట్ మంటుందని అర్థమయ్యే నా తప్పేం లేదు భాధ్యతంతా అతనిదే అన్నట్టు ముందునుంచే కవర్ చేసుకున్నాడని అభిప్రాయపడుతున్నారు. అయినా ఎవరి పని వాళ్ళు చేస్తే బావుంటుంది కదా ఇంతకాలం లేనిది ఈ సినిమాకే అల్లు అర్జున్‌ ఎందుకింతగా మేకింగ్‌లో వేలు పెట్టాడో మరి.
English summary
What Went Wrong With DJ? Allu arjun's over involvement is the reason for Dj flop
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu