»   » అక్షయ్ కుమార్ "డాడీస్ డే ఔట్ ఫెయిల్" : కూతురు తంతే మొహం అలా అయ్యింది (వీడియో)

అక్షయ్ కుమార్ "డాడీస్ డే ఔట్ ఫెయిల్" : కూతురు తంతే మొహం అలా అయ్యింది (వీడియో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ డాడీ డే అవుట్ బెడిసికొట్టింది అంటూ తనకూతురు మొహమ్మీద తన్నిన వీడియో పెట్టి మరీ వాపోయాడు. ఉయ్యాలలో ఉన్న కూతురు రెండు కాళ్ళూ తన మొహమ్మీద ఫట్ మంటూ తాకటం, దాంతో అక్షయ్ వెనక్కి పడిపోవటం ఉన్న ఒక వీడియోను అక్షయ్ కుమార్ తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేశాడు.

అక్షయ్ కుమార్ భార్య ట్వింకిల్ ఖన్నా తన సోదరి రింకీ ఖన్నాతో కలిసి ఆస్ట్రియా విహారయాత్రకు వెళ్లింది. భార్య ట్వింకిల్ విహారయాత్రకు ఆస్ట్రియా వెల్లటం, కొడుకు ఆరవ్ ఉన్నత చదువుల కోసం అమెరికాలో ఉండటంతో నిటారాను అక్షయ్ చూసుకుంటున్నాడు.

అయితే కుమార్తెను ఆడించేందుకు దగ్గర్లోని చిల్డ్రన్ పార్క్ కు అక్షయ్ తీసుకెళ్లాడు. సినిమాల్లో ఎంత బిజీగా ఉన్న తన ఫ్యామిలీ లైఫ్ మాత్రం మిస్ చేసుకోడు. ముఖ్యంగా తన పిల్లలు ఆరవ్, నిటారాలతో గడపటం అంటే అక్షయ్ కి చాలా ఇష్టం. కొద్ది రోజులుగా టాయిలెట్ సినిమా పనుల్లో బిజీగా ఉన్న అక్షయ్, ఇప్పుడు కాస్త ఫ్రీ టైం దొరకటంతో తన కూతురు నిటారాతో కలిసి సరదాగా ఆడుకుంటున్నాడు.

అయితే పాపం తన కూతురితో ఆడుకుంటున్న అక్షయ్‌ సరదా బెడిసి కొట్టింది. పాప ఉయ్యాల ఊగుతున్నప్పుడు అక్షయ్‌ ఎదురుగా నిలబడ్డాడు. ఉయ్యాల వేగంగా ఊగుతుండటంతో పాప కాళ్లు ఏకంగా అక్షయ్ ముఖం మీదకు వచ్చాయి. దాంతో వెనక్కి తూలిన అక్షయ్ వెంటనే తెరకొని కిందపడకుండా జాగ్రత్త పడ్డాడు. అయితే కూతురు తో తగిలిన దెబ్బకదా అందుకే అక్షయ్ కి ఆ దెబ్బకూడా సంతోషంగానే ఉన్నట్టుంది ఈ వీడియోను తన ట్విట్టర్ లో పోస్ట్ చేసిన అక్షయ్'డ్యాడీస్ డే అవుట్‌ బెడిసికొట్టింది' అని కామెంట్ చేశాడు.

English summary
Akshay Kumar Shared the adorable video on his Instagram account and wrote, “Daddy’s day out gone wrong.”
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu