»   » ఐశ్వర్య ఏమైనా దేవతనా.. షూటింగ్‌లో గాయపడితే నేనే కాపాడా!

ఐశ్వర్య ఏమైనా దేవతనా.. షూటింగ్‌లో గాయపడితే నేనే కాపాడా!

Posted By:
Subscribe to Filmibeat Telugu

బాలీవుడ్‌లో అక్షయ్‌కుమార్, ఐశ్వర్యరాయ్ జంటకు మంచి క్రేజ్ ఉంటుందని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే కొన్ని కారణాల వల్ల వారిద్దరూ కలిసి నటించడానికి అవకాశం లభించలేదు. ఇటీవల ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అక్షయ్ కుమార్ మాట్లాడుతూ తన వ్యక్తిగత జీవితానికి, సినీ జీవితానికి సంబంధించిన విషయాలను వెల్లడించారు. ప్రపంచ సుందరి ఐశ్వర్యరాయ్‌తో ఉన్న తన అనుబంధాన్ని ప్రత్యేకంగ ప్రస్తావించారు. ఓ దశలో ఐశ్వర్యరాయ్ దేవతేమి కాదు అని వ్యాఖ్యనించడం చర్చనీయాంశమైంది.

ఐశ్వర్యతో నా కెమిస్ట్రీ..

ఐశ్వర్యతో నా కెమిస్ట్రీ..

ఖాకీ చిత్రంలో మేము కలిసి నటించాం. ఆన్‌స్క్రీన్‌పై మా ఇద్దరి రిలేషన్ చాలా సాదాసీదాగా ఉంటుంది. కానీ పాత్రలను చూసుకొంటే మా ఇద్దరి జోడి తెరమీద పండింది.

ఎందుకో కలిసి నటించడం సాధ్యపడలేదు

ఎందుకో కలిసి నటించడం సాధ్యపడలేదు

ఖాకీ చిత్రంలో మా ఇద్దరి జోడి గురించి చాలా మంది ఇప్పటికి నాకు గుర్తు చేస్తుంటారు. ఎందుకో గానీ మేము ఇద్దరం కలిసి నటించడం సాధ్యపడలేదు. అవకాశం లభిస్తే మళ్లీ కలిసి నటించేందుకు ప్రయత్నిస్తాను.

ఐశ్వర్య సింప్లీ అండ్ సూపర్

ఐశ్వర్య సింప్లీ అండ్ సూపర్

వ్యక్తిగతంగా ఐశ్యర్యను నేను చాలా ఇష్టపడుతాను. ఆమె సింప్లీ అండ్ సూపర్. ఎన్నో సందర్భాల్లో కలిసి పలు విషయాలను షేర్ చేసుకొన్నాం. చర్చించుకొన్నాం. మా ఇద్దరి మధ్య ఉన్న చనువు, క్రమశిక్షణ, నటన పట్ల అంకితభావంతోనే అది సాధ్యపడింది.

ఐశ్వర్యతో నటించడం చాలా సరదాగా..

ఐశ్వర్యతో నటించడం చాలా సరదాగా..

ఐశ్వర్యరాయ్‌తో నటించడం చాలా సరదాగా ఉంటుంది. ఇతర హీరోయిన్లతో కలిసి నటించినా ఆ రకమైన హోమ్లీ ఫిలింగ్ కలుగుదు. ఖాకీలో నటించింది కొంత సమయమైనప్పటీకి మా రిలేషన్ అది గట్టి పునాది వేసింది.

ఆమె దేవత కాదుగా..

ఆమె దేవత కాదుగా..

ఐశ్వర్య అందరిలానే చాలా ఉన్నతమైన వ్యక్తిత్వం కలిగి ఉంది. అంతేకాని ఆమె దేవత కాదు. ఆమె మాయలేమి చేసి పైకి రాలేదు. ప్రతిభతోనే బాలీవుడ్‌లో స్థానం నిలుపుకొన్నది. ఐశ్వర్యకు ఇండస్ట్రీలో గాడ్‌ఫాదర్ ఎవరూ లేరు. కష్టపడి పైకి వచ్చింది. ఆమెతో కలిసి నటించడం చాలా ఈజీగా ఉంటుంది.

తీవ్ర ప్రమాదం నుంచి బయటపడిన..

తీవ్ర ప్రమాదం నుంచి బయటపడిన..

నాసిక్‌కు 25 కిలోమీటర్ల దూరంలోని త్రయంబకేశ్వర్ వద్ద ఖాకీ షూటింగ్ జరుగుతున్నది. షూటింగ్‌లో ఐశ్వర్యను అదుపు తప్పిన ఓ జీప్ బలంగా ఢీకొట్టింది. దాంతో ఆమె ఎగిరి రోడ్డు పక్కనే ఉన్న పొదల్లో పడింది. అప్పుడు నేను కాపాడాను. ఆ సమయంలో ఐశ్వర్య తీవ్రంగా గాయపడింది. కాలు విరిగింది. చర్మమంతా గీరుకుపోయింది. ఆమెకు దాదాపు పది కుట్లు పడ్డాయి. ఒక నెల విశ్రాంతి తీసుకోవాల్సి వచ్చింది. ఈ విషయం ఎవరికీ తెలియదు.

గొప్పలు చెప్పుకోవడం అవుతుంది.

గొప్పలు చెప్పుకోవడం అవుతుంది.

ఐశ్వర్య స్థానంలో ఎవరున్నా నేను అదే చేస్తాను. ఆమె ప్రాణాలు కాపాడాని చెప్పడం కొంత నాటకీయం అవుతుంది. ప్రమాదంలో ఉంటే తోటి నటుడిగా చొరవ తీసుకొని కాపాడాను. అంతేగానీ దానిని గురించి ఎక్కువగా చెప్పుకోవడం అప్రస్తుతం.

ఎవరున్నా నేను అదే చేస్తాను..

ఎవరున్నా నేను అదే చేస్తాను..

ప్రమాదంలో గాయపడిన వెంటనే యూనిట్ సిబ్బందికి ఏమి చేయాలో పాలుపోలేదు. వెంటనే నేను స్పందించి కారులో హాస్పిటల్‌కు తరలించాను. ఆ స్థానంలో ఎవరున్నా నేను అదే చేస్తాను. ఐశ్వర్య అని ప్రత్యేకంగా స్పందించలేదు.

అది తలుచుకొంటే ఆశ్చర్యం..

అది తలుచుకొంటే ఆశ్చర్యం..

ఖాకీ సినిమా తర్వాత 2010లో విపుల్ షా నిర్మించిన యాక్షన్ రిప్లే సినిమాలో ఐశ్వర్య, నేను నటించాం. ఆ సినిమా తర్వాత మళ్లీ కలిసి ఏ సినిమాలోను నటించలేదు. తలచుకొంటే అలా ఎందుకు జరిగిందో మా ఇద్దరికి ఆశ్చర్యం కలుగుతుంది.

ఖాకీకి ముందు...

ఖాకీకి ముందు...

మా ఇద్దరికి సంబంధించి మీ అందరికీ తెలియని మరో విషయం ఉంది. ఖాకీ సినిమాకు ముందు మొహ్రా సినిమాలో నటించాలని ఐశ్వర్యను ముందు నిర్మాతలు సంప్రదించారు. మిస్ వరల్డ్ గెలిచిన సందర్భంగా చేసిన కాంట్రాక్టు వల్ల ఆమె ఆ సినిమాను వదులుకొన్నది.

English summary
Akshay Kumar and Aishwarya Rai Bachchan are one of the most good-looking on-screen pairs of Bollywood. Unfortunately the two did not do many films together. We recently came across an old interview of Akshay Kumar in which he talked about working with Aishwarya Rai and why he thought that Aish is no diva.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu