»   » నన్ను ఫిజికల్‌గా తాకాలని చూస్తాడు, అది లిప్‌కిస్ కాదు: నోరు విప్పిన అనీల్ కపూర్

నన్ను ఫిజికల్‌గా తాకాలని చూస్తాడు, అది లిప్‌కిస్ కాదు: నోరు విప్పిన అనీల్ కపూర్

Posted By:
Subscribe to Filmibeat Telugu

అనీల్ కపూర్ ఇప్పుడంటే కాస్త అంకుల్ లుక్ లోకి వచ్చేసాడు గానీ ఇంతకుముందైతే ఎలా ఉండేవాడో చెప్పేపని లేదు కదా. అయితే ఈ స్టార్ మీద ఆడపిల్లలు కాస్త ఆకర్శణలో ఉంటే ఉండొచ్చుగానీ... మరీ మగాళ్ళు కూడా పడిపోతారట. మరీ అలా అనుమానపడిపోకండీ అనీల్ కపూర్ చెప్పింది మ్యూజిక్ డైరెక్టర్ అనూమాలిక్ గురించే....

ఈ హీరోని ప్రముఖ సంగీత దర్శకుడు అను మాలిక్ అమితంగా ఇష్ట పడతాడు. ఆ మధ్య ఒక అవార్డుల ఫంక్షలో వీరిద్దరి మధ్య ఒక ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. దీనిగురించి హీరో అనీల్ కపూర్ రెండేళ్ళ తర్వాత ఒక ఇంటర్వూ‌లో చెప్పాడు. 'అనూ మాలిక్ చాలా లవ్వింగ్ పర్సన్. నన్ను ఎప్పుడు కలుసుకున్నా అమితంగా సంతోషపడుతుంటాడు. నన్ను ఫిజికల్‌గా తాకాలని తాపత్రయ పడతాడు.

When Anu Malik planted one on Anil Kapoor’s lips
Hot Beauties In Black : Actress Black Dress Photos

ఎవరు మధ్యలో అడ్డుపడినా తన పట్టు విడువడు. ఇటీవల ఒక ఫంక్షన్‌లో నన్ను చూడగానే అనూ మాలిక్ తన దగ్గరకు గట్టిగా లాక్కున్నాడు. ఇంతలో ఒక ఫొటోగ్రాఫర్ క్లిక్ మనిపించాడు. ఆ ఫొటో చూస్తే అను మాలిక్ నన్ను ముద్దాడేందుకు ప్రయత్నిస్తున్నట్లు ఉంది. మాలిక్‌కు నేనంటే ఎంతో ఇష్టం అందుకే అలా చేశాడు' అని అనీల్ కపూర్ మురిసిపోతూ చెప్పాడు.

English summary
around 2 years later, Anil finally addressed what exactly was happening during that moment in an interview to Bollywoodlife.com. Here’s what he has to say
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu