»   » మరీ బోర్‌ కొడితే ఆ పనే...కాజల్

మరీ బోర్‌ కొడితే ఆ పనే...కాజల్

Posted By:
Subscribe to Filmibeat Telugu

తనకు మరీ బోర్‌ కొడితే అలా.. కారులో డ్రైవింగ్‌ చేసుకుంటూ బీచ్‌ను చుట్టేసి వస్తాను. షూటింగ్‌ స్పాట్‌ లో ఖాళీ దొరికితే మాత్రం మ్యూజిక్‌ వింటూ ఎంజాయ్‌ చేస్తాను అంటూ చెప్పుకొచ్చింది స్టార్ హీరోయిన్ గా ఎదిగిన కాజల్‌. 'మగధీర' చిత్రం విడుదల తర్వాత ఆమె పూర్తి స్ధాయి బిజీగా మారింది. అయితే తనకంటూ కొంత ఖాళీ సమయాన్ని కేటాయించుకుంటానని చెప్తోంది. అలాగే ఆ ఖాళీ సమయాలను ఎలా గడుపుతుందో చెప్తోంది. ఆమె మాటల్లోనే...ఖాళీ అంటూ దొరికితే పుస్తకాలు బాగా చదువుతా. అయాన్‌ ర్యాండ్‌ రచనలంటే చాలా ఇష్టం. ఆవిడ రాసిన అట్లాస్‌ష్రగ్డ్‌, ఫౌంటెయిన్‌ హెడ్‌ నన్ను బాగా ఇన్‌స్పైర్‌ చేశాయి. ఇక సినిమాలంటారా...థియేటర్‌కు వెళ్ళి సినిమా చూసే తీరిక లేదు...అందుకే ఎప్పటికప్పుడు కొత్త సినిమాల డీవీడీలు చూస్తా. అలాగే తను సినిమాల్లోకి రాకుండా వుంటే ఎంబీఏ చేయాలనుకున్నానని, ఒకవేళ అలా జరిగివుంటే ఈ పాటికి ఏ సంస్థలోనో ఓ మంచి జాబ్‌ చేసుకుంటూ వుండేదాణ్ని చెప్పుకొచ్చింది కాజల్. కాజల్ ప్రస్తుతం ఎన్టీఆర్ సరసన బృందావనం చిత్రంలో చేస్తోంది.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu