»   » 5 స్టార్ హోటల్‌లో ఉండటానికి నిరాకరించిన జూ ఎన్టీఆర్!

5 స్టార్ హోటల్‌లో ఉండటానికి నిరాకరించిన జూ ఎన్టీఆర్!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: జూ ఎన్టీఆర్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘నాన్నకు ప్రేమతో'. ఈ సినిమా షూటింగ్ దాదాపు మూడు నెలల పాటు లండన్ లో జరిగిన సంగతి తెలిసిందే. షూటింగ్ జరుగుతున్నంత కాలం బస చేసేందుకు జూ ఎన్టీఆర్ కోసం నిర్మాతలు లండన్‌లో ఫైవ్ స్టార్ హోటల్ బుక్ చేసారు. కాస్ట్ కట్టింగ్‌లో భాగంగా ఇతర నటీనటులు, టెక్నీషిన్ల కోసం ఎకనామికల్ హోటల్ బుక్ చేసారు.

అయితే తనకు ఒక్కడికే ఫైవ్ స్టార్ హోటల్ బుక్ చేయడం, తనకు విఐపీ ట్రీట్ మెంట్ ఇవ్వడం ఎన్టీఆర్ కంఫర్టుగా ఫీలవ్వలేదు. తనకు యూనిట్ సభ్యులందరితో కలిసి ఉంటేనే కంఫర్టుగా ఉంటుందని తాను కూడా మిగతా యూనిట్ సభ్యులు ఉంటున్న ఎకనామికల్ హోటల్‌కు మూవ్ అయ్యాడట.

When Jr NTR refused to stay in 5-Star Hotel?

ఈ విషయం గురించి సుకుమార్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వెల్లడిస్తూ...‘తొలుత తారక్ కోసం లగ్జరీ హోటల్ బుక్ చేసాం. కానీ అతను మూడు రోజుల్లోనే ఆ హోటల్ ఖాళీ చేసి మేముంటున్న సాధారణ హోటల్ కు వచ్చారు. యూనిట్ సభ్యులందరితో కలిసి ఉంటేనే తనకు ఎక్కువ కంఫర్టబుల్ గా ఉంటుందని చెప్పాడు. షూటింగ్ సమయంలో యూనిట్ సభ్యులతోనే కలిసి భోజనం చేసేవాడు' అని సుకుమార్ తెలిపారు.

‘నాన్నకు ప్రేమతో' సినిమాకు సంబంధించిన విషయాల్లోకి వెళితే. ఎన్టీఆర్‌కు 25వ సినిమా ఇది. సుకుమార్ దర్శకత్వంలో రిలయన్స్ ఎంటర్‌టైన్‌మెంట్ సమర్పణలో బీవీయస్‌యన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. అక్టోబర్ 16 నుండి ఈ సినిమాకు సంబంధించిన స్పెయిన్ షెడ్యూల్ మొదలు కానుంది. నవంబర్లో మొత్తం షూటింగ్ పూర్తి కానుంది. ఈ చిత్రం జనవరి 8,2016న విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ లోగా దసరా పండుగను పురస్కరించుకుని అక్టోబర్ 22న టీజర్ ని విడుదల చేయాలని నిర్ణయించారు.

English summary
The shooting of 'Nannaku Prematho' happened in London for a period of three months. Producers booked a room in 5-Star Hotel for film's lead Jr NTR and rest of the cast & crew were offered accommodation in some economical hotels as part of the cost cutting measure. NTR, however, wasn't comfortable with the whole idea of VIP Treatment for him alone.
Please Wait while comments are loading...