»   » ఆపుకోలేక ఏడ్చేసాను అంటున్న 'కొమురం పులి' హీరోయిన్

ఆపుకోలేక ఏడ్చేసాను అంటున్న 'కొమురం పులి' హీరోయిన్

Posted By:
Subscribe to Filmibeat Telugu

పవన్ కళ్యాణ్ తాజా చిత్రం కొమురం పులి ద్వారా పరిచయమవుతున్న నిఖిషా పటేల్ మీడియాతో రీసెంట్ గా మాట్లాడింది. ఆమె మాట్లాడుతూ...దాదాపు రెండుళ్లుగా ఈ యూనిట్‌తో నా ప్రయాణం సాగింది. అందుకే షూటింగ్‌ చివరి రోజున ఆగలేక ఏడ్చేశాను. నేను ఏడ్వడం చూసిన 'కొమరం పులి" యూనిట్‌ మొదటి సినిమాకి చాలా మంది ఇలానే రియాక్ట్‌ అవుతారు.. ఆ తర్వాత తర్వాత రొటీన్‌ అయిపోతుంది అన్నారు. మరి.. నా తదుపరి చిత్రాలకు నేనెలా రియాక్ట్‌ అవుతానో కాలమే చెబుతుంది"అన్నారు. ఇక ఖుషీ ఫేమ్ ఎస్‌.జె. సూర్య డైరక్ట్ చేస్తున్నఈ చిత్రంలో శ్రియ ఐటం సాంగ్ చేస్తోంది. అలాగే ఎ.ఆర్.రహమాన్ అందించిన పాటలు ఇప్పటికే హిట్ టాక్ తెచ్చుకున్నాయి. ఇక ఈ చిత్రంలో నిఖిషా లేడీ పోలీస్ ఆఫీసర్ గా కనిపిస్తుంది.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu