Just In
Don't Miss!
- News
మూడ్ ఆఫ్ ది నేషన్: కరోనాపై భారత్‌దే పైచేయి, మోడీ సర్కారు సక్సెస్, లాక్డౌన్ ఎఫెక్ట్, వ్యాక్సిన్‌కే మొగ్గు
- Finance
తగ్గిన బంగారం ధర, పెరిగిన వెండి ధర: రూ.50,000 దిగువనే బంగారం
- Sports
సొంతగడ్డపై భారత్‌ను ఓడించడం కష్టమే: జోరూట్
- Automobiles
ఉత్పత్తిలో '100 మిలియన్' రికార్డ్ కైవసం : హీరోమోటోకార్ప్
- Lifestyle
Happy Republic Day 2021 :మనందరికీ ప్రేరణనిచ్చే ఈ మెసెజెస్ తో ‘రిపబ్లిక్ డే’ విషెస్ చెప్పండిలా...
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
హాట్ న్యూస్ : అనుష్కపైకి కత్తి విసిరిన మహేష్ బాబు!
హైదరాబాద్ : 2013 సంవత్సరంలో తెలుగులో తెరకెక్కుతున్న ప్రముఖ చిత్రాల్లో గుణశేఖర్ దర్శకత్వంలో రూపొందుతున్న 'రుద్రమదేవి' చిత్రం ఒకటి. అనుష్క టైటిల్ రోల్ పోషిస్తున్న ఈచిత్రంలో రాణా హీరోగా నటిస్తుండగా, ప్రకాష్ రాజ్ ఇతర నటీనటులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.
తాజాగా ఫిల్మ్ నగర్ నుంచి అందుతున్న సమాచారం ప్రకారం తెలుగు స్టార్ హీరో మహేష్ బాబు కూడా ఈచిత్రంలో కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఈచిత్రంలో మహేష్ బాబు గెస్ట్ రోల్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇటీవల మహేస్ బాబుకు సంబంధించిన సీన్లు చిత్రీకరిస్తుండగా ప్రమాద వశాత్తు అనుష్క గాయపడిందని, మహేష్ బాబు విసిరిన కత్తి అనుష్కకు తగిలిందని సమాచారం అందుతోంది.
సీన్ చిత్రీకరణలో భాగంగా మహేష్ బాబు అనుష్కపై కత్తి విసిరగా....అనుష్క దాని నుంచి తప్పించుకుని పక్కకు దూకాలి. కానీ పక్కకు తప్పుకోవడంలో అనుష్క విఫలం కావడంతో ఆ కత్తి నేరుగా వచ్చి అనుష్కకు తాకింది. అదృష్టవశాత్తు ఆ కత్తి కార్డ్ బోర్డుతో తయారు చేసింది కావడంతో అనుష్క చిన్నపాటి గాయంతో తప్పించుకుంది. వైద్యులు ఆమెకు చికిత్స చేసారట.

ఖలేజాలో కలిసి నటించిన మహేష్ బాబు-అనుష్క
మహేష్ బాబు గతంలో అనుష్కతో 2010 సంవత్సరంలో ఖలేజా చిత్రంలో నటించాడు. ఈ చిత్రంలో మహేష్ బాబు అల్లూరి సీతా రామరాజు పేరుగల పాత్రలో నటించగా, అనుష్క సుభాషిని పాత్రలో నటించింది. త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈచిత్రానికి దర్శకుడు.

ఖలేజా చిత్రంలో మహేష్ బాబు పెర్ఫార్మెన్స్
ఖలేజా చిత్రంలో మహేష్ బాబు తన గత సినిమాలకు భిన్నమైన పెర్పార్మెన్స్ చూపించారు. ముఖ్యంగా ఈచిత్రంలో మహేష్ బాబు చాలా కామెడీ పండించారు. ఈ చిత్రంలో ఆయన క్యారెక్టరైజేషన్ కూడా డిఫరెంటుగా సాగింది. అయితే ఈచిత్రం కమర్షియల్ సక్సెస్ కాలేదు.

అనుష్కతో మహేష్ బాబు కెమిస్ట్రీ సూపర్
ఖలేజా మూవీలో మహేష్ బాబు, అనుష్క మధ్య మాంచి స్క్రీన్ కెమిస్ట్రీ వర్కౌట్ అయింది. వీరిద్దరి మధ్య వచ్చే సన్నివేశాలు ఎంతో కామెడీగా, రొమాంటిక్ గా ఆకట్టుకున్నాయి. అయితే సినిమా ఊహించిన సక్సెస్ కాకపోవడంతో వీరిద్దరు మళ్లీ కలిసి నటించలేదు.

ఖలేజా మూవీ బాక్సాఫీసు కలెక్షన్స్
ఖలేజా సినిమా బాక్సాఫీసు వద్ద సరైన టాక్ లేక పోయినా....బాక్సాఫీసు వద్ద డీసెంట్ బిజినెస్ చేసింది. అయితే ఇది చెప్పుకోదగ్గ విషయంఏమీ కాదు. రూ. 37 కోట్లతో నిర్మాణమైన ఈచిత్రం 50 రోజులు ఆడి రూ. 40 కోట్లు వసూలు చేసింది

ఖలేజా మూవీ డబ్బింగ్ వెర్షన్
ఖలేజా చిత్రం తెలుగులో విడుదలైన తర్వాత ఇతర భాషల్లోకి అనువదించారు. తమిళంలో ఈచిత్రం ‘భద్ర' పేరుతో, హిందీలో ‘జిగర్ ఖలేజా' పేరుతో, బెంగాలీలో ‘ఎకాయ్ ఎక్షో' పేరుతో, ఒరియాలో ‘అబాతర్' పేరుతో విడుదలైంది.

రుద్రమదేవి చిత్రంలో మహేష్ బాబు రోల్
అనుష్క ప్రధాన పాత్రలో నటిస్తున్న రుద్రమదేవి సినిమాకు సంబంధించి అందుతున్న వివరాల ప్రకారం ఈ చిత్రంలో మహేష్ బాబు గెస్ట్ రోల్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో ఆయన ముఖ్యమైన పాత్రలో కనిపిస్తారట.