»   » మ్యూజిక్ డైరక్టర్ దేవిశ్రీ ప్రసాద్ హీరోగా....

మ్యూజిక్ డైరక్టర్ దేవిశ్రీ ప్రసాద్ హీరోగా....

Posted By:
Subscribe to Filmibeat Telugu

నేను హీరోగా నటిస్తాననీ వార్తలు వస్తూనే ఉన్నాయి. చేయాలని ఉంది. కానీ కథ నచ్చాలి. అది నన్ను వెంటాడాలి. అలాంటప్పుడు నటించడానికేం అభ్యంతరం లేదు అంటున్నారు ప్రముఖ సంగీత దర్శకులు దేవిశ్రీ ప్రసాద్. ఆయన మీడియాతో మాట్లాడుతూ...తను సినిమా చేయాలంటే వేసుకోవాల్సిన వర్కింగ్ ప్లాన్ చెప్పుకొచ్చారు. ఆయన మాటల్లోనే...నటించాలని నాకు నాలుగు నెలలు ముందుగా చెబితే మిగిలిన సంగీత పనులను పూర్తి చేసుకుని నటనకు సమయాన్ని కేటాయించడానికి వీలుంటుంది. ప్రస్తుతానికి నేను నా ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాను అన్నారు. ఆ మధ్యన ఎమ్.ఎస్.రాజు బ్యానర్ లో దేవి హీరోగా మంత్ర దర్శకుడు తులసీరామ్ హీరోగా సినిమా ప్రారంభం కానుందని వార్తలు వచ్చాయి. వాటిని ఆయన కొట్టి పారేస్తూ ఇలా చెప్పుకొచ్చారు. అలాగే సంగీతకారులందరికీ సినిమాల్లో అవకాశాలు దొరకట్లేదు. అలాంటప్పుడు వారు ఆల్బమ్‌ల ద్వారా తమ ప్రతిభను నిరూపించుకోవచ్చు అన్నారు. ఇక ప్రస్తుతం ఆయన తమిళంలో కమల్ ‌హాసన్‌, సూర్య, విక్రమ్ ‌లు నటించే చిత్రాలకి సంగీతం అందిస్తున్నారు. అలాగే తెలుగులో ధరణి దర్శకత్వంలో రామ్ చరణ్‌ సినిమా, ప్రభాస్‌, దశరథ్‌ల చిత్రం చేస్తున్నారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu