»   » అజారుద్దీన్ భార్యని ఆ హీరో పెళ్ళి చేసుకోవాలనుకున్నాడా?: బాలీవుడ్ గగ్గోలెత్తిపోతోంది

అజారుద్దీన్ భార్యని ఆ హీరో పెళ్ళి చేసుకోవాలనుకున్నాడా?: బాలీవుడ్ గగ్గోలెత్తిపోతోంది

Posted By:
Subscribe to Filmibeat Telugu

సల్మాన్ ఖాన్... బాలీవుడ్ బ్యాడ్ బాయ్ గా స్టిల్ సింగిల్ గా ఒన్న ఒకే ఒక బాలీవుడ్ హీరో. ఇప్పటివరకూ సల్మాన్ జీవితం లోకి వచ్చిన అమ్మాయిల లిస్ట్ చెప్పాలంటే ఎవ్వరికీ సాధ్యం కాక పోవచ్చుకూడా. అంత మందితో సల్మాన్ ఎఫ్ఫైర్లు నడిచాయి. కానీ ఎవ్వరితోనూ వివాహ బందాన్ని మాత్రం ఏర్పరుచుకోలేకపోయాడు సల్మాన్. ఇప్పుడు తాజాగా అజారుద్దీన్ మాజీ భార్య సంగీతా బిజిలానినీ ని పెళ్ళి చేసుకుంటానేమో అని సల్మాన్ చెప్పిన ఇంటర్వ్యూ ఒకటి బయటకు వచ్చింది...

కాఫీ విత్ కరణ్ షోలో కూడా

కాఫీ విత్ కరణ్ షోలో కూడా

కొన్నాళ్ళ క్రితం బాలీవుడ్ దర్శకుడు కరణ్ జోహార్ నిర్వహించే కాఫీ విత్ కరణ్ షోలో కూడా ఇదే విషయాన్ని ప్రస్తావించాడు సల్మాన్ ఆమె తనను మోసం చేస్తూ ఒపట్టు బడింది అంటూ ఇండైరెక్ట్ గా సంగీతా తో తన పెళ్ళి ఎందుకు విఫలమయ్యిందీ అన్న విషయాన్ని చెప్పాడు.

లిస్ట్ కాస్త పెద్దదే

లిస్ట్ కాస్త పెద్దదే

పలువురు బాలీవుడ్ భామలతో ఎఫైర్లు నడిపిన సల్మాన్ లిస్ట్ కాస్త పెద్దదే. అయితే..సల్మాన్‌ 1999-2001 మధ్య కాలంలో ఐశ్వర్య రాయ్‌తో డేటింగ్‌ చేశాడు. ఆ తరువాత కత్రినా కైఫ్‌తో చాలా కాలం సంబంధాలు కొనసాగించాడు. వీరిద్దరూ కాకుండా, అజరుద్దీన్‌ మాజీ భార్య సంగీతా బిజిలాని, సోమీ ఆలీతో కూడా సల్మాన్‌కు బలీయమైన సంబంధాలు ఉన్నాయనేది అందరూ నమ్మే నిజం.

పాత ఇంటర్వ్యూ

పాత ఇంటర్వ్యూ

కొందరి విషయంలో సల్మాన్ నడిపిన ఎఫైర్ సీరియస్ గా ముందుకు వెళ్లాయి కూడా. అయితే.. పెళ్లి వరకూ ఏ ఎఫైర్ వెళ్లలేదు. తాజాగా సల్మాన్ కు సంబంధించిన ఒక పాత ఇంటర్వ్యూ ఒకటి వైరల్ గా మారింది. అందులో తాను నటి సంగీతా బిజిలానీని ప్రేమిస్తున్నట్లుగా చెప్పటమే కాదు.. తనను పెళ్లి చేసుకోవాలనుకుంటున్న విషయాన్ని చెప్పటం ఉంది.

సంగీత కావొచ్చు

సంగీత కావొచ్చు

1993 నాటి వీడియో తాజాగా బయటకు వచ్చింది. సల్మాన్ ను లవ్ గురించి ప్రస్తావించినప్పుడు.. అవును..నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. ఆ సమయం వస్తే తప్పకుండా చేసుకుంటా. అది సంగీత కావొచ్చు.. ఇంకెవరైనా కావొచ్చు అని చెప్పిన సల్మాన్.. మరిన్ని ప్రశ్నలు వేసేలోపు.. వ్యక్తిగత ప్రశ్నలకు సమాధానం చెప్పనంటూ మండిపడిన వీడియో ఇప్పుడు బయటకు వచ్చి అందరి దృష్టిని ఆకర్షించింది.

విషాదం ఏమిటంటే

విషాదం ఏమిటంటే

సల్మాన్ నుంచి దూరమైన సంగీతా ఆతర్వాత అప్పటి ఇండియన్ క్రికెట్ టీమ్ లో ముఖ్యుడైన హైదరాబాదీ అజారుద్దీన్ కి దగ్గరవ్వటమూ, 1996 లో వీరిద్దరికి పెళ్ళి జరగటమూ జరిగిపోయింది. కానీ విషాదం ఏమిటంటే...! సల్మాన్ ఇప్పటికీ ఒంటరిగానే ఉండిపోతే... 2010 లో అజార్ నుంచి విడాకులు తీసుకున్న సంగీతా కూడా ఇప్పుడు ఒంటరిగానే జీవితాన్ని గడిపేస్తూ ఉండటం...

English summary
In this 1993 interview, when Khan was asked about his much-talked about personal life and his plans to get married, the actor had confessed, "Yes, I plan to marry. When the time comes I will. It could be to Sangeeta (Bijlani) or to anybody else."
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu