»   » ఫుల్ ఫన్ : మహేష్ ని ఇంటర్వూ చేసిన సమంత, కాజల్ (వీడియో)

ఫుల్ ఫన్ : మహేష్ ని ఇంటర్వూ చేసిన సమంత, కాజల్ (వీడియో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్‌: వైజాగ్ కోసం మైము సైతం అంటూ ఈవెంట్ ని టాలీవుడ్ మొత్తం కలిసి చేసింది. అప్పుడు మహేష్ ని, త్రివిక్రమ్ ని కలిసి సమంత ఇంటర్వూ చేసింది. అది పెద్ద హిట్టైంది. ఇప్పుడు మరోసారి అలాంటి ఫీటే చేసారు.

మహేశ్‌బాబు, కాజల్‌, సమంత కలయికతో తెరకెక్కిన 'బ్రహ్మోత్సవం' చిత్రం కోసం అభిమానులు ఎంతో ఉత్కంఠంగా ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. అభిమానుల ఉత్కంఠకు తెరదీస్తూ ఈ చిత్రాన్ని మే నెలాఖరులోనే అంటే ఈ వారంలోనే మన ముందుకు వచ్చేస్తోంది. ఈ నేపధ్యంలో ఈ చిత్రం ప్రమోషన్స్ ని రెట్టింపు చేసారు. మీడియా ముందుకు పెద్దగా రాని మహేష్ సైతం టీవీ స్పెషల్ షోలో పాల్గొని సినిమా గురించి చెప్పేస్తున్నాడు.

అంతా మహేష్ బాబు, లేదా హీరోయిన్స్ మాట్లాడితే ఏం ఇంట్రస్టుగా ఉంటుంది. అయినా ప్రతీసారి చెప్పిందే చెప్పాలి..అందుకే ఇదిగో ఇలా స్పెషల్ గా హీరోయన్స్ ఇద్దరూ మహేష్ ని ఇంటర్వూ చేయటం డిజైన్ చేసారు. ఇంటర్వూ అయితే అదిరిపోయింది. మరి మీరు ఓ లుక్కేయండి.

ఇక శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహించిన 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' చిత్రంలో కూడా వెంకటేష్, మహేష్ బాబులకు పేర్లు ఉండవు..సినిమా చివరిదాకా చిన్నోడా, పెద్దోడా అనే పలుకుతారు. తాజాగా 'బ్రహ్మోత్సవం' చిత్రంలో కూడా సేమ్ ఇదే సీన్ రిపీట్ అయ్యిందట.

ఓ ఇంటర్వ్యూలో మహేష్ బాబు మాట్లాడుతూ.. బ్రహ్మోత్సవం చిత్రంలో నా పాత్రకు ఏ పేరూ పెట్టలేదట శ్రీకాంత్ అడ్డాల. అయితే ఇందులో ఉన్న పాత్రలు నన్ను ఎమని పిలుస్తారో.. తెరమీదే చూడాల్సిందే అంటూన్నారు మహేష్ బాబు.

 When Samantha Interviewed Mahesh Babu & Kajal Aggarwal

ఈ మేరకు డిస్ట్రిబ్యూటర్స్ అన్ని సెంటర్స్ లోనూ ఈ విధంగా షోలు వేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. ఈ చిత్రంలో మహేష్ సరసన కాజల్, సమంతా, ప్రణీత కథాయికలుగా నటిస్తుండగా, చిత్ర పరిశ్రకు చెందిన హేమాహేమీలు ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. శ్రీకాంత్, మహేష్ కాంబినేషన్ లో వస్తున్న రెండో చిత్రం కాబట్టి 'బ్రహ్మోత్సవం' చిత్రానికి రెట్టింపు అంచనాలున్నాయి. సెన్సార్ సభ్యుల ప్రశంసలతో చిత్ర యూనిట్ సంతోషంగా ఉన్నారు .


ఈ చిత్రం సెన్సార్ సభ్యులు ''క్లీన్ యు ''సర్టిఫికేట్ ఇవ్వడమే కాకుండా అద్భుతమైన సినిమా తీసారని దర్శక నిర్మాతలను అభినందించారట . కుటుంబ విలువలు , బంధాలు -అనుబంధాల నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం కన్నుల పండుగల ఉందని తెగ మెచ్చుకున్నారట. కాగా ఈ నెల 20న ఉదయం 8-10నిమిషాల ప్రత్యేక షోతో బ్రహ్మోత్సవం ప్రత్యేక షోతో విడుదలవుతోంది.

అన్నివర్గాలను ఆకట్టుకునేలా మంచి కథతో ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్లు హీరో,హీరోయిన్స్ పేర్కొన్నారు. శ్రీకాంత్‌ అడ్డాల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని మహేశ్‌బాబు, ప్రసాద్‌ వి. పొట్లూరి నిర్మించారు. మిక్కీ జె. మేయర్‌, మణిశర్మ సంగీతం సమకూర్చారు.

English summary
Sam turned a host for Brahmotsavam promotions and had quizzed Mahesh and Kajal some interesting questions, where she managed to extract quite a few unknown things about Brahmotsavam and its filming process.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu