»   » కానీ చోట్ల గిల్లతూ, అసభ్యంగా నాపై లైంగిక వేధింపులు: హీరోయిన్ తాప్సీ

కానీ చోట్ల గిల్లతూ, అసభ్యంగా నాపై లైంగిక వేధింపులు: హీరోయిన్ తాప్సీ

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై: ''నేను డిల్లీలో పెరిగాను. ఏదైనా ఉత్సవాల సమయంలో జనాల కూటమి అధికంగా ఉంటుంది. అలాంటి సమయాల్లో అబ్బాయిలు అమ్మాయిలను అల్లరి చేస్తారు. కానిచోట్ల గిల్లుతూ అసభ్యంగా ప్రవర్తిస్తుంటారు. లైంగిక వేధింపులకు పాల్పడతారు. చాలా శాడిజం ప్రదర్శిస్తారు. అలాంటి క్లిష్టపరిస్థితులను నేనూ ఎదుర్కొన్నాను.

ద్వంద్వార్థాలతో హింసిస్తుంటారు. వారి చూపులు కూడా చాలా క్రూరంగా ఉంటాయి. అందుకే అలాంటి చోట్లకు వెళ్లవద్దని, అలాంటి దుస్తులు ధరించవద్దని, అణిగిమణిగి ఉండాలని ఇంట్లో పెద్దలు హితవు పలికేవారు. అప్పట్లో లైంగిక వేధింపులను ఎదిరించకపోవడం నేను చేసిన తప్పు అని ఇప్పుడు అనిపిస్తోంది'' అని నటి తాప్సీ పేర్కొన్నారు

తన అందం మరియు అభినయంతో తెలుగు వారిని ఆకట్టుకున్న ఢిల్లీ ముద్దుగుమ్మ తాప్సీ కి తెలుగులో ఇంతవరకూ చెప్పుకోదగ్గ కమర్షియల్ హిట్ లేదు. తను నటించిన తెలుగు సినిమాల్లో ఒకే ఒక్క 'మిస్టర్ పర్ ఫెక్ట్' సినిమా తప్ప మిగిలిన సినిమాలన్నీ బాక్స్ ఆఫీస్ వద్ద ఫ్లాఫ్ లుగా నిలిచాయి. ఎన్నో ఆశలు పెట్టుకుని చేసిన 'గుండెల్లో గోదారి', 'షాడో', చంద్ర శేకర్ యేలేటి సాహసం చిత్రాలు ఆడకపోవటం ఆమెను బాలీవుడ్ వైపు ప్రయాణం చేసేలా చేస్తున్నాయి.

ఈ క్రమంలోనే ఆమె ఓ ప్రధాన పాత్రలో నటించిన 'పింక్' అనే బాలీవుడ్ సినిమా నేడు పెద్ద ఎత్తున విడుదలైంది. బాలీవుడ్‌లో దర్శకుడిగా ఓ ప్రత్యేక బ్రాండ్ సంపాదించుకున్న సుజీత్ సర్కార్ నిర్మాణంలో రూపొందిన ఈ సినిమాకు మొదటి షో నుంచే అన్నివర్గాల నుంచి ప్రశంసల వర్షం కురుస్తోంది.

అమితాబ్ బచ్చన్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా ఓ కోర్ట్ రూమ్ డ్రామాగా తెరకెక్కింది. అనిరుద్ధా రాయ్ చౌదరి ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ఇక ఈ సినిమాకు సంబంధించిన ఓ స్పెషల్ షోను హైద్రాబాద్‌లో టాలీవుడ్ సెలెబ్రిటీలకు ప్రదర్శించారు.

When Tapsee was Molested?

ఇక ఈ చిత్రం ప్రమోషన్ లో భాగంగా మాట్లాడుతూ... యుక్త వయసులో తానూ లైంగిక వేధింపులకు గురయ్యానని చెప్పుకొచ్చారు నటి తాప్సీ. ఇప్పటివరకూ తాను చాలా ధైర్యవంతురాలిని అంటూ చెప్పుకొచ్చిన ఈ ఢిల్లీ బ్యూటీ తన నిజజీవితంలోని మరో కోణాన్ని తాజాగా పేర్కొన్నారు. అది ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్‌గా సంచలనం కలిగిస్తోంది.

తాప్సీకిప్పుడు తమిళం, తెలుగు భాషల్లో అవకాశాలు లేవు. హిందీలో బిగ్‌బీ అమితాబ్‌తో నటించిన పింక్ చిత్రం ఇటీవలే తెరపైకి వచ్చింది. అందులో ఈ భామ అత్యాచారానికి గురైన అమ్మాయిగా నటించారు. ఈ పాత్ర గురించి ఇప్పటికే చాలాసార్లు ప్రచారం చేసుకున్న తాప్సీ.. తాజాగా ఈ పాత్రకు, తన నిజ జీవితానికి చాలా పోలికలు ఉన్నట్టు పేర్కొన్నారు.

English summary
Some of the shocking facts revealed by Tapsee Pannu during the promotions of the movie raises questions on how women were treated in the country. As a Teenager who would have to travel in DTC Buses in Delhi for going to college, Tapsee have to deal with molestation.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu