»   » అదృష్టం బాగుంది: షారుక్‌కు పెద్ద యాక్సిడెంట్ తప్పింది ,లేకపోతే

అదృష్టం బాగుంది: షారుక్‌కు పెద్ద యాక్సిడెంట్ తప్పింది ,లేకపోతే

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబయి: అవును నిజమే...బాలీవుడ్‌ బాద్షా షారుక్‌కి కొద్దిలో ప్రమాదం తప్పింది. ఈ విషయం విన్న అభిమానులు ఆనందంతో సోషల్ నెట్ వర్కింగ్ సైట్లలో భగవంతుడుకి ధాంక్స్ చెప్తున్నారు.

అసలేం జరిగిందంటే...షారుక్‌.. ప్రస్తుతం గౌరీ షిండే దర్శకత్వం వహిస్తున్న 'డియర్‌ జిందగీ' చిత్రంలో నటిస్తున్నాడనే విషయం తెలిసిందే కదా. ఇందులో షారుక్‌కి జంటగా ఆలియా భట్‌ నటిస్తోంది. సినిమాలో షారుక్‌, ఆలియాలు సైకిల్‌పై గల్లీ రోడ్డులో చక్కర్లు కొట్టాల్సిన సన్నివేశం ఉంటుంది.

When a tempo driver ran into Shah Rukh Khan’s cycle

ఈ సీన్ కోసం కావాల్సిన సామాన్లతో పాటు చిత్ర యూనిట్ మొత్తం ఆప్రదేశానికి ఓ టెంపోలో వచ్చారు. టెంపో ఆగిన చోటే షారుక్‌ సైకిల్‌ పక్కన నిల్చున్నాడు. అయితే టెంపో డ్రైవర్‌ చూసుకోకుండా బండి స్టార్ట్‌ చేయడంతో అది సైకిల్‌పైకి దూసుకెళ్లింది. వెంటనే గమనించిన షారుక్‌ పక్కకు తప్పుకోవడంతో ప్రమాదం తప్పింది. అనంతరం దర్శకురాలు గౌరి, కెమెరామెన్‌ సైకిల్‌ సన్నివేశాన్ని గబగబా చిత్రీకరించినట్లు బాలీవుడ్‌ వర్గాలు వెల్లడించాయి.

రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్ మెంట్స్, ధర్మ ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తోన్న లవ్ ఎంటర్ టైనర్ డియర్ జిందగీ. ఈ చిత్రంలో షారూఖ్ ఖాన్, అలియా భట్ ప్రధాన పాత్రలలో నటించగా ఆదిత్య రాయ్ కపూర్, కునాల్ కపూర్ లు ముఖ్య పాత్ర పోషించారు.

ఇటీవల ఈ సినిమాకు సంబంధించి ఫస్ట్ లుక్ తో పాటు టేక్ వన్, టేక్ టూ అంటూ టీజర్ విడుదల చేశారు. ఇందులో షారూఖ్, అలియాల కెమిస్ట్రీ బాగానే ఉన్నట్టు అర్దమవుతోంది. ఆ వీడియోని మీరు ఇక్కడ చూడవచ్చు. నవంబర్‌ 23న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

English summary
Superstar Shah Rukh Khan escaped a major accident on the sets of ‘Dear Zindagi’. The incident happened when SRK and Alia were shooting a scene on the streets of Goa.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu