twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రజనీకాంత్‌ గురుదక్షిణ...(టీచర్స్ డే కానుక)

    By Srikanya
    |

    When Thalaiva paid tribute to his teacher
    బెంగళూరు : దటీజ్ రజనీకాంత్ అని మరో సారి అనిపించుకున్నారు సూపర్ స్టార్. ఎంత ఎత్తుకు ఎదిగినా గురువుల్ని మర్చిపోరాదని చాటిచెప్పారు నటుడు రజినీకాంత్‌. తన గురువు బి.ఎం.శాంతమ్మ(79)కు ఉపాధ్యాయ దినోత్సవ కానుకగా ఆర్థిక సాయం చేసి గురుభక్తిని చాటుకున్నారు.

    1967 నుంచి 69 వరకు బెంగళూరు గవిపురంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ప్రస్తుతం రజనీగా అందరూ పిలిచే శివాజీరావ్‌ గైక్వాడ్‌కు 5నుంచి 8వ తరగతి వరకు ఆంగ్లం, కన్నడ పాఠ్యాంశాలను శాంతమ్మ బోధించారు. పదవీ విరమణ పొందిన ఆమె ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నట్లు ఎవ్వరికీ చెప్పలేదు. కానీ ఆమె పరిస్థితిని నగరానికి చెందిన ఓ అభిమాని ద్వారా తెలుసుకున్న రజనీకాంత్‌ ఆమె బ్యాంకు ఖాతాకు రూ.3లక్షలు పంపారు.

    ఉపాధ్యాయ దినోత్సవం రోజున గురువుకు కానుక అందజేయాలని అనుకొన్నా విదేశాలకు వెళ్లాల్సిరావటంతో అక్కడి నుంచే శాంతమ్మకు కానుక పంపారని రజనీ అభిమాని మురుగన్‌ తెలిపారు. గురువుల్ని మర్చిపోని వ్యక్తి శివాజీరావ్‌ అంటూ శాంతమ్మ హర్షం వ్యక్తం చేశారు.

    తాజాగా రజనీకాంత్ నటించిన తమిళ చిత్రం 'కొచ్చాడయాన్' తెలుగులో 'విక్రమ సింహ' పేరుతో విడుదలవుతోంది. 'విక్రమ సింహ' చిత్రం రాజుల నాటి కథాంశంతో తెరకెక్కిన సినిమా. రజనీ కూతురు ఐశ్వర్య ఆర్ అశ్విన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. కెఎస్ రవి కుమార్ ఈచిత్రానికి స్క్రిప్టు అందించారు. పాండ్య సామ్రాజ్య రాజు కొచ్చాడయాన్ రణధీరన్ స్టోరీ ఇన్స్‌స్పిరేషన్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. జనవరి 19, 2012లో ప్రారంభమైన ఈ చిత్రం షూటింగ్ నవంబర్, 2012లో పూర్తయింది.

    అయితే గ్రాఫిక్స్‌తో కూడిన ప్రొస్టు ప్రొడక్షన్ పనులు హెవీగా ఉండటంతో సినిమా విడుదల ఆలస్యం అవుతూ వచ్చింది. ఇప్పటికీ పోస్టు ప్రొడక్షన్ పనులు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ చిత్రాన్ని తమిళం, తెలుగు, మళయలం, హిందీ, ఇంగ్లీష్ వెర్షన్లలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. తెలుగులో ఈచిత్రాన్ని లక్ష్మీగణపతి ఫిలింస్ సంస్థ విడుదల చేయనుంది.

    English summary
    She played a starring role in his life 50 years ago, and he turned out to become a superstar. On Saturday, the man who draws millions of tributes -- the latest being an unabashed on-screen one by King Khan himself to Thalaiva -- every day paid a quiet tribute to this woman. It was a Teachers' Day unlike any other for 78-year-old B N Shanthamma when the 'poor' and 'intelligent boy' she had taught nearly half a century ago reached out to her. But the bigger surprise was when she learnt that the helping hand was extended by none other than the boy with the good handwriting, Shivajirao Gaikwad a.k.a. 'Superstar' Rajinikanth for the rest of the world.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X