»   » ఒకే ఒక్క చాన్స్ కోసం రామోజీరావు ముందుకు వెళ్ళి... ఆపై ఏమైందో 30 ఏళ్ల తరువాత చెప్పిన వర్మ

ఒకే ఒక్క చాన్స్ కోసం రామోజీరావు ముందుకు వెళ్ళి... ఆపై ఏమైందో 30 ఏళ్ల తరువాత చెప్పిన వర్మ

Posted By:
Subscribe to Filmibeat Telugu

ఆ తరువాత ఏం జరిగిందన్న విషయాన్ని ఇప్పుడు వెల్లడించాడు. "దర్శకుడిగా అవకాశం ఇవ్వాలని కోరుతూ అప్పటికే 'శ్రీవారికి ప్రేమ లేఖ', 'మయూరి', 'ప్రతిఘటన' వంటి హిట్ చిత్రాలతో జోరు మీదున్న రామోజీరావును కలిస్తే, నాకు బెస్ట్ చాన్స్ లు ఉంటాయని భావించాను. అయితే, ఆయన్ను ఎలా కలవాలో తెలియలేదు. దీంతో ఓ ఆలోచన చేశాను. ఆయన నడుపుతున్న ఆంగ్ల దినపత్రిక 'న్యూస్ టైమ్'లో 'ది ఐడియా దట్ కిల్డ్ 50 మిలియన్ పీపుల్' అన్న పేరుతో ఓ ఆర్టికల్ రాశాను. అది ప్రచురితమైంది.

ఆపై నేను కాలమిస్టునని చెప్పుకుంటూ రామోజీరావు వద్దకు వెళ్లి, మనసులోని మాటను చెప్పాను. కానీ నేను అనుకున్నది జరగలేదు. దర్శకుడికి ఇమాజినేషన్ ఉండాలని, ఆయన కింద పనిచేసే సాంకేతిక నిపుణులకు అనుభవం ఉంటే చాలని చెప్పిన నా మాటలను ఆయన అంగీకరించలేదు.

When Varma Meets Ramoji rao for Direction chance Revealed After 30 years

నా వాదనను తోసిపుచ్చుతూ, కావాలంటే తన పేపర్ లో కాలమిస్టుగా ఉద్యోగం ఇస్తానని చెప్పారు. ఏదిఏమైనా తొలిసారిగా నా పేరును పేపర్ పై చూసి స్నేహితులు, బంధువులు థ్రిల్ ఫీలయ్యారు" అని తన ఫేస్ బుక్ ఖాతాలో ఓ పోస్టును పెట్టారు. ఆ ఆర్డికల్ ఉన్న పేపర్ ను తాను పోగొట్టుకున్నానని, ఇటీవలే రాజా అనే తన స్నేహితుడు దాన్ని తెచ్చి ఇచ్చాడని చెబుతూ, ఆ ఆర్టికల్ ను తన అభిమానులతో పంచుకున్నారు.

English summary
This is an article I wrote some 30 years back for Ramoji Rao's Newstime paper in the hope of getting an appointment with him to ask for a break as a director because at that time he had come up with some unconventional hits like “Srivariki Premalekha”, “Mayuri” and “Pratighatana”. posted Ram Gopal varma
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu