»   » బద్రినాథ్ తో అప్సెట్ ఐన వినాయక్ తర్వాత సినమా ఏది? హీరో ఎవరు.?

బద్రినాథ్ తో అప్సెట్ ఐన వినాయక్ తర్వాత సినమా ఏది? హీరో ఎవరు.?

Posted By:
Subscribe to Filmibeat Telugu

ఇటీవల విడుదలైన 'బద్రీనాథ్' సినిమా మీద అల్లు అరవిందు, అల్లు అర్జునే కాదు అందరూ ఆశలు పెట్టుకున్నారు. దర్శకుడు వివి వినాయక్ కూడా భారీగానే కలలు కన్నాడు. ఆ సినిమా తనని నెంబర్ వన్ డైరెక్టర్ స్థానంలో కూర్చోబెడుతుందని అంచనా వేసుకున్నాడు. అందుకే ఏడాదిన్నర పాటు ఈ సినిమా మీదే తన సమయాన్ని వెచ్చించాడు. తీరా సినిమా రిలీజ్ అయ్యాక దాని ఫలితం అందర్నీ షాక్ కి గురిచేసింది. 'కలక్షన్లు చూడండి' అంటూ గీతా ఆర్ట్స్ అధినేత చెబుతున్నా, సినిమా మాత్రం ఫ్లాప్ కిందే లెక్క. అవన్నీ ప్రమోషన్ లో గారడీగానే చెప్పుకోవాలి!

ఇక విషయానికొస్తే...దర్శకుడు వినాయక్ తదుపరి సినిమా ఏమిటన్నదే టాలీవుడ్ లో ఇప్పుడందరూ ఆసక్తిగా, క్యురియాజిటీతో ఎదురుచూస్తున్న అంశం. ఇప్పటికే రామ్ చరణ్ తేజాతో ఒక సినిమా, పవన్ కల్యాణ్ తో ఒక సినిమా, చిరంజీవి తో 150వ సినిమా వినాయక్ చేస్తాడంటూ వార్తలొచ్చాయి. అయితే, బద్రీనాథ్ రిజల్ట్ తో వినాయక్ అప్ సెట్ అయ్యాడనీ, కొన్నాళ్లు గ్యాప్ తీసుకుంటాడనీ సన్నిహితులు అంటున్నారు. ఏమైనా, పవన్ కల్యాణ్ తోనూ, చరణ్ తోనూ ఇప్పుడు సినిమా అంటే అంత ఈజీగా కథ ఓకే అవ్వదు. మరో పక్క బద్రీనాథ్ రిజల్ట్ కూడా ఇక్కడ ఈ హీరోలని ఎలర్ట్ చేస్తూ వుంటుంది. మరి, ఈ నేపథ్యంలో వినాయక్ సినిమా ఎప్పుడు వుంటుందో..?

కాగా తాజా సమాచారం ప్రకారం వినాయక్ కమెడియన్ కం హీరో సునీల్ తో సినిమా తీయాలని ప్లాన్ చేస్తున్నాడని సమాచారంలో ఉంది. బద్రినాథ్ ఫ్లాప్ అవడంతో తనపై నమ్మకాన్ని పెంచడం కోసం అర్జెంటుగా ఒక హిట్ సినిమా తీయాలని భావించాడట. చరణ్ తో ఒక సినిమా చేయాల్సి ఉంది. కాని అంతకంటే ముందే ఒక హిట్ సినిమా తీసి తనను తాను నిరూపించుకోవాలని భావిస్తున్నాడట. బద్రినాథ్ తీసే సమయంలో సునీల్ తో ఒక సినిమా తీయాలని కథ రాసుకున్నాడట. ఇప్పుడు ఆ కథకు పదును పెట్టి త్వరగా పూర్తి చేసి హిట్టివ్వాలని వినాయక్ భావిస్తున్నట్టు సమాచారం.

English summary
After the much hyped film of Allu Arjun’s ‘Badrinath’, is not managing to fare well at the box office, amongst all, Director of the film VV Vinayak, and was very upset.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu