For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  2014లో రిలీజైన ఈ తెలుగు చిత్రాల్లో బెస్ట్ ఏది?(ఫొటో ఫీచర్)

  By Srikanya
  |

  హైదరాబాద్: 2014లో మన దేశంలో ఎక్కువ సినిమాలు తీసిన సినీ పరిశ్రమ ఏదీ అంటే టాలీవుడ్ అని కళ్లు మూసుకు చెప్పవచ్చు. తమిళ,హిందీ చిత్ర పరిశ్రమల రికార్డులను అది బ్రద్దలు కొట్టింది. ఇప్పటకి 1966 చిత్రాలు ప్రపంచ వ్యాప్తంగా రిలీజైతే అందులో 349 తెలుగు చిత్రాలే కావటం విశేషం. క్రితం సంవత్సరం తమిళ చిత్రాలు అలా ఎక్కువ చిత్రాలు విడుదలై రికార్డు క్రియేట్ చేస్తే ఈ సంవత్సరం టాలీవుడ్ దాన్ని బ్రద్దలు కొట్టింది.

  భాక్సాఫీస్ వద్ద కొన్ని ఫ్లాపులు ఉన్నా... తెలుగు పరిశ్రమ బిజినెస్ యాంగిల్ లోనూ టాప్ ప్లేస్ లో ఉంది. తెలుగు దర్శకులు తమదైన శైలిలో కొత్త తరహా కథలు చెప్పటానికి ఉత్సాహం చూపడమే సినిమాలు ఇన్ని రావటానికి కారణం. తెలుగునుంచి ఇప్పుడు ఇతర భాషలకు రీమేక్ లుగా చాలా సినిమాలు వెళ్లే పరిస్ధితి వచ్చింది.

  అయితే అదే సమయంలో మనకూ ఇక్కడ సృజనాత్మక శక్తిని చంపేస్తూ రీమేక్ లు వస్తున్నాయి. రీమేక్ లే సేఫ్ బెట్ గా దర్శక,నిర్మాతలే కాకుండా హీరోలు సైతం భావించటమే దీనికి కారణం అంటున్నారు విశ్లేషకులు. ఇవన్ని ప్రక్కన పెడితే ఎన్ని అవాంతరాలు వచ్చినా తెలుగు పరిశ్రమ నిరంతరంగా సినిమాలు తీస్తూ సాగిపోవటం సంతోషకర విషయం.

  2014లో వచ్చిన కొన్ని పెద్ద చిత్రాలు ... వీటిల్లో ఏది బెస్టో మీరు తేల్చి క్రింద కామెంట్ల రూపంలో తెలియచేయండి....

   నేనొక్కిడినే

  నేనొక్కిడినే

  సంక్రాంతికి విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ టాక్ తెచ్చుకున్నా ...విమర్శకుల ప్రశంసలు అందుకుంది. మహేష్ సైతం ఈ చిత్రం దర్సకుడుకు మరో చిత్రం ఇస్తానని ప్రకటించారు.

  మనం

  మనం

  అక్కినేని కుటుంబం అంతా కలిసి సెలబ్రేషన్ గా నటించిన ఈ చిత్రం వారి పర్శనల్ ఆల్బమ్ గా మాత్రమే కాకుండా అందరి ఆదరాభిమానాలు చూరుకుంది. దర్శకుడు విక్రమ్ కుమార్ దీన్ని భావోద్వేగ భరితంగా చిత్రీకరించి అందరి మన్ననలూ పొందారు.

  గోవిందుడు అందరి వాడేలే

  గోవిందుడు అందరి వాడేలే

  రామ్ చరణ్ హీరోగా వచ్చిన ఈ చిత్రం కలెక్షన్స్ పరంగా ఓకే అనిపించుకున్నా ...అందరిచేతా విమర్శలు పాలైంది. సినిమా డల్ గా ఉందని కామెంట్స్ వినిపించాయి. ఎక్సపెక్టేషన్స్ కు తగినట్లు కృష్ణవంశీ తీర్చిదిద్దకపోయినా...ఫ్యామిలీ ఆడియన్స్ కు ఈ మధ్య కాలంలో చిత్రం ఏదీ రాకపోవటం కొంతమందికి నచ్చింది.

  పవర్

  పవర్

  రవితేజ కు హిట్ చిత్రంగా ఈ సినిమా నిలిచింది. బాబీ ని దర్శకుడుగా పరిచయం చేస్తూ వచ్చిన ఈ చిత్రం డైలాగులు,స్క్రీన్ ప్లే ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

  లౌక్యం

  లౌక్యం

  గోపీచంద్ కెరీర్ లో మంచి హిట్ గా నిలిచిన ఈ చిత్రం ఫ్యామిలీ ఆడియన్స్ ని సైతం బాగా ఆకట్టుకుని హిట్ గా నిలిచింది. ముఖ్యంగా కామెడీకి మంచి మార్కులు పడ్డాయి

  రభస

  రభస

  సినిమా రిజల్ట్ ఎలా ఉన్నా తారక్,సమంత ల కెమిస్ట్రీ బాగా పండిందని ప్రసంసలు వచ్చాయి. అలాగే ఎంటర్టైన్మెంట్ పార్ట్ కూడా బాగా పండింది.

  లెజండ్

  లెజండ్

  సింహం మళ్లీ భాక్సాఫీస్ వద్ద వీర విహారం చేసింది. పూర్తిగా ఇది బాలకృష్ణ చిత్రం. ద్విపాత్రలలో ఈ చిత్రంలో బాలకృష్ణ విశ్వరూపం చూపారని అభిమానులంతా బ్రహ్మరధం పట్టారు.

  రేసు గుర్రం

  రేసు గుర్రం

  2014లో వచ్చిన బెగ్గెస్ట్ హిట్ ఈ చిత్రం. అల్లు అర్జున్ ని మరింత స్టైలిష్ గా చూపిన ఈ చిత్రం...అటు ఫన్, ఇటు ఎమోషన్స్,సెంటిమెంట్స్ అన్నీ కలిసి సినిమాను రేసు గుర్రంలా పరుగెత్తించాయి.

  ఎవడు

  ఎవడు

  అసలు అల్లు అర్జున్, రామ్ చరణ్ ఒకేసారి తెరపై కనిపిస్తున్నారంటేనే ఆ క్రేజే వేరు. అదే క్రేజ్ తో భారీ ఓపినింగ్స్ తో రిలీజైన ఈ చిత్రం ఘన విజయం సాధించింది.

  ఆగడు

  ఆగడు

  సినిమా ఫెయిల్యూర్ అయినా మహేష్...స్క్రీన్ ప్రెజెన్స్ మాత్రం అదిరిపోయిందని అంతా అన్నారు. ముఖ్యంగా శృతి ఐటం సాంగ్, తమన్నా అంద చందాలు సినిమాకు హైలెట్ గా నిలిచాయి.

  English summary
  By releasing maximum number of movies in an year, Tollywood has made a huge achievement. Also, the industry has been growing by the introduction of many new actors and directors. Check out for the best movies of Tollywood for the year 2014 in the slideshow..
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X