»   »  స్టార్ హీరో ని...ఎస్వీ రంగారావు చేసిన పాత్రకు ఖరారు, గెస్ చేయగలరా ఆ స్టార్ ఎవరో?

స్టార్ హీరో ని...ఎస్వీ రంగారావు చేసిన పాత్రకు ఖరారు, గెస్ చేయగలరా ఆ స్టార్ ఎవరో?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : కొద్ది కాలం క్రితం...కాకతీయ సామ్రాజ్ఞి రాణి రుద్రమ జీవిత గాథని 'రుద్రమదేవి'గా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు గుణశేఖర్‌. తదుపరి ఆయన 'హిరణ్యకశ్యప' చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారు. 'ది స్టోరీ ఆఫ్‌ భక్తప్రహ్లాద' అనే ఉపశీర్షికతో రూపొందనున్న ఆ సినిమాని వచ్చే యేడాది ప్రారంభించటానికి సన్నాహాలు చేస్తున్నారు.

అయితే ఆయన ఆలోచన బాగానే ఉంది కానీ ఎస్వీ రంగారావు వంటి మహానటుడు నటించిన ఆ పాత్రను ఈ కాలంలో పోషించే నటుడు ఎవరు అనేది ఆసక్తికరమే. అయితే ఈ చిత్రంలోని ప్రధాన పాత్రలో ఓ స్టార్ హీరో నటిస్తారని దర్శకుడు గుణశేఖర్‌ వెల్లడించారు. మరో ప్రక్క ఓ తమిళ హీరో ఈ సినిమాలో చేస్తాండున్నారు. తెలుగులోనూ పేరు తెచ్చుకున్న స్టార్ హీరో ఎవరున్నారన్నది ప్రశ్నార్దకమే.

who is Gunasekhar's Hiranyakashipa?

ఆయన మీడియాతో మాట్లాడుతూ ''నాకు భక్త ప్రహ్లాద కథంటే చాలా ఇష్టం. అందులో హిరణ్యకశ్యపుడి పాత్ర నన్ను ఎప్పట్నుంచో వెంటాడుతోంది. భాగవతం చదువుతున్నప్పుడు ఆ పాత్రకి సంబంధించి పలు కీలకమైన విషయాలు తెలిశాయి.

ఆ నేపథ్యంలోనే ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నా. హిరణ్యకశ్యప పాత్ర కోణంలో భక్తప్రహ్లాద కథని చెప్పే ప్రయత్నమిది. ఇటీవల హీరోలు ప్రతినాయకులుగా నటించేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఈ సినిమాలోనూ హిరణ్యకశ్యప పాత్రలో ఓ స్టార్ హీరో నటిస్తారు.

అదెవరనేది వచ్చే నెలలో ప్రకటిస్తాం. అత్యున్నత సాంకేతిక హంగులతో ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నాం. ఒక ప్రఖ్యాత నిర్మాణ సంస్థతో కలిసి స్వయంగా చిత్రాన్ని నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్నామ''న్నారు. 'రుద్రమదేవి' ప్రేక్షకుల ముందుకొచ్చాక గుణశేఖర్‌ 'ప్రతాపరుద్రుడు' తెరకెక్కించబోతున్నారని ప్రచారం సాగింది.

who is Gunasekhar's Hiranyakashipa?

ఆ విషయంపై ఆయన స్పందిస్తూ ''2018లో 'ప్రతాపరుద్రుడు' చిత్రాన్ని పట్టాలెక్కిస్తాను''అని స్పష్టం చేశారు. అవునూ ఇంతకీ ఆ స్టార్ హీరో ఎవరంటారు.. రానా తో చేస్తారా లేక అల్లు అర్జున్ ని ఒప్పించారా...ఎవరు చేయబోతున్నారో చూడాలి.

గుణశేఖర్ తన 'గుణ టీమ్ వర్క్స్' బేనర్ మీద 'హిరణ్య కశ్యప' అనే టైటిల్ రిజిస్టర్ చేయించడంతో అంతటా హాట్ టాపిక్ గా మారింది. ఈ పేరుతో ఓ తమిళ నటుడిగా హీరోగా పెట్టి మల్టీ లాంగ్వేజ్ ఫిల్మ్ తీయాలని గుణశేఖర్ ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.

వాస్తవానికి హిరణ్య కశ్యపుడు అనగానే ఆటోమేటిగ్గా 'భక్త ప్రహ్లాద' సినిమా గుర్తుకొస్తుంది. అందులో ఎస్వీఆర్ పోషించింది హిరణ్య కశ్యపుడి పాత్రే. మరి క్లాసిక్‌గా నిలిచిపోయిన 'భక్తప్రహ్లాద'కు కొత్త వెర్షన్ తీయడానికి గుణశేఖర్ సన్నాహాలు చేస్తున్నాడని అంటున్నారు. ఈ సినిమా హిరణ్య కశ్యపుడి కోణంలోనే సాగుతుందని తెలుస్తోంది. హాలీవుడ్ లో పాత క్లాసిక్స్ ని మరోసారి రీమేక్ చేస్తున్న ట్రెండ్ నడుస్తోంది. దాంతో తెలుగులో కూడా అలాంటి ప్రయత్నమే చేయాలని గుణశేఖర్ భావిస్తున్నారట.

English summary
'Hiranyakashipa - The Story of Bhakta Prahlad' title was registered recently at Film Chamber of Commerce on his Gunaa Team Works banner.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu