TRENDING ON ONEINDIA
-
మంత్రి ఆదికి షాక్: జమ్మలమడుగు అభ్యర్ధిని తేల్చేసారు
-
మీ పాత కారుని కొత్తగా మార్చటం ఎలా.?
-
రూ.4999కే led hd smart tv, ఎలా సొంతం చేసుకోవాలో తెలుసుకోండి
-
వాళ్లంతా మహానుభావులు.. అమ్మాయిల క్లీవేజ్, తొడలు చూసేస్తారు.. నాగబాబు ఘాటు వ్యాఖ్యలు!
-
కోబ్రా దెబ్బకు షారుఖ్ కంపెనీ గింగిరాలు?
-
చీర కట్టుకోవడాన్ని అమితంగా ఇష్టపడుతారా ? ప్రయాణాలకు ఈ చీరలు
ఇంతకీ 'క్రిష్ 3' లో హీరోయిన్ ఎవరు?
ముంబై: హృతిక్ రోషన్ హీరోగా రాకేశ్ రోషన్ రూపొందించిన చిత్రం 'క్రిష్ 3' . ఈ చిత్రం నవంబర్ 1న హిందీ, తెలుగు, తమిళ భాషల్లో ఏక కాలంలో విడుదలవుతోంది. 2013లో రూపొందిన అత్యంత ఖరీదైన భారతీయ చిత్రాల్లో ఒకటిగా, అత్యంత ఆసక్తికర చిత్రాల్లో ఒకటిగా విశ్లేషకులు పేర్కొంటున్న ఈ చిత్రంలో విలన్‌గా వివేక్ ఓబరాయ్ కనిపించనుండగా, ప్రియాంకా చోప్రా, కంగనా రనౌత్ మరో రెండు ప్రధాన పాత్రలు పోషించారు. ఈ ఇద్దరిలో అసలు హీరోయిన్ ఎవరనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. 'క్రిష్'లో హృతిక్ ప్రేయసిగా కనిపించిన ప్రియాంక ఆ చిత్రానికి కొనసాగింపుగా ఉండే ఈ చిత్రంలో అతని భార్యగా కనిపించబోతోంది. అందువల్ల ఇందులో హీరోయిన్ కంగన కాదనీ, తానేననీ ఆమె అంటోంది. మరోవైపు తనది సెకండ్ హీరోయిన్ కేరక్టర్ కాదనీ, తాను కూడా హృతిక్‌తో రొమాన్స్ చేశాననీ కంగన చెబుతోంది.
ప్రియాంక చోప్రా మాట్లాడుతూ...'క్రిష్ 3'లో హీరోయిన్‌గా చేసింది తానేనని ప్రియాంకా చోప్రా స్పష్టం చేసింది. ఇందులో కంగనా రనౌత్ కూడా నటించింది. మొదట్లో ప్రియాంకతో తెరను పంచుకోవడానికి ఇష్టపడని కంగన ఈ చిత్రంలో నటించేందుకు అనాసక్తి చూపింది. జాక్వలిన్ ఫెర్నాండెజ్, చిత్రాంగదా సింగ్ సైతం ఇదే అంశం కారణంగా ఆ సినిమా చేయడానికి తిరస్కరించారు. "ఆ పాత్రను చాలా మంది అమ్మాయిలు తిరస్కరించారు. అది అమేజింగ్ రోల్. నేను హృతిక్ భార్యగా నటించాను. ఈ సినిమాకి హీరోయిన్‌ను నేనే'' అని ఆమె తెలిపింది.
కంగన చేసింది కూడా మంచి పాత్రేనని చెబుతూ "ఆ పాత్రను చేసే అవకాశమిస్తే తప్పకుండా చేసేదాన్ని. దాన్ని చేయడానికి ఎవరూ రాకపోతే, నేను చేస్తానని రాకేశ్ గారికి చెప్పాను. అది చాలా ఆసక్తికరమైన పాత్ర. దాన్ని కంగన చేసినందుకు హ్యాపీ. ఆమె చాలా బాగా చేసింది. ఆ పాత్రలో ఆమె గొప్పగా కనిపిస్తోంది. హిందీ సినిమాకి ఇదో కొత్త విషయం'' అంది ప్రియాంక. అయితే ఆ ఇద్దరి మధ్యా సఖ్యత లేదనీ, అందువల్లే ఆ సినిమా ప్రచార కార్యక్రమాల్లో ఆ ఇద్దరూ కలిసి ఎక్కడా కనిపించలేదనీ బాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. ఈ ప్రచారాన్ని కూడా ప్రియాంక ఖండించింది. ఈ చిత్రంలో తనది రెండు రకాల ఛాయలున్న పాత్ర అని తెలిపింది.
కంగనా మాట్లాడుతూ...'క్రిష్ 3'లో తనది సెకండ్ హీరోయిన్ రోల్ అంటే ఒప్పుకోను గాక ఒప్పుకోనని కుండబద్దలు కొడుతోంది కంగన. "మీరు సెకండ్ హీరోయిన్ రోల్ అనంటే వింటానికే అది చాలా డిజప్పాయింటింగ్‌గా ఉంటుంది. నేనేమీ చేయలేదనే ఫీలింగ్‌ని ఆ మాట కలిగిస్తుంది. ఈ సినిమాలో నేను చేసింది సాధారణ అమ్మాయి పాత్ర కాదు. సినిమాకి చాలా కీలకమైన పాత్ర. ఇందులో నేను హృతిక్‌తో రొమాన్స్ చేస్తాను. అయితే ఇది కచ్చితంగా ఇద్దరు హీరోయిన్ల సినిమా కాదు. హృతిక్ కోసం నేను, ప్రియాంక కొట్టుకోము'' అని ఆమె చెప్పింది.
గతంలో రాకేష్ నిర్మించిన 'క్రిష్', 'ధూమ్ 2' తెలుగు,తమిళ భాషల్లో అనువాదం చేయగా హృతిక్‌కు మంచి ఆదరణ లభించింది. బాలీవుడ్‌తో పాటు తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌ల్లో కూడా హృతిక్‌కు భారీగా '్ఫ్యన్ ఫాలోయింగ్' ఏర్పడింది. గతంలో తాను నిర్మించిన 'క్రిష్'ను ప్రతి భారతీయుడు ఆస్వాదించాలన్న తపనతో డబ్బింగా చేయించి ఇతర భాషల్లో విడుదల చేయించినట్లు రాకేష్ గుర్తు చేస్తున్నాడు. దక్షిణాది ప్రేక్షకులూ తన సినిమాలను ఆదరించడం ఎంతో ఆనందం కలిగించిందని అంటున్నాడు.
'క్రిష్ 3'ని అనువాదం చేసి ఎప్పుడు విడుదల చేస్తారని దక్షిణాదికి చెందిన సినీ పంపిణీదారులు తనను పదే పదే అడుగుతున్నారని తెలిపాడు. కన్నడ, మలయాళం కంటే తెలుగు, తమిళ భాషల్లో సినీ పరిశ్రమ బాగా విస్తరించిందని అంటున్నాడు. వాణిజ్యపరమైన కోణంలో ఆలోచించినా అనువాద చిత్రాలకు దక్షిణాదిలో మంచి డిమాండ్ ఉందని రాకేష్ విశే్లషిస్తున్నాడు. 'ఫిల్మ్ క్రాఫ్ట్' పతాకంపై రాకేష్ దర్శక, నిర్మాతగా రూపొందించిన 'క్రిష్ 3' నవంబర్ 1న విడుదల కాబోతోంది.