»   » జక్కన్న నెక్స్ట్ హీరో ఎవరు? ఎన్టీఆర్ ఉన్నట్టా లేనట్టా??

జక్కన్న నెక్స్ట్ హీరో ఎవరు? ఎన్టీఆర్ ఉన్నట్టా లేనట్టా??

Posted By:
Subscribe to Filmibeat Telugu

రాజమౌళి భూటాన్ లో హాలిడే ఎంజాయ్ చేస్తుండగా.. ఇక్కడ రాజమౌళి తర్వాతి సినిమాలో ఎలా అయినా తమదే కావాలనిప్రయత్నిస్తున్నారట మన హీరోలు.. ఇప్పుడు ఇండియాలోమోస్ట్ వాంటెడ్ డైరెక్టర్ ఎవరు అంటే మరో మాట లేకుండా ఎస్.ఎస్.రాజమౌళి పేరు చెప్పేయొచ్చు. 'బాహుబలి'తో అతడికొచ్చిన పేరు అంతా ఇంతా కాదు. దేశమంతా ఈ దర్శక ధీరుడి గురించే చర్చించుకుంటోంది.

నా సంగతి ఏమిటీ

నా సంగతి ఏమిటీ

అయితే అందరి సంగతీ ఏమోగానీ రాజమౌళితో తన నాలుగో సినిమా చేయాలని చాలా ఏళ్లుగా ప్రయత్నిస్తున్నాడు జూనియర్ ఎన్టీఆర్. కానీ ప్రతీసారీ ఏదో అవాంతరం. ఈగ ఆడియో ఫంక్షన్ లోనే "ఇంత లేట్ చేస్తున్నాడు మరి నా సంగతి ఏమిటీ" అంటూ కామెడీ గానే అయినా తన కోరిక ని బయటపెట్టాడు యంగ్ టైగర్.

అయిదేళ్ళు గడిచి పోయాయ్

అయిదేళ్ళు గడిచి పోయాయ్

దీన్ని సంపేస్తే పీడా వదిలి పోతుంది అంటూ ఈగ "మస్కట్" (లోపల మనిషి ఉండి పైకి ఈగలా కనిపించే బొమ్మ) మీదకి దూసుకుపోయాడు. ఆ తర్వాత బాహుబలి ని నెత్తిన పెట్టుకున్న రాజమౌళికి మళ్ళీ పక్కకు చూడటానికి కూడా వీలు లేకుండా అయిదేళ్ళు గడిచి పోయాయ్.

జై లవకుశ ముగియగానే

జై లవకుశ ముగియగానే

అందుకే ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ రాజమౌళిని తనతో సినిమా చేసేందుకు ఒప్పించాలని చూస్తున్నాడట తారక్. ‘జై లవకుశ' ముగియగానే అందుబాటులోకి వస్తానంటూ రాజమౌళి ఫ్యామిలీకి సమాచారం ఇచ్చాడట. ఇలా ఒకరూ ఇద్దరూ కాదు దాదాపు టాలీవుడ్, బాలీవుడ్ హీరోలూ టెక్నీషియన్లూ ఇప్పుడు రాజమౌళి కోసం ఒక్క సినిమా అయినా చేయటానికి తహతహ లాడుతున్నారు.

తర్వాతి సినిమా

తర్వాతి సినిమా

మహాభారతం చేస్తున్నాడు అంటూ టాక్ వచ్చినా నిజానికైతే తన తర్వాతి సినిమా ఏదో ఇంకా తేల్చలేదు జక్కన్న. అందుకే ఆ అవకాశం తామే దక్కించుకోవాలని చాలామంది ప్రయత్నిస్తున్నారు. బాలీవుడ్ నుంచి కూడా రాజమౌళికి ఆఫర్లు వస్తున్నప్పటికీ జక్కన్న ఆలోచనమాత్రం వేరుగా ఉంది.

నెక్స్ట్ స్టెప్ ఏం తీసుకోబోతున్నాడో

నెక్స్ట్ స్టెప్ ఏం తీసుకోబోతున్నాడో

ప్రాథమికంగా తెలుగు సినిమానే చేయాలని రాజమౌళి భావిస్తున్నట్లు తెలుస్తుండటంతో అతడితో జట్టు కట్టేందుకు హీరోలు.. నిర్మాతలు తమవంతు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. మరి రాజమౌళి నెక్స్ట్ స్టెప్ ఏం తీసుకోబోతున్నాడో భూటాన్ నుంచి వచ్చాక అయినా చెప్తాడో లేదో ఆయనకే తెలియాలి.

భీబత్సమైన సినిమా తీసాక

భీబత్సమైన సినిమా తీసాక

మామూలుగా అయితే ఒక భీబత్సమైన సినిమా తీసాక మళ్ళీ ఒక సాఫ్ట్ సినిమా తీయటం రాజమౌళి పద్దతి. ఆ లెక్కన ఏ ఎక్స్పెక్టేషనూ లేని చ్ఘిన్న హీరో తోకూడా సినిమా అనౌన్స్ చేసినా చెయ్యొచ్చు. ఎందుకంటే మరీ పెద్ద పెద్ద స్టార్ హీరోలతో సినిమా చేయడు రాజమౌళి.

ఎన్టీఆర్, ప్రభాస్ తప్ప

ఎన్టీఆర్, ప్రభాస్ తప్ప

ఇప్పటివరకూ,ఎన్టీఆర్, ప్రభాస్ తప్ప పెద్ద హీరోలు లేరు. అసలు సింహాద్రి చేసేనాటికి టాప్ హీరో ట్యాగ్ ఇంకా యంగ్ టైగర్ మెడలో పడలేదు. ఆతర్వాత బాలీవుడ్ టాప్ స్టార్ లిస్ట్ లో చేరి పోయాడు, ప్రభాస్ కూడా అగ్రహీరో రేంజ్ కి బాహుబలికి ముందు చేరుకోలేదు... మిర్చి తర్వాత వచ్చిన బాహుబలి పార్ట్ వన్ ప్రభాస్ ని అమాంతం స్టార్లకే స్టార్ ని చేసిపడేసింది.

English summary
Everyone is curious to know what Rajamouli’s next project will be and Who is jakkanna's next Hero
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu