»   » నటనలో మన స్టార్ హీరోల్లో ఎవరు బెస్ట్?

నటనలో మన స్టార్ హీరోల్లో ఎవరు బెస్ట్?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : ఫిల్మ్ ఫేర్ అవార్డు వచ్చిందంటే ఆ కిక్కే వేరు. అందుకే సినీ పరిశ్రమ మొత్తం ఆ అవార్డుల వైపు ఆసక్తిగా చూస్తూంటుంది. సిని అభిమానూలు సైతం తమ హరోకి అవార్డు వచ్చిందా లేదా అనేది నిశితంగా పరిశీలిస్తూంటారు. ఈ నేపధ్యంలో 61వ ఐడియా సౌత్ ఫిల్మ్ ఫేర్ అవార్డుల-2013 నామినేషన్స్ వివరాలు వెలబడ్డాయి. తెలుగు నుంచి స్టార్ హీరోలు పోటీలో ఉన్నారు. వీరిలో ఎవరిని ఈ అవార్డుని వరిస్తుంది అనేది అంతటా చర్చగా మారింది.

తెలుగు, తమిళం, మళయాలం, కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీల్లో వివిధ కేటగిరీల్లో నేమినేట్ అయినా సినిమాలు, నటులు, దర్శకులు...ఇతర టెక్నీషియన్స్ వివరాలు ప్రకటించారు. ఓటింగ్ ఆధారంగా వీటి నుండి విజేతల వివరాలు ప్రకటించనున్నారు. జులై 12న చెన్నైలోని స్పోర్ట్స్ డెవలప్మెంట్ అథారిటీ(నెహ్రూ ఇండోర్ స్టేడియం)లో జరిగే కార్యక్రమంలో విజేతల వివరాలు ప్రకటించనున్నారు.

ఈ అవార్డుల వేడుక చాలా ప్రతిష్టాత్మకంగా జరుగుతుంది. భారతేదేశం మొత్తం లో ని మేజర్ మీడియా దీన్ని కవర్ చేయటానికి ప్రయత్నిస్తుంది. లోకల్ మీడియా సంస్ధలు సైతం ఈ వార్తలకు ప్రయారిటీ ఇస్తూంటాయి. ఈ పోటీలో మన తెలుగు హీరోలలో ఎవరెవరు ఏ సినిమాల నుంచి పోటీ పడుతున్నారు...అనేది క్రింద స్లైడ్ షో లో చూడండి...

స్లైడ్ షోలో...

మహేష్ బాబు

మహేష్ బాబు

మహేష్ బాబు, వెంకేటేష్ కాంబినేషన్ లో రూపొందిన సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు చిత్రం మంచి విజయం సాధించిన సంగతి తెలిసిందే. కుటుంబ కథా చిత్రంగా రూపొందిన ఈ చిత్రం లో మహేష్ పాత్రకు మంచి ప్రశంసలు లభించాయి. తమ్ముడుగా, తండ్రికి భాధ్యత గల తండ్రిగా అతని పాత్రను చాలా శ్రద్దగా రూపొందించారు దర్శకుడు. దాంతో మహేష్ ఈ పోటీలో ఈ చిత్రం ద్వారా ఉన్నారు.

నితిన్

నితిన్

నితిన్ సెకండ్ ఇన్నింగ్స్ లో సూపర్ హిట్ గా నిలిచిన చిత్రం గుండె జారి గల్లంతైంది. కామెడీ, సెంటిమెంట్,ప్రేమ,భావోద్వేగాలు మిళితమైన ఈ చిత్రం లో నితిన్ నటనకు కాను మంచి మార్కులు పడ్డాయి. ఓ ప్రేమికుడుగా అతని నటనతో ఈ పోటీలో నామినేషన్ కు వచ్చారు.

పవన్ కళ్యాణ్

పవన్ కళ్యాణ్

పవన్ కళ్యాణ్ సూపర్ హిట్ చిత్రం అత్తారింటికి దారేది. ఈ చిత్రం క్లైమాక్స్ లో పవన్ నటన అందరి ప్రశంశలు పొందింది. తాతకు ఇచ్చిన మాట కోసం అత్తను తీసుకు వెళ్లటానికి వచ్చిన పవన్ పాత్రను త్రివిక్రమ్ డైలాగులో పండించారు.

ప్రభాస్

ప్రభాస్

ప్రభాస్ కు రీసెంట్ గా వచ్చిన సూపర్ హిట్ మిర్చి. కొరటాల శివ దర్శకుడుగా పరిచయమవుతూ చేసిన ఈ చిత్రంలో ప్రభాస్ ...రెండు ఊళ్లను కలపటానికి, ప్రేమిస్తే పోయేదేముంది డ్యూడ్ అంటూ డైలాగులు చెప్తూ కూల్ గా నటించారు. ఆ పాత్ర అందరి మన్ననలూ పొందింది.

రామ్ చరణ్

రామ్ చరణ్

రామ్ చరణ్ కు కమర్షయల్ గా సూపర్ హిట్ ఇచ్చిన చిత్రం నాయక్. వివి వినాయిక్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో రామ్ చరణ్ ద్విపాత్రాభినయం చేసారు. రెండు పాత్రల్లోనూ వేరియేషన్ చూపించి శభాష్ అనిపించుకున్నారు.

English summary
The Filmfare nominations for the year 2013 has been announced. Here are the actors competing for the Best Actor Male award.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu