For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  సిక్స్‌ప్యాక్‌తో హల్‌చల్.. టాలీవుడ్‌లో సెక్సీ హీరో ఎవరంటే..

  By Rajababu
  |

  టాలీవుడ్‌లో యువ హీరోలతోపాటు సీనియర్ హీరోలు కూడా సెక్సీ లుక్‌తో హల్‌చల్ చేస్తున్నారు. పాత్ర కోసం కష్టాలను ఓర్చుకొని కూడా సిక్స్‌ప్యాక్‌‌కు సిద్ధపడి ప్రేక్షకుల మదిలో స్థానాన్ని కొల్లగొట్టారు. ఆరోగ్యకరమైన వాతావరణంలో ప్రభాస్, అల్లు అర్జున్, ఎన్టీఆర్, రాంచరణ్, సుధీర్, నితిన్, సునీల్ లాంటి వాళ్లు తమ శరీరాకృతితో ప్రేక్షకులను మెప్పిస్తున్నారు. సినీ అభిమానులను ఆకట్టుకోవడానికి తమ సెక్సీ లుక్‌ను ఎలా మార్చుకొన్నారో మీరే చూడండి..

   అల్లు అర్జున్ దేశముదురు

  అల్లు అర్జున్ దేశముదురు

  స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ దేశ ముదురు చిత్రం కోసం తొలిసారి మరింత స్టైలిష్‌గా కనిపించారు. సిక్స్‌ప్యాక్‌తో అదరగొట్టేశారు. ఆ తర్వాత తన లుక్‌ను ఎప్పటికప్పుడు మార్చుకొంటూ ఫ్యాన్స్ గణనీయంగా పెంచుకొన్నారు.

   బాహుబలిలో యోధుడిగా ప్రభాస్

  బాహుబలిలో యోధుడిగా ప్రభాస్

  ఫ్యాన్స్, సినీ అభిమానుల నుంచి అంచనాలు పెరుగుతున్న కొద్ది ప్రభాస్ కూడా తన లుక్‌ను గణనీయంగా మార్చేస్తున్నాడు. సినిమా, పాత్ర ప్రాధాన్యాన్ని దృష్టిలో పెట్టుకొని తగిన జాగ్రత్తలు తీసుకొంటున్నాడు. బాహుబలిలో యోధుడిగా సిక్స్‌ప్యాక్‌తో తెరమీద విశ్వరూపం చూపించాడు.

   ధ్రువ కోసం చెర్రీ

  ధ్రువ కోసం చెర్రీ

  సినీ పోటీ ప్రపంచంలో తానేమీ తక్కువ కాదని మెగా పవర్‌స్టార్ రాంచరణ్ నిరూపించాడు. ధ్రువ లాంటి యాక్షన్ సినిమా కోసం సిక్స్‌ప్యాక్‌తో ఆకట్టుకొన్నారు. పోలీస్ పాత్ర కోసం చాలా ధృడంగా మారాడు. ధ్రువ చిత్రంలో రాంచరణ్ లుక్ ఫ్యాన్స్‌ను విఏషంగా ఆకట్టుకొన్నది.

   అదరగొట్టిన ఎన్టీఆర్

  అదరగొట్టిన ఎన్టీఆర్

  సిల్వర్ స్క్రీన్‌పై యాక్టింగ్‌కే ప్రాధాన్యమిచ్చే జూనియర్ ఎన్టీఆర్ టెంపర్ కోసం తన బాడీ లుక్‌ను మార్చుకొన్నారు. పూరీ జగన్నాథ్ సూచన మేరకు ఎన్టీఆర్ ఫస్ట్ టైం సిక్స్‌ప్యాక్‌తో కనిపించారు. ఎన్టీఆర్ చేసిన సిక్స్‌ప్యాక్‌కు మంచి రెస్పాన్ వచ్చింది.

   ముందుగానే నితిన్

  ముందుగానే నితిన్

  యువ హీరోల్లో ఎప్పుడూ కొత్తదనం కోసం తాపత్రయపడే నితిన్ తన విక్టర్ చిత్రం కోసం సిక్స్‌ప్యాక్‌లో కనిపించారు. ఆ చిత్రం పెద్దగా ప్రజాదరణ పొందకపోయినా నితిన్ కష్టానికి మంచి ఫలితం దక్కింది. నితిన్ లుక్‌కు మీడియాలో బ్రహ్మండమైన రెస్సాన్స్ వచ్చింది.

   వాహ్ సునీల్.. గ్రేట్

  వాహ్ సునీల్.. గ్రేట్

  కమెడియన్ తెలుగు ప్రేక్షకుల గుండెల్లో స్థానం సంపాదించుకొన్న సునీల్ హీరోగా మారిన తర్వాత తన బాడీని పూర్తిగా మార్చుకోవడం టాలీవుడ్‌లో సంచలనం రేపింది. ఎవరూ ఊహించని విధంగా సిక్స్‌ప్యాక్‌లో కనిపించింది సినీ ప్రముఖులను నివ్వెరపాటుకు గురిచేశారు. పూలరంగడు కోసం సునీల్ పెద్ద సాహసమే చేశాడని చెప్పవచ్చు.

   సుధీర్ కూడా సూపర్

  సుధీర్ కూడా సూపర్

  ఇక ప్రిన్స్ మహేశ్ బాబు బావగా, ఘట్టమనేని అల్లుడిగా ఇండస్ట్రీలోకి ప్రవేశించిన సుధీర్‌బాబు తన తొలి చిత్రం ఎస్సెమ్మెస్‌లో సిక్స్‌ప్యాక్‌తో ప్రేక్షకులకు ఝలక్ ఇచ్చారు. ఇటీవల హిందీలో వర్షం రీమేక్‌లో మరోసారి బాలీవుడ్ ప్రేక్షకులకు తన సత్తా చాటారు. పుల్లెల గోపిచంద్ బయోపిక్ కోసం సుధీర్ తన బాడీని సెక్సీగా మార్చుకొంటున్నట్టు సమాచారం.

   ప్రిన్స్ కూడా ఏ మాత్రం తగ్గలే..

  ప్రిన్స్ కూడా ఏ మాత్రం తగ్గలే..

  ప్రిన్స్ మహేశ్‌బాబుకు తెర మీద చాలా డిసెంట్‌గా కనిపిస్తారనే పేరున్నది. అర్ధనగ్నంగా మహేశ్ కనిపించిన దాఖలు చాలా కష్టంగా కనిపిస్తాయి. కానీ 1 నేనొక్కడే చిత్రం కోసం మహేశ్ సిక్క్ ప్యాక్ చేశాడనే వార్తలు వచ్చాయి. కానీ స్క్రీన్ మీద ఎందుకో చూపించడానికి మొహమాటం పడ్డారు. వెనుక నుంచి తీసిన షాట్‌‌తో జస్ట్ ఓ టేస్ట్ చూపించారు ప్రిన్స్.

   మన్మధుడు నాగ్ కూడా ఝలక్

  మన్మధుడు నాగ్ కూడా ఝలక్

  యువ నటులే కాదు.. సీనియర్ హీరో టాలీవుడ్ మన్మధుడు నాగార్జున కూడా సిక్స్‌పాక్ రుచిని ప్రేక్షకులకు చూపించారు. డమరుకం చిత్రంలో పాత్ర డిమాండ్ మేరకు సిక్స్‌ప్యాక్‌లో నాగార్జున దర్శన మిచ్చారు. నాగ్ సిక్స్‌ప్యాక్‌కు ప్రేక్షకుల నుంచి బ్రహ్మండమైన స్పందన వచ్చింది.

  English summary
  Tollywood heroes are trying differently with best look. Prabhas, Allu Arjun, NTR, Ram Charan are tried for six pack look for their roles. They look sexy in different getup.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X