»   » ఒక్క రోజులో 2 లక్షలు: రజనీ ఫాలో అయ్యేదెవరిని?

ఒక్క రోజులో 2 లక్షలు: రజనీ ఫాలో అయ్యేదెవరిని?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: సౌత్ సూపర్ స్టార్ రజనీకాంత్ నిన్న ట్విట్టర్ అకౌంట్ ఓపెన్ చేసిన సంగతి తెలిసిందే. సాధారణంగా మీడియాకు దూరంగా ఉండే రజనీకాంత్ ఉన్నట్టుండి సోషల్ మీడియాలో చేరడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఏది ఏమైనా రజనీకాంత్ అభిమానులు మాత్రం ఆయన ట్విట్టర్ ఖాతా తెరవడంపై ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

కాగా...రజనీకాంత్ ట్విట్టర్ ఖాతా ఓపెన్ చేసారనే విషయం తెలియగానే ట్విట్టర్లో ఆయన్ను ఫోలో కావడానికి అభిమానులు పోటీ పడ్డారు. ట్విట్టర్ ఖాతా తెరిచిన గంట వ్యవధిలో ఆయన్ను ఫాలో అయ్యే వారి సంఖ్య 50 వేలు దాటింది. 24 గంటలు గడిచేలోగా ఈ సంఖ్య 2లక్షలు మార్కను అందుకుంది.

రజనీకాంత్‌కు ఏ రేంజిలో ఫాలోయింగ్ ఉందో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. అయితే రజనీకాంత్ మాత్రం ఇప్పటి వరకు ఎవరినీ ఫాలో కావడం లేదు. ఆయన దేశ వ్యాప్తంగా ఎంతో మంది ప్రముఖులు స్నేహితులుగా ఉన్నారు. బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ, షారుక్ ఖాన్, అమితాబ్ బచ్చన్ ఇలా చాలా మంది ఉన్నారు. మరి రజనీకాంత్ వీరిలో మొదట ఎవరిని ఫాలో అవుతారు? అనే విషయమై అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

తొలి వ్యక్తి ఎవరు?

తొలి వ్యక్తి ఎవరు?

రజనీకాంత్ తొలుత ఎవరిని ఫాలో అవుతారు? అనే విషయం ఇపుడు సర్వత్రా చర్చనీయాంశం అయింది. బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ, అమితాబ్ బచ్చన్, షారుక్ ఖాన్‌లలో ఎవరో ఒకరిని ఆయన తొలుత ఫాలో అయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.

షారుక్ ఖాన్

షారుక్ ఖాన్

బాలీవుడ్ స్టార్ షారుక్ ఖాన్, రజనీకాంత్ మంది మధ్య మంచి స్నేహ బంధం ఉంది.

ఎం కరుణానిధి

ఎం కరుణానిధి

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధితో కూడా రజనీకాంత్‌కు మంచి సంబంధాలు ఉన్నాయి.

సౌందర్య వల్లనే..

సౌందర్య వల్లనే..

రజనీకాంత్ ట్విట్టర్లో చేరడానికి ప్రధాన కారణం ఆయన కూతురు సౌందర్య అని అంటున్నారు. ఆమె ప్రొత్సాహంతోనే ట్విట్టర్ ఖాతా ఓపెన్ చేసినట్లు తెలుస్తోంది.

ధనుష్

ధనుష్

రజనీకాంత్ ఫ్యామిలీలో ట్విట్టర్లో చేరిన మొదటి వ్యక్తి రజనీకాంత్ మొదటి అల్లుడు, సినిమా స్టార్ ధనుష్.

ఐశ్వర్య ధనుష్

ఐశ్వర్య ధనుష్

రజనీకాంత్ పెద్ద కూతురు ఐశ్వర్య ధనుష్ కూడా ట్విట్టర్లో ఉన్నారు. రజనీకాంత్ తొలుత ఫాలో అయ్యే వారి లిస్టులో ఈమె కూడా ఉండే అవకాశం ఉంది.

English summary
Rajinikanth has entered the Twitter with bang. The Tamil superstar has created a sensation in no time by becoming a highly debated topic on the social networking site. He crossed 50 thousand followers in just an hour after joining the twitter and in less than 24 hours, he has crossed 1.80 lakh followers.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu