»   » బయోపిక్ ఆలొచన జూనియర్ దేనా..? వెన్నుపోటు సంగతేంటి? వివాదాల బాలయ్య బయోపిక్

బయోపిక్ ఆలొచన జూనియర్ దేనా..? వెన్నుపోటు సంగతేంటి? వివాదాల బాలయ్య బయోపిక్

Posted By:
Subscribe to Filmibeat Telugu

బాలయ్య తర్వాతి సినిమా ఏంటి? కృష్ణవంశీతో రైతు సినిమా చేస్తాడా? లేదంటే వేరే డైరెక్టర్‌కు చాన్స్ ఇస్తాడా? అంటే వాటిపై మాత్రం క్లారిటీ లేదు గానీ.. ఎన్టీఆర్ బయోపిక్‌ను తీస్తానని ప్రకటించి సంచలనమే సృష్టించాడు.స్వర్గీయ నందమూరి తారకరామారావు జీవిత చరిత్రను సినిమాగా తెరకెక్కిస్తానని ప్రకటించాడు ఆయన తనయుడు, సినీ నటుడు, అనంతపురం జిల్లా హిందూపూర్‌ టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ.

బాలయ్య అలా ప్రకటించాడో లేదో.. దానిపైనా వివాదమూ రాజుకుంది. మరి అంత హఠాత్తుగా బాలయ్య.. ఎన్టీఆర్ బయోపిక్‌ను ప్రకటించడం వెనక కారణమేంటి? అంటే... ఇంతకుముందే ఎన్టీఆర్ బయోపిక్‌ను తీసేందుకు జూనియర్ ఎన్టీఆర్ సిద్దమయ్యాడట. అంతేకాదు.. ఆ సబ్జెక్ట్ మీద కథ సిద్దం చేయాల్సిదిగా డైరెక్టర్ పూరీ జగన్నాథ్‌కు సూచించాడట.

అదే పనిలో పూరీ జగన్నాథ్ నిమగ్నమయ్యాడని టాక్. అది ఆ నోట.. ఈనోట పడి బాలయ్య చెవికి చేరిందట. అందుకే ఇంత సడెన్‌గా ఎన్టీఆర్ బయోపిక్‌ను ప్రకటించాడని ఫిల్మ్‌నగర్‌లో వార్తలు హల్‌‌చల్ చేస్తున్నాయి. అంతేకాదు.. ఎన్టీఆర్‌పై అధ్యయనం చేస్తున్న పూరీ జగన్నాథ్‌నే డైరెక్టర్‌గా ఎంచుకునేందుకు ఆలోచిస్తున్నాడట బాలయ్య.

Who Will Play as ANR in NTR bio pic

ప్రస్తుతం స్క్రిప్ట్‌ వర్క్‌ జరుగుతోందట. ఇందుకోసం ఓ కమిటీని వేశామన్నారు బాలకృష్ణ. కుటుంబ సభ్యుల నుంచి కూడా స్వర్గీయ ఎన్టీఆర్‌ జీవిత చరిత్రపై వివరాలు సేకరిస్తున్నారట. అందరికీ తెల్సిన విషయాలే కాదు, ఎవరికీ తెలియని విషయాలు కూడా వుంటాయని సెలవిచ్చారు బాలకృష్ణ

ఎన్టీఆర్ జీవిత చరిత్రను సినిమా తీస్తానని బాలకృష్ణ చెప్పినప్పటి నుంచి ఏదో ఒక వార్త హల్ చల్ చేస్తూనే ఉంది.అంతా బాగానే వుందిగానీ, ఈ సినిమాలో ఎన్టీఆర్‌ రెండో సతీమణి లక్ష్మి పార్వతి పాత్ర ఎలా వుండబోతోంది.? స్వర్గీయ ఎన్టీఆర్‌ని వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు పాత్ర ఎలా వుండబోతోంది.? వంటి వివాదాల మాట కాసేపు పక్కనపెడితే..

తాజాగా మరో వార్త ఫిల్మ్‌నగర్‌లో హల్‌చల్ చేస్తోంది. ఎన్టీఆర్ జీవితంలో ఏఎన్నార్‌కు ఓ ప్రధాన పాత్ర ఉంది. ఇద్దరూ ఎన్నో చిత్రాల్లో కలిసి నటించారు. పోటాపోటీగా ఇద్దరూ సినిమాలు చేసినా.. నిజజీవితంలో ఎంతో సన్నిహితంగా ఉండేవారు. చెప్పాలంటే ఎన్టీఆర్, ఏఎన్నార్‌లు ఎంతో ఆప్యాయంగా ఉండే మిత్రులు. అందుకే ఎన్టీఆర్ బయోపిక్ అంటే.. అందులో కచ్చితంగా ఏఎన్నార్ ఉండాల్సిందేనని, ఏఎన్నార్ లేని ఎన్టీఆర్ బయోపిక్ అసాధ్యమని టాలీవుడ్ వర్గాలు చర్చించుకుంటున్నాయి. అయితే ఈ సందర్భం లో మరి ఆ పాత్రని పోషించే నటుడు ఎవరున్నారు అన్నది హాట్ టాపిక్

English summary
Nandamuri Balakrishna announces Biopic on Sr. NTR. He act as NTR, But who would playing Akkineni Nageswara Rao Role
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu