»   » అప్పుడు లేవని గొంతుకలు చలపతిరావుపై.. బాలయ్య, అలీలపై మాట్లాడలేదేంటి?

అప్పుడు లేవని గొంతుకలు చలపతిరావుపై.. బాలయ్య, అలీలపై మాట్లాడలేదేంటి?

Posted By:
Subscribe to Filmibeat Telugu

నటుడు చలపతిరావు మహిళలపై చేసిన అభ్యంతరకరమైన వ్యాఖ్యలపై సర్వత్రా నిరసన వ్యక్తమవుతున్నాయి. చలపతి తీరుపై మహిళా సంఘాలు దుమ్మెత్తిపోస్తున్నాయి. పలువురు సినిమా హీరోలు, హీరోయిన్లు సోషల్ మీడియాలో తీవ్రంగా స్పందిస్తున్నారు. తాము రూపొందిస్తున్న రారండోయ్ వేడుక చూద్దాం సినిమా ఆడియో ఆవిష్కరణ కార్యక్రమంలో ఈ వ్యవహారం చోటుచేసుకోవడంతో అక్కినేని నాగార్జున, నాగచైతన్య, రకుల్ ప్రీత్ సింగ్ ట్విట్టర్లో స్పందించారు. ఆడవాళ్లు ఆరోగ్యానికి హానికరమా అనే ప్రశ్నకు చలపతిరావు సమాధానం ఇస్తూ ఆడవాళ్లు కేవలం పక్కలోకే పనికి వస్తారు అని వ్యాఖ్యలు చేయడం వివాదానికి కేంద్ర బిందువుగా మారింది. అయితే గతంలో బాలకృష్ణ, ఆలీ చేసిన వ్యాఖ్యలను ఎందుకు వదిలేశారనే ప్రశ్నను లేవనెత్తుతున్నారు.

మీడియాలో చలపతి దుమారం

మీడియాలో చలపతి దుమారం

చలపతిరావు వివాదాస్పద వ్యాఖ్యలు సోషల్ మీడియాలో దుమారం రేపుతున్నా ప్రధాన పత్రికలు ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి లాంటి పత్రికలు ఆ ఊసే ఎత్తకపోవడంపై భిన్నరకాల వాదనలు వినిపిస్తున్నాయి. జబర్దస్ట్, పటాస్ లాంటి బూతు కార్యక్రమాలు నిర్వహిస్తున్న ఈనాడు గ్రూపు వాటిపై స్పందించాల్సి వస్తుందా అని, అలాగే పరమ బూతు కార్యక్రమంగా పేరు తెచ్చుకొన్న జబర్దస్ట్‌లో తమ పార్టీ ఎమ్మెల్యే, సినీ నటీ రోజా ఉన్నందున్న ఈ వ్యవహారాన్ని లో ప్రొఫైల్‌గా మెయింటెన్ చేస్తున్నారా అనే విషయంపై రకరకాల ప్రచారం జరుగుతున్నది. అలాగే ఆంధ్రజ్యోతి ఈ వ్యవహారం ఎత్తకపోవడానికి ఇతరత్రా కారణాలేమైనా ఉన్నాయా అనే వాదన వినిపిస్తున్నది.

చలపతిరావు వ్యాఖ్యలపై మహిళా సంఘాలు..

చలపతిరావు వ్యాఖ్యలపై మహిళా సంఘాలు..

ఓ వైపు సోషల్ మీడియాలో దుమారం లేస్తుండటం, మరోవైపు సెలబ్రీటీలు ఖండించడం జరిగిపోతున్నది. ఈ నేపథ్యంలో మహిళా సంఘాల నేతలు జూబ్లీహిల్స్ పోలీసు స్టేషన్‌లో కేసు నమోదు చేయడం జరిగింది. మహిళా సంఘాల ఫిర్యాదు మేరకు నటుడు చలపతిరావుపై ఏ విధమైన చర్యలు తీసుకొంటారో వేచి చూడాల్సిందే. అలాగే గతంలో బాలకృష్ణ, ఆలీ, ఇతర నటీనటులు మహిళలపై అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేసినా పట్టించుకొని మహిళా సంఘాల నేతలు ఇప్పడు యాక్టివ్‌గా రంగంలోకి దిగారేంటీ అనే మాట బలంగా వినిపిస్తున్నది.

రవి వీడియో ద్వారా క్షమాపణ

రవి వీడియో ద్వారా క్షమాపణ

ఇక చలపతిరావు వ్యాఖ్యలను సూపర్ అన్సర్ అంటూ కవరింగ్ ఇచ్చిన రవి ఆందోళనలో పడ్డాడు. బయటకు రాకుండానే ఓ వీడియో రూపంలో క్షమాపణ చెప్పి చేతులు దులిపేసుకొన్నాడు. అసలు చలపతిరావు ఏమన్నాడో నాకు వినపడ లేదని వివరణ ఇచ్చాడు. ఇలాంటి వ్యవహారంలో రవిని యాంకర్లు వెనుకేసుకు రావడంపై అభ్యంతరం వ్యక్తమవుతున్నది. తోటి మహిళలపై కామెంట్లు చేసిన వారిపై సానుభూతి చూపడం ఎందుకని నిలదీస్తున్నారు.

బాలకృష్ణ, ఆలీలను ప్రశ్నించలేదే..

బాలకృష్ణ, ఆలీలను ప్రశ్నించలేదే..

కడుపు చేస్తామంటూ ఒకరు.. అనుష్క తొడలు బాగున్నాయి. సమంత నడుము సమ్మగా ఉంటుంది అంటూ చేసిన వారిపై ఎందుకు వదిలారు అనే విషయాన్ని ప్రస్తుతం చర్చ జరుగుతున్నది. ఎమ్మెల్యే, సినీ నటుడిగా బాలయ్య, ప్రముఖ హాస్యనటుడు ఆలీ వ్యాఖ్యలు చేసినప్పుడు లేవని గొంతుకలు ఇప్పుడు చలపతిరావును ఎందుకు టార్గెట్ చేస్తున్నాయి అనే కొందరు ప్రశ్నిస్తున్నారు.

చలపతిరావు క్షమాపణతో..

చలపతిరావు క్షమాపణతో..

రారండోయ్ వేడుక చూద్దాం ఆడియో వేడుకలో చేసిన వ్యాఖ్యలపై నటుడు చలపతిరావు బేషరుతగా క్షమాపణలు చెప్పడంతో ఈ వివాదం తీవ్రత తగ్గుముఖం పట్టింది. టెలివిజన్ చానెళ్లకు వెళ్లి వివరణ ఇవ్వడంపై కొంత ఆగ్రహం తగ్గింది. చలపతిరావు ఉదంతం ఇతర నోటి దురుసు రాయుళ్లకు హెచ్చరికగా మారడం శుభపరిమాణం.

English summary
Actor Chalapatirao derogatory comments on Women become centre of the contraversy. For his comments, He tendered apology to women world. but question rises that Why hero balakrishna, comedian Ali ignored which same comments made by them.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu