»   » బాలకృష్ణతో సినిమా ఎందుకు ఆగిందంటే...

బాలకృష్ణతో సినిమా ఎందుకు ఆగిందంటే...

Posted By:
Subscribe to Filmibeat Telugu
హైదరాబాద్ : ఆ మధ్యన బాలకృష్ణ, బి.గోపాల్ కాంబినేషన్ లో ఓ చిత్రం ప్రారంభమయ్యి ఆగిపోయిన సంగతి తెలిసిందే. అంత క్రేజీ ప్రాజెక్టు ఎందుకు ఆగిపోయిందనే విషయం చాలా మందితి తెలియలేదు. ఈ నేపధ్యంలో బి.గోపాల్ మీడియాకు వివరణ ఇచ్చారు.

బి.గోపాల్ మాట్లాడుతూ...అవునండీ... దానికి కథ సెట్ కాలేదు. బాలయ్యతో నా సినిమా అంటే అంచనాలు ఎక్కువగా ఉంటాయి. అందుకే రాజీపడి ముందుకెళ్లలేకపోయాను. కచ్చితంగా ఓ శక్తివంతమైన కథాంశంతో బాలయ్యతో సినిమా చేస్తా. మా ఇద్దరి కాంబినేషన్‌లో వచ్చిన గత చిత్రాలను తలదన్నే స్థాయిలో ఆ సినిమా ఉంటుంది. ఆ ప్రయత్నాలు ఓ వైపు జరుగుతూనే ఉంటాయి అన్నారు.

ఇక ప్రస్తుతం నేను గోపీచంద్‌తో ఓ సినిమా చేస్తున్నాను. నయనతార హీరోయిన్. నా మార్క్ యాక్షన్‌తో పాటు, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా ఉంటుంది. గోపిచంద్‌లోని మాస్ యాంగిల్‌ని మరింత ఇనుమడింపజేసే విధంగా ఆయన పాత్ర ఉంటుంది. తన శారీరకభాషకు తగ్గ పాత్రను ఇందులో గోపి పోషిస్తున్నాడు అని చెప్పారు.

అలాగే నిర్మాత అభిరుచిని బట్టే సినిమా ఉండాలి. నిర్మాత శ్రేయస్సుకు తగ్గట్టుగా సినిమా తీయాలి. ప్రయోగాత్మక చిత్రాలు చేయాలని నాకూ ఉంటుంది. కానీ అందుకు తగ్గ నిర్మాత దొరకాలి కదా. సాధ్యమైనంతవరకూ నా దగ్గరకొచ్చే నిర్మాతలందరూ యాక్షన్, ఫ్యాక్షన్, మాస్ ఎంటర్‌టైనర్లనే అడుగుతారు. సుమోలు గాల్లో ఎగరేయడాలు, గాల్లో ట్రాక్టర్లను పల్టీలు కొట్టించడాలు, గొడ్డళ్లు చేతబూని హీరో నరమేథం చేయడాలు... అవన్నీ హీరోయిజాన్ని ఎలివేట్ చేయడానికే. సినిమా అనేది క్రియేటివ్ మీడియా. సాంకేతికంగానే కాదు, సృజన పరంగా కూడా ఎప్పటికప్పుడు కొత్తగా ఆలోచించాలి. అందుకే నా సినిమాల్లో యాక్షన్ సీక్వెన్స్‌లు సాధ్యమైనంత కొత్తగా ఉండటానికి ప్లాన్ చేస్తుంటాను అని చెప్పారు.

English summary
Directer B.Gopal Revels that why his project with Balakrishna stopped. He says that he is waiting for Story to Balakrishna.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu